అమరావతి: బలవంతంగా తమ భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని సీఆర్డీఏ అధికారులకు ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. బారికేడ్లు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా అని ప్రశ్నించారు. ఉండవల్లిలో భూసేకరణపై ఆదివారం ఉండవల్లిలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు దాటి ముందుకు వస్తే వారిపై చర్య తీసుకునే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. భూములు ఇవ్వని రైతులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
అధికారుల తీరుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు పెట్టి ప్రజాభిప్రాయం సేకరించడంపై మండిపడ్డారు. అధికారుల వ్యవహరించిన తీరుకు నిరసనగా సభ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలు చేసినా తమకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని రాజధాని ప్రాంత రైతులు అంటున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ ఇలాగేనా?
Published Sun, May 28 2017 2:01 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
Advertisement
Advertisement