18న స్కాట్లాండ్‌లో రిఫరెండం | Scotland: Every Vote Counts In Referendum Race | Sakshi
Sakshi News home page

18న స్కాట్లాండ్‌లో రిఫరెండం

Published Mon, Sep 8 2014 1:15 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM

Scotland: Every Vote Counts In Referendum Race

బ్రిటన్ రాణి ఆందోళన
 
లండన్: స్వాతంత్య్రం కోసం స్కాట్లాండ్‌లో సెప్టెంబరు 18న ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్న నేపథ్యంలో తర్జనభర్జనలు పడ్డ బ్రిటన్ ప్రభుత్వం ఆ దేశానికి కొత్త అధికారాలను ఇస్తామని ప్రతిపాదించింది. తమతో కలిసి ఉండేందుకు అనుకూలంగా స్కాట్లాండ్ పౌరులు ఓటు వేస్తే గనక.. ఆ ప్రాంతానికి పన్ను, వ్యయ అధికారాలను అప్పగిస్తామని ఆదివారం బ్రిటన్ ఆర్థిక మంత్రి జార్జ్ ఆస్‌బోర్న్ ప్రకటించారు.

స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఒకే కరె న్సీని ఉపయోగించడమంటే.. విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఒకే బ్యాంకు ఖాతాను ఉపయోగించినట్లు అవుతుందని ఆయన హితబోధ కూడా చేశారు. ఇదిలాఉండగా.. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం కోసం స్కాట్లాండ్ రిఫరెండం దిశగా సాగుతుండటం, అనుకూలురే ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు రావడంతో బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్  ఆందోళన చెందుతున్నారు. స్కాట్లాండ్‌లో నిర్వహించిన పోల్‌లో సొంత ప్రభుత్వ పాలనకు 51 శాతం, బ్రిటన్ ప్రభుత్వానికి 49 శాతం మంది మొగ్గుచూపారు. మరో 6 శాతం మంది తటస్థంగా ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement