ఇదేం బాదుడు!
అడ్డగోలుగా పెరిగిన ఆస్తి పన్ను
పలు జోన్లలో మూడు రెట్లకు పైగా..
ఇక నల్లాలు కూడా భారమే
టాక్స్ పెంచినా.. అభివృద్ధి శూన్యం
అధికారుల నిర్వాకంపై పట్టణ ప్రజల ఆగ్రహం
మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలో 2015-16 సంవత్సరానికి ఆస్తి పన్నును విపరీతంగా పెంచారు. జోన్‌ల వారీగా విభజించి పన్నుమోత మోగించారు. చిన్న పెంకుటిళ్లకు కూడా అడ్డగోలుగా పన్ను విధించారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే పన్నులు పెంచడంపై ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నారుు. పన్నులు పెంచిన అధికారులు ఆ మేరకు అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. మేజర్ గ్రామ పంచాయతీ అరుున మానుకోట 2011 సెప్టెంబర్ 3న మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అరుుంది. మున్సిపాలిటీ పరిధిలో 16 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం బిల్ కలెక్టర్లు, ఆర్‌ఐ, ఆర్‌ఓఆర్ కలిసి పట్టణంలోని పలు ఇళ్ల కొలతలు వేశారు. గత ఏడాది అక్టోబర్ 10న మున్సిపల్ పాలక మండలి సమావేశం నిర్వహించి పన్ను పెంపుపై చర్చించగా, పలు పార్టీలు ఈ నిర్ణయూన్ని వ్యతిరేకించారుు. సీపీఐ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేశారు. అరుునా పన్ను విధింపు మాత్రం ఆగలేదు. మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 4 జోన్లుగా విభజించి పన్నులు వేశారు.
జోన్ల వారీగా పరిశీలిస్తే..
మొదటి జోన్‌లో నర్సంపేట రోడ్, మున్సిపల్ ఆఫీస్ రోడ్, గ్రెరుున్ మార్కెట్, మన్మోహన్‌రెడ్డి కాంప్లెక్స్ రోడ్, వెంకట్రామా టాకీస్ రోడ్, బస్టాండ్ రోడ్, వివేకానంద రోడ్, ఐఓబీ నుంచి మెయిన్ రోడ్, పోస్టాఫీస్ ఏరియా, బుక్క బజార్, బట్టల బజార్ మెయిన్ రోడ్, నెహ్రూ సెంటర్ రోడ్, ఏరియా ఆసుపత్రి, సారుుబాబా గుడి రోడ్, తహసీల్దార్ ఆఫీసు రోడ్, తొర్రూరు బస్టాండ్, నెహ్రూ సెంటర్, రామమందిరం రోడ్, శ్రీనివాస థియేటర్ రోడ్, కూరగాయల మార్కెట్, కోర్టు రోడ్, ఆఫీసర్ క్లబ్, ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నారుు.
రెండో జోన్‌లో..
మందుల బజార్, మాలబజార్, శిఖార్‌ఖానగడ్డ, బైపాస్ రోడ్, రూరల్ పోలీస్‌స్టేషన్ ఏరియా, గౌడ సంఘం ఏరియా, బస్టాండ్ రోడ్, బెస్త బజార్, చేపల మార్కెట్, బుక్క బజార్, అండర్ బ్రిడ్జి రోడ్, పులిగోపాల్ రెడ్డి నగర్, హరికిషన్ మిల్, నెహ్రూ సెంటర్‌లోని కొన్ని ప్రాంతాలు, సిద్ధార్థ స్కూల్ రోడ్, కృష్ణకాలనీ, అడ్వకేట్స్ కాలనీ, సర్వేపల్లి రాధాకృష్ణ కాలనీ ఉన్నారుు.
మూడో జోన్‌లో..
హరిజనవాడ, గుమ్ముడూరు, రామచంద్రాపురం కాలనీ, హస్తినాపురం, భవానీనగర్, స్నేహానగర్, ఆర్టీసీ రోడ్, బ్రాహ్మణ బజార్, వేణుగోపాలస్వామి గుడి, ముత్యాలమ్మ గుడి, మల్లం బజార్, మేదరి బజార్, బెస్త బజార్, కురవి రోడ్, ఇన్‌కేబుల్ బజార్, మార్వాడి సత్రం, సారుుబాబా గుడి ఎదురుగా, మాల బజార్, కంకరబోడ్, చిన్న మజీద్ వెనుక, వెంకటేశ్వర్ల బజార్, పత్తిపాక రోడ్, ఎల్‌ఐసీ ఆఫీస్ రోడ్, తొర్రూరు రోడ్ ఉన్నాయి.
నాలుగవ జోన్‌లో..
రాజీవ్‌నగర్, రామన్నపేట కాలనీ, భవానీశంకర్ తండ, బాబు జగ్జీవన్‌రావు నగర్, జ్యోతిబసు నగర్, దాసరి బజార్, గుండ్లకుంట, నందినగర్, హన్మంతరావు నగర్, రాహుల్ నగర్, గిరిప్రసాద్ నగర్, కంకరమిల్లుతండ, ఏటిగడ్డ తండ, ఎల్‌బీజీ నగర్, ఆర్టీసీ కాలనీ, సుందరయ్య నగర్, బీటీఆర్ నగర్, రెడ్యానాయక్ కాలనీ, వేల్పుల సత్యం కాలనీ, ఈద్గా కమిటీ ఏరియా, గోపాలపురం కాలనీ, ఆకుల లక్ష్మయ్య కాలనీ, అంబేద్కర్ కాలనీ, కొండపల్లి గోపాల్‌రావునగర్ కాలనీ, ఫైర్ స్టేషన్, బీసీ కాలనీ, లెనిన్ నగర్ కాలనీ, పేపర్ మిల్ కాలనీ, యాదవనగర్ కాలనీ, వడ్డెర కాలనీ, ఇందిరాకాలనీ, జగన్ కాలనీ, భగత్‌సింగ్ నగర్, విక్రమ్ నగర్, తీగల సత్యనారాయణ నగర్, బ్యాంక్ కాలనీ, ధర్మన్న కాలనీ, మిల్ట్రి కాలనీ, భద్రన్న కాలనీ, పత్తిపాక, ఎర్రబోడు, నందమూరి నగర్, వినాయక తండ, మంగలి కాలనీ, సాంక్రియ తండ, సాలార్‌తండా ఉన్నారుు.
పెంపు వివరాలను పరిశీలిస్తే..
మొదటి జోన్‌లోని ఎ.సత్యనారాయణ ఇంటికి గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు సంవత్సరానికి రూ.5733 పన్ను విధించగా.. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఆరు నెలలకే రూ.15, 908 పన్ను వేశారు. ఇదే జోన్‌లోని ఎస్.పద్మలత ఇంటికి గతంలో రూ. 4593 పన్ను రాగా, ఇప్పుడు ఆరు నెలలకే రూ.13,472 విధించారు. ఎస్.నాగరాజు ఇంటికి గతంలో సంవత్సరానికి రూ. 716 రాగా, ఇప్పుడు ఆరు నెలలకే
రూ. 2,878 విధించారు.
రెండవ జోన్‌లో చంద్రకళకు చెందిన పెంకుటిల్లుకు గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు సంవత్సరానికి రూ. 200 బిల్లు వచ్చేది. ఇప్పుడు రూ.1500 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.
ఇంటి పన్నుకు తోడు నల్లా బిల్లు..
గతంలో నల్లా పన్ను నెలకు రూ.33 ఉండగా, ఇప్పుడు రూ. 100కు పెంచారు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయి మూడేళ్లు దాటినా అభివృద్ధిపై దృష్టి సారించని అధికారులు పన్నుల భారం మాత్రం వేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి అవసరమై నిధులు మంజూరు చేయూలని పాలకమండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అరుుతే గతంలో ఏడాదికి రూ.కోటి మేర ఆదాయం వచ్చేదని, పన్నుల పెంపుతో అది రూ.4 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
రూ.250 నుంచి 1500కు పెంచారు
చిన్న పెంకుటిల్లుకు గ్రామపంచాయతీగా ఉన్నప్పు డు సంవత్సరానికి రూ. 250 పన్ను వేసేవారు. ఇప్పుడు మున్సిపల్ నిబంధన పేరుతో ఆరు నెల లకే రూ.750 చెల్లించాలంటున్నారు. అంటే ఏడాదికి రూ.1500 పన్ను వేస్తారట. దీనికి తోడు నల్లా పన్ను కూడా పెంచారు. పేదల గురించి అధికారులు ఆలోచించకపోవడం భావ్యం కాదు.
- చంద్రకళ, కంకరబోడ్ వాసి
అభ్యంతరాలు తెలియజేయూలి
ఇంటి పన్ను పెంపుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయూలి. పన్ను విధింపులో తేడాలుంటే దరఖాస్తు చేస్తే సర్వే నిర్వహించి న్యాయం చేస్తాం. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని విధాలా ఆలోచించే పన్ను పెంపు నిర్ణయం తీసుకున్నారు.
-భాస్కర్‌రావు, ఆర్డీఓ,
ఇన్‌చార్జి కమిషనర్