కాసిపేట(మంచిర్యాలజిల్లా): మందమర్రి ఏరియాలో మరో ఓపెన్‌కాస్టుకు సింగరేణి బోర్డు అనుమతి లభించింది. దీంతో అధికారులు పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ఎన్నో రోజులుగా తెరపై ఉన్న నెన్నెల మండలం శ్రావణపల్లి ఓపెన్‌కాస్టుకు సంబధించి గతనెల 23న నిర్వహించిన సిం గరేణి బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో ఏరియాలో మరో ఓసీ మంజూరుతో ఉత్పత్తి మరింత పెరగనుంది.
ప్రస్తుతం నూతనంగా నిర్మాణంలో ఉన్న కాసిపేట –2ఇంక్‌లైన్, కేకే–6తో పాటు నూతనంగా కేకే–7 గని, ఓసీ ఏర్పాటుతో సింగరేణిలో మందమర్రి ఏరియా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఉత్పత్తితో పాటు పెద్ద ఏరియాగా మందమర్రి నిలవనుంది.
93.45మిలియన్ టన్నుల నిల్వలు..
నెన్నెల మండలం జెండవెంకటపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టనున్న శ్రావణపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులో 11సీం లలో 93.45టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నా యి. ఏడాదికి 3మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తిని తీసేందుకు యాజ మాన్యం ప్రణాళికలు చేసింది. దీంతో ఓసీ జీవితకాలం 32సంవత్సరాలు కొనసాగనుంది. ఓసీకి అంచనా వ్యయం రూ. 550కోట్లుగా యాజమాన్యం నిర్ణయించింది.
3,640ఎకరాల విస్తీర్ణంలో పనులు..
శ్రావణపల్లి ఓపెన్‌కాస్టుకు సంబంధించి 1455.8హెక్టర్లు(3639.5 ఏకరాలు) భూమి అవసరం కానుంది. అందులో 669.2హెక్టర్లు(1672.5ఎకరాలు) అటవీభూమి కాగా.. మిగతా 1967ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క శ్రావణపల్లి గ్రామాన్ని మాత్రమే నిర్వాసిత గ్రామంగా అధికారులు గుర్తించారు. 70నుంచి 80కుటుంబాలు మాత్రమే ఉన్న గ్రామం కావడంతో ఆర్‌అండ్‌ఆర్ పునరావాస ప్యాకేజీ లో ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కల్యాణిఖని ఓసీలో సైతం దుబ్బగూడెం గ్రామాన్ని మాత్రమే పునరావాస గ్రామంగా తీసుకోవడంతో యాజమాన్యానికి కాస్త తలనొప్పి తగ్గినట్లు యింది. శ్రావణపల్లి చిన్న గ్రామం అయి నందున మెరుగైన ప్యాకేజీ, నూతన భూసేకరణ చట్టాలను వర్తింపజేయనున్నారు. యాజమాన్యం పూర్తి వివరాలతో పర్యావరణ అనుమతులకుప్రతిపాదించనుంది. కేంద్ర పర్యా వరణ శాఖ ఆదేశాలతో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిం చి ఓసీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేయనుంది. ఇప్పటికే అక్కడి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఓసీపై అధికారులు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment