బెంబేలెత్తిస్తున్న కొత్త తెగులు
విరుగుడు వంగడాలు కనిపెట్టామంటున్న సైంటిస్టులు
బ్రిటన్ ప్రజలు ఇష్టంగా తినే బంగాళదుంప సాగు అక్కడ కనాకష్టంగా మారిందట. మరో పాతికేళ్లలో బ్రిటన్లో ఆలూ సాగు అసాధ్యంగా మారినా ఆశ్చర్యం లేదని పలు నివేదికలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 20250 స్కాట్లండ్ ఆలూ సాగు పరిశ్రమ తుడిచిపెట్టుకుపోవచ్చన్నది వాటి సారాంశం. పొటాటో సిస్ట్ నెమటోడ్స్ (పీసీఎన్) అనే తెగులే ఇందుకు కారణం.
ఇది సోకే పంటభూముల్లో ఆలూ సాగు అత్యంత కష్టం. నేరుగా మొక్క వేర్లను నాశనం చేసే ఈ తెగులు దెబ్బకు ఆలూ దిగుబడి దారుణంగా పడిపోతుంది. బ్రిటన్‌లో వాడే ఆలూ 80 శాతం స్కాట్లాండ్ భూముల నుంచే వస్తుంది. 450 కోట్ల యూరోల విలువైన ఆలూ పరిశ్రమను ఆదుకునేందుకు బ్రిటిష్ సైంటిస్టుల బృందం నడుం బిగించింది. పీసీఎన్‌ను తట్టుకునే రెండు వంగడాలను గుర్తించినట్టు మొక్కల వ్యాధుల నిపుణుడు జేమ్స్ ప్రిన్స్ చెప్పారు. వీటి సాయంతో సమస్యను అధిగమిస్తామని ధీమా వెలిబుచ్చారు.
– లండన్
Comments
Please login to add a commentAdd a comment