
బడ్జెట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. జ్ట్టిఞ://ఝడజౌఠి.జీఛి.జీ పోర్టల్‌లో సామాన్య ప్రజానీకం తమ సూచనలు, అభిప్రాయాలను పొందుపర్చవచ్చని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయడడం, పారదర్శకతను పెంపొందించడం కోసం సూచనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఆర్థిక శాఖ వివరించింది. తదుపరి బడ్జెట్‌పై కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. దీని రూపకల్పనలో భాగంగా ఆర్థిక వేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, ట్రేడ్ యూనియన్లు తదితర వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది.