స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు | Andy Murray tweets last-minute support for Scotland | Sakshi
Sakshi News home page

స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు

Published Thu, Sep 18 2014 6:01 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు

స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు

ఎడిన్బారో: స్వతంత్ర దేశంగా అవతరించేందుకు అడుగులు వేస్తున్న స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు లబించింది. బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండి ముర్రే చివరి నిమిషంలో స్కాట్లాండ్ కు సంఘీభావం ప్రకటించాడు. ప్రజాభిప్రాయసేకరణకు పోలింగ్ బూత్లు తెరవడానికి కొన్ని గంటల ముందు అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

'ఈరోజు స్కాట్లాండ్ దే. గత కొద్ది రోజులు స్కాట్లాండ్ కు వ్యతిరేకంగా ప్రచారం జరగడం లేదు. దీనితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ప్రజాభిప్రాయసేకరణ ఫలితం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ ట్వీట్ చేశాడు. 2.7 మిలియన్ మందికి ఈ ట్వీట్ చేరింది. వేల సంఖ్యలో దీన్ని రీట్వీట్ చేయడం గమనార్హం. ఆండి ముర్రే  నిర్ణయం బ్రిటన్ అభిమాను లను దిగ్భ్రాంతికి గురైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement