open cost
-
శ్రావణపల్లి ఓసీకి గ్రీన్ సిగ్నల్
కాసిపేట(మంచిర్యాలజిల్లా): మందమర్రి ఏరియాలో మరో ఓపెన్‌కాస్టుకు సింగరేణి బోర్డు అనుమతి లభించింది. దీంతో అధికారులు పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ఎన్నో రోజులుగా తెరపై ఉన్న నెన్నెల మండలం శ్రావణపల్లి ఓపెన్‌కాస్టుకు సంబధించి గతనెల 23న నిర్వహించిన సిం గరేణి బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో ఏరియాలో మరో ఓసీ మంజూరుతో ఉత్పత్తి మరింత పెరగనుంది. ప్రస్తుతం నూతనంగా నిర్మాణంలో ఉన్న కాసిపేట –2ఇంక్లైన్, కేకే–6తో పాటు నూతనంగా కేకే–7 గని, ఓసీ ఏర్పాటుతో సింగరేణిలో మందమర్రి ఏరియా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఉత్పత్తితో పాటు పెద్ద ఏరియాగా మందమర్రి నిలవనుంది. 93.45మిలియన్ టన్నుల నిల్వలు.. నెన్నెల మండలం జెండవెంకటపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టనున్న శ్రావణపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులో 11సీం లలో 93.45టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నా యి. ఏడాదికి 3మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తిని తీసేందుకు యాజ మాన్యం ప్రణాళికలు చేసింది. దీంతో ఓసీ జీవితకాలం 32సంవత్సరాలు కొనసాగనుంది. ఓసీకి అంచనా వ్యయం రూ. 550కోట్లుగా యాజమాన్యం నిర్ణయించింది. 3,640ఎకరాల విస్తీర్ణంలో పనులు.. శ్రావణపల్లి ఓపెన్‌కాస్టుకు సంబంధించి 1455.8హెక్టర్లు(3639.5 ఏకరాలు) భూమి అవసరం కానుంది. అందులో 669.2హెక్టర్లు(1672.5ఎకరాలు) అటవీభూమి కాగా.. మిగతా 1967ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క శ్రావణపల్లి గ్రామాన్ని మాత్రమే నిర్వాసిత గ్రామంగా అధికారులు గుర్తించారు. 70నుంచి 80కుటుంబాలు మాత్రమే ఉన్న గ్రామం కావడంతో ఆర్అండ్ఆర్ పునరావాస ప్యాకేజీ లో ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కల్యాణిఖని ఓసీలో సైతం దుబ్బగూడెం గ్రామాన్ని మాత్రమే పునరావాస గ్రామంగా తీసుకోవడంతో యాజమాన్యానికి కాస్త తలనొప్పి తగ్గినట్లు యింది. శ్రావణపల్లి చిన్న గ్రామం అయి నందున మెరుగైన ప్యాకేజీ, నూతన భూసేకరణ చట్టాలను వర్తింపజేయనున్నారు. యాజమాన్యం పూర్తి వివరాలతో పర్యావరణ అనుమతులకుప్రతిపాదించనుంది. కేంద్ర పర్యా వరణ శాఖ ఆదేశాలతో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిం చి ఓసీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేయనుంది. ఇప్పటికే అక్కడి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఓసీపై అధికారులు అవగాహన కల్పించారు. -
నిప్పుల కొలిమి.. కొత్తగూడెం
51.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు సాక్షి, హైదరాబాద్/కొత్తగూడెం: భానుడి సెగలకు తెలంగాణ అగ్నిగుండంలా మారుతోంది. వడ గాడ్పులకు తల్లడిల్లిపోతోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలో శనివారం సూర్యుడు నిప్పులు కురిపించాడు. మధ్యాహ్నం సమయంలో 51.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వేడి అధికంగా ఉండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. పిల్లలు, వృద్ధులు ఎండలు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిపై వాహనాలు కనుచూపు మేరలో కనిపించలేదు. సింగరేణి ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల్లో మరో రెండు డిగ్రీల ఉష్ణోగత్ర అధికంగా ఉంటుందని అంచనా. దీంతో కార్మికులు ఎండవేడిమికి మలమలా మాడిపోయారు. రాష్ట్రం లోని నాలుగు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పెకైళ్లాయి. భద్రాచలంలో 44.6, నల్లగొండ, ఖమ్మంలలో 44.4 చొప్పున, రామగుండంలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, హైదరాబాద్‌లో శనివారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల జల్లులు పడ్డాయి. శనివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత భద్రాచలం 44.6 నల్లగొండ 44.4 ఖమ్మం 44.4 రామగుండం 44.2 హన్మకొండ 43.5 ఆదిలాబాద్ 42.8 హైదరాబాద్ 42.5 మెదక్ 42.2 నిజామాబాద్ 42.0 హకీంపేట 40.2 -
అభయం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొమ్మేపల్లి ఓసీ నిర్వాసితులకు ఖమ్మం ఎంపీ భరోసా ఆ గ్రామంలో ఎవరికీ బతుకుమీద భరోసా లేదు. నిత్యం భయం..భయం. ఏ వేళ సింగరేణి అధికారులు వస్తారో..తమ భూములు లాక్కుంటారోననే ఆందోళన. ‘బొగ్గు గనికి భూములిస్తాం.. మాకు డబ్బులొద్దు..పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలున్నారు. వారి పెళ్లిళ్లు ఎలా చేయాలి?. నూతన భూ సేకరణ చట్టం అమలుచేసి పంట పండే భూములివ్వాలి. గూడు కట్టుకోవడానికి పరిహారం ఇవ్వాలి’ అనే ఆవేదనతో కూడిన డిమాండ్లు నిత్యం వారి నోటి వెంట వినిపిస్తున్నాయి. ఏ అయ్యవచ్చి తమకు న్యాయం చేస్తాడోననే ఎదురుచూపుల మధ్య.. ఖమ్మం ఎంపీ పొంగులే టి శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా కొమ్మేపల్లి ఓపెన్‌కాస్టు నిర్వాసితులను ఆదివారం పలుకరించారు. 465 కుటుంబాలుం టున్న ఆ గ్రామస్తులకు అండగా ఉంటానని అభయమిచ్చారు. ‘మీకు అండగా నేను ఉంటాను. ప్రభుత్వం దిగివచ్చే దాకా ఇటు శాసనసభ, అటు పార్లమెంట్లో గళమెత్తుతా. నాడు ఎన్నికల ముందు ఈ గ్రామానికి వచ్చి మీ తరఫున పోరాటం చేశా. ఇప్పుడు ఎంపీగా గెలిచినా మీ వెంటే ఉంటా. మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతా..’ - కొమ్మేపల్లి వాసులతో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి : అమ్మా నన్ను గుర్తుపట్టావా..? నేను ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. షేక్ మోతీ : గుర్తు పట్టా సారు.. మా తరఫున వచ్చింది మీరే. మాకు అండగా వచ్చి గ్రామం నుంచి మాతో పాటు నడుచుకుంటూ వచ్చారు. బొగ్గు గుట్ట దగ్గర మా తరఫున నిలబడ్డారు. బొగ్గుతో మా పంట పొలాలు, ఇన్నాళ్లు ఉంటున్న ఇళ్లు, అసలు మా ఊరే పోతుంది సారు. అధికారులు వచ్చి పొతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరే మాకు దిక్కు. పొంగులేటి : అమ్మా మీ పరిస్థితి ఏంటీ..? తేరేజమ్మ : కొత్త లోన్లు ఇవ్వడం లేదు. తీసుకున్నవి రద్దు చేయడం లేదు. సింగరేణితో మాకు ఇబ్బందులు వచ్చాయి సారు. భూములు అమ్ముదామన్నా కొనేవాళ్లు రావడం లేదు. పెళ్లి అయ్యే పిల్లలు ఉన్నారు. ఎన్నిఏళ్లు ఇంట్లో ఉంచుకోవాలి. మా పిల్లలను చూస్తే.. సింగరేణి అధికారులకు మా ఉసురు తప్పక తగులుతుం ది. మాకు ఇలాంటి పచ్చని గ్రామాన్నే ఇవ్వాలి. పొంగులేటి : ఏంతాత ఎలా ఉన్నారు? అహ్మద్ : అర్ధరాత్రి అప్పటి కలెక్టర్ తెచ్చిన జీవో మా పాలిట శాపమైంది సారు. పాత భూసేకరణ ప్రకారం డబ్బులు ఇస్తామంటున్నారు. అవి తీసుకొని పోతే ఇలాంటి భూములు మాకు ఎక్కడ రావు. కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమే ఇవ్వాలి. పొంగులేటి : అక్కా కుటుంబం ఉలా ఏంది.? పర్వీన్: బొగ్గు కోసం బాంబులు పేల్చుతున్నారు. ఆ మోతకు పిల్లలు భయపడుతున్నారు.. సారు.. మంచినీళ్లు బాగా లేవు. పిల్లలకు జ్వరం వస్తోంది. పొంగులేటి : తాత గ్రామంలో పరిస్థితి ఏంటీ? వెంకటయ్య : రజాకార్లనే తరిమికొట్టినం. మేము సంపాదించుకున్న భూములను మాకేమి ఇవ్వకుండా సింగరేణోళ్లు గుంజుకోవాలనుకుంటున్నారు. మేం గూడు కట్టుకోవడానికి నేల ఉండాలి. పంటకు పొలం ఇప్పించాలయ్యా. పొంగులేటి : ఇళ్లు బీటలు పడుతున్నాయా..? ఆఫ్రీన్ : అవును సారు. బొగ్గు కోసం బాంబులు పేల్చడంతో ఇళ్లు బీటలు వస్తున్నాయి. ఇదేంమని అడిగితే సింగరేణోళ్లు పట్టించుకోరు. బాంబులు పేల్చవద్దని చెప్పినా మా మాట వినడం లేదు. రాత్రి పడుకోవాలంటేనే భయమేస్తోంది. మంచినీళ్లు తాగలేకపోతున్నం. పొంగులేటి : అక్కా దారి ఎందుకు వేయడం లేదు? సుజాత : సారు.. ఒపెన్ కాస్టు గనిలో పోతుందని మాగ్రామం వైపే ఆధికారులు రావడం లేదు. దారులు లేవు.. లైట్లు లేవు. ఇళ్లు కట్టుకుందామంటే అధికారులు పట్టించుకోవడం లేదు. మా బతుకే కోల్పోతున్నం.. సత్తుపల్లి దగ్గరలో మంచి భూములు ఇస్తేనే మళ్లీ కోలుకుంటాం. పొంగులేటి : ఈ పరిస్థితితో గ్రామంలో ఎలా ఉంటున్నారు? యాకూబీ : ఏం చేయాలి సారు. బొగ్గు కోసం తొవ్వడంతో మంచినీళ్లు బాగా లేక అందిరికీ రోగాలొస్తున్నాయి. సింగరేణి గుట్ట తీసేటప్పుడే పది మంది చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది పోతారో..? తరతరాలుగా ఇక్కడే ఉంటున్నం. మమ్ముల్ని ఆదుకోకపోతే మేం ఎలా బతకాలి. పొంగులేటి : ఇదేనా అక్క మీ ఇల్లు? నాగలక్ష్మి : అవును సారు. ఇల్ల్లు కట్టుకుందామంటే సింగరేణిలో మీ గ్రామం పోతుంది.. ఇల్లు కట్టుకోవద్దని అధికారులంటున్నరు. ఈ గుడిసెలో ఎలా ఉండాలి? మీ రైనా మాకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలి. పొంగులేటి : ఎలా ఉన్నారు అక్కలు..? రజియా : మీరు మాతో ఉంటూ పోరాడుతున్నరు. బొగ్గుతో మేమే అనాథలవుతున్నం. మా ఊరు పోతుంది. మేం ఏం చేసి బతకాలో తలుచుకుంటేనే భయమేస్తోంది. పొంగులేటి : ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటున్నావా తాత..? పాష : అవునయ్యా. నాకు ఎవ్వరూ లేరు. ఉన్న ఇల్లూ కూలిపోతోంది. ఒపెన్ కాస్టులో బొగ్గు తీస్తే ఈ గూడు ఉండదంటున్నరు. గ్రామంలో వాళ్లే నన్ను చూసుకుంటున్నరు. వాళ్లే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నరు. పొంగులేటి : మీకు భూములు ఎక్కడ కావాలి.? మస్తాన్ : మా ఊళ్లో అందరూ పంటపొలాలు చేస్తారు. ఒపెన్ కాస్టులో భూమి పోతే.. ఇచ్చే డబ్బులతో ఎక్కడా పంట భూమి రాదు. సత్తుపల్లిలో ఎకరం రూ.10 లక్షలట. మాకు భూమి కింద భూమే కావాలి. పొంగులేటి : అందరూ బాగున్నారమ్మా.. చేవూరి కుమారి : బొగ్గు గుట్ట తీయడంతో అందరికి కష్టాలు వచ్చాయి సారు. పొలాలు చేసుకుంటూ గుడిసెల్లోనే ఉంటున్నం. ఇప్పుడు బొగ్గు తీస్తారంట.. మా పొలాలు, ఇళ్లు అన్నీ పోతే ఎట్లా బతికేది.? ఎంపీ పొంగులేటి భరోసా.. ‘ఎన్నికల ముందు మీ కోసం మీ గ్రామానికి వచ్చింది నేనే. మిమ్ముల్ని సింగరేణి అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఒపెన్‌కాస్టు దాకా మీతో పాటు గ్రామం నుంచి నడుచుకుంటూ వెళ్లి ఆందోళన చేశాం. ఇప్పుడు మళ్లీ మీ కోసమే వచ్చా. మీకు శాపంగా మారిన పాత భూ సేకరణ చట్టం, మీ సమస్యలపై మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతారు. నేను తప్పకుండా పార్లమెంట్ సమావేశాల్లో మీ ఊరు సమస్యపై గళమెత్తుతా. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మీకు న్యాయం జరిగేలా మే వెంటే ఉంటూ పోరాటం చేస్తాం. ఓపెన్‌కాస్టులో పోతున్నాయని గ్రామంలో తాగునీటి ఇబ్బందులు, ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అసలు గ్రామాన్నే అధికారులు వెలేసినట్లుగా చూస్తున్నారు. ఈ సమస్యలన్నింటి పైనా ఇటు సింగరేణి అధికారులు, అటు జిల్లా అధికారులతో మాట్లాడుతా. మీరు కోరుకున్నట్లుగా భూమికి భూమికి ఎక్కడో అడవుల్లో కాదు.. సత్తుపల్లి సమీపంలో ఇప్పించేందుకు ఉద్యమిస్తాం. మీకు న్యాయం జరిగేలా మీ వెంటే ఉంటాను’ అని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారికి ధైర్యాన్నిచ్చారు. -
టెన్షన్.. టెన్షన్
సత్తుపల్లి/సత్తుపలి ్లరూరల్, న్యూస్‌లైన్: ఓపెన్‌కాస్ట్ పరిధిలో భూములు కోల్పోతున్న కొమ్మేపల్లి, కిష్టారం గ్రామాలకు చెందిన సింగరేణి భూ నిర్వాసితులు అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ఓసీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. తెల్లవారుజాము నుం చే పోలీసులు ఓపెన్‌కాస్టు పరిసర ప్రాంతాలలో భారీగా మోహరించటంతో టెన్షన్ వాతావర ణం నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే అరెస్ట్‌ల పర్వం కొనసాగడంతో నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైకి రాగానే అరెస్ట్ చేస్తుండడంతో పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగా రు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం 22 రోజు లుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని, ఇప్పుడు ముట్టడి కార్యక్ర మం చేపడితే వారికి తొత్తులుగా మారిన పోలీసు లు తమను ఇబ్బంది పెట్టడం ఏంటని మండిపడ్డారు. పోలీసులకు, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకదశలో పోలీసులు జీపు కదల నీయకుండా ఆందోళనకారులు చుట్టుముట్టారు. వ్యూహాత్మకంగా ముట్టడి.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తుంటే.. ఆందోళన కారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. కొమ్మేపల్లి, కిష్టారం నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో మహిళలు సింగరేణి వై జంక్షన్ కు చేరుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో అవాక్కైన పోలీ సులు భారీగా వైజంక్షన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పలువురు జంక్షన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కాగా, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వై జంక్షన్ వద్దకు ప్రదర్శనగా వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ముట్టడిని భగ్నం చేసేందుకు సత్తుపల్లి డీఎస్పీ బి.అశోక్‌కుమార్ పర్యవేక్షణలో అశ్వారావుపేట, సత్తుపల్లి టౌన్, రూరల్ సీఐలు, పలువురు ఎస్సైలు, ఇతర సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఓసీ వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటుచేశారు. నిలిచిన బొగ్గు రవాణా.. ఓపెన్‌కాస్టు ముట్టడితో బొగ్గు రవాణాకు ఆటం కం ఏర్పడింది. ఉదయం నుంచే లోడింగ్‌ను నిలిపివేశారు. సుమారు 5వేల టన్నుల బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి పీఓ ఎస్.సూర్యనారాయణ తెలిపారు. అయితే ఉత్పత్తికి మా త్రం ఎలాంటి అంతరాయం ఏర్పడలేదన్నారు. అర్ధరాత్రి అరెస్ట్‌లు.. అశ్వారావుపేట/ దమ్మపేట, న్యూస్‌లైన్: వారు ప్రజల సొమ్మును లూటీ చేయలేదు.. పేదల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేవారూ కాదు.. నిర్వాసితుల కోసం ప్రభుత్వంతో శాంతి యుత పోరాటం చేస్తున్న రాజకీయ నాయకులు.. అలాంటి వారిని తీవ్రవాదులను నిర్బంధించినట్లుగా సత్తుపల్లి పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి దమ్మపేట స్టేషన్‌కు తరలించారు. ఇదేమంటే అవాంఛనీయ ఘటన లు జరగకుండా స్టేషన్ మార్చామంటూ సమర్థించుకుంటున్నారు. సత్తుపల్లి జేవీఆర్ ఓసీ విస్తరణలో భాగంగా కిష్టారం, కొమ్మేపల్లి, జగన్నాధపురం గ్రామాల రైతుల భూములు, గ్రామాలను సింగరేణి యాజమాన్యం స్వాధీనపరుచుకోనుంది. రైతులు కూడా భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కొత్త భూసేకరణ చట్టం ప్రకా రం నష్టపరిహారం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓసీని ముట్టడికి నిర్ణయించారు. వారికి అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి. సొంతపూచీకత్తుపై విడుదల.. నిర్వాసితులకు మద్దతుగా పోరాడుతున్న వైఎస్ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, కోటగిరి మురళీకృష్ణారావు, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు, టీడీపీ మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు, సీపీఐ డివిజన్, మండల కార్యదర్శులు దండు ఆదినారాయణ, తడికమళ్ల యోబు, న్యూడెమోక్రసీ నేత ఎ.రాములును మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తామేం చేశామని ప్రశ్నిస్తే ‘మా సార్ చెప్పారు.. మిమ్మల్ని ఇక్కడ ఉంచుతున్నాం..’ అనే సమాధానం మినహా పోలీసులు ఇంకేమీ చెప్పడం లేదు. చివరకు బుధవారం మధ్యాహ్నం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పిరికిపంద చర్యే..: ఇది ముమ్మాటికీ పోలీసుల పిరికిపంద చర్యే.. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులకు మద్దతిచ్చిన మమ్మల్ని అత్యంత దిగజారుడు తనంగా దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. మమ్మల్ని సత్తుపల్లిలో ఉంచే ధైర్యం పోలీసులకు ఎందుకు లేదో చెప్పాలి. వారు ఎన్ని కుట్రలు పన్నినా.. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించేంత వరకు మా పోరాటం ఆగదు. -డాక్టర్ దయానంద్ విజయ్‌కుమార్, వైఎస్ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త రజాకార్లలా వ్యవహరించారు..: పోలీసులు వ్యవహరించిన తీరు రజాకార్లను గుర్తుచేస్తోంది. రైతుల సమస్యలపై న్యాయబద్ధంగా పోరాడుతున్న మమ్మల్ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకురావడం పద్ధతికాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనా.. తుపాకీ పాలననా.. అర్థం కావడం లేదు. - ఉడతనేని అప్పారావు కాంగ్రెస్ నాయకులు -
‘సేవ్ సింగరేణి’ పేరుతో పోరాటం
కోల్‌బెల్ట్, న్యూస్‌లైన్ : సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులలో కోట్ల కుంభకోణం జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు.. కంపెనీని కాపాడుకోవడానికి ‘సేవ్ సింగరేణి’ పేరుతో పోరాటం చేస్తామని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ చెప్పారు. భూపాలపల్లిలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో *200 కోట్ల అవినీతి జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇందులో అధికారుల పాత్ర అధికంగా ఉన్నట్లు బహిర్గతమైనా యాజమాన్యం వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సకల జనుల సమ్మె కాలంలో సత్తుప ల్లి ఓసీ జీఎం బి-గ్రేడ్ బొగ్గును ఎఫ్-గ్రేడ్‌గా విక్రయించి కాంట్రాక్టర్ వద్ద సుమారు 9 కోట్లు దండుకున్నాడని, ఈ విషయమై యాజమాన్యం విచారణ చేపట్టి ధృవీకరించినా బాధ్యుల పై చర్యలు తీసుకోలేదన్నారు. అదే ఓసీలో ఓబీ పనులు చేయకున్నా అధికారి కాంట్రాక్టర్‌కు 12కోట్లు చెల్లించి పర్సంటేజీలు తీసుకున్నాడని చెప్పారు. ఐదేళ్లక్రితం మేడిపల్లి ఓసీలో 24కోట్ల అవినీతి జరిగిందని, ఏడాది క్రితం అప్పటి ఆర్జీ-1 జీఎం కిషన్రావ్ ఎన్సీసీ కంపెనీకి 24 కోట్లు అదనంగా చెల్లించి 40 లక్షల కమీషన్ తీసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తమ యూనియన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో 8లక్షలు రికవరీ చేసి కిషన్రావ్ను బదిలీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సంస్థలో కోట్లలో అవినీతి జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఏ కార్మికుడికీ చార్జ్‌షీట్ ఇచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కంపెనీలో డిపెండెంట్ హక్కు పునరుద్ధరించాలని, హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 3,600 డిపెండెంట్లను ఒకేసారి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిపై గత నెల 31న సీఎండీ సుతీర్థ భట్టాచార్యకు సమ్మె నోటీస్ ఇచ్చామని, యాజ మాన్యం స్పందించని కారణంగా ఈనెల 25న కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు ధన్‌రాజ్, ప్రతాప్‌రావ్, రమేష్, బత్తిని సుదర్శన్‌గౌడ్, రాజేశ్వర్‌రా వ్, దాసు, బ్రహ్మచారి, రాంచందర్ పాల్గొన్నారు. -
తప్పుల తడకగా భూ సర్వే