సాక్షి, ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆదేశించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయసేకరణ జరిపించాలని సూచించింది. ప్రజాభిప్రాయసేకరణ విధివిధానాలను అఫిడవిట్‌లో పేర్కొనాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment