
'అలా చేస్తే చీకట్లోకి దూకడమే'
లండన్: యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ కలసి ఉండాలా? వద్దా? అంశంపై జూన్ 23న ప్రజాభిప్రాయం నిర్వహిస్తామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటించారు. ఈయూ సంస్కరణల ఒప్పందంపై కేబినెట్‌కు వివరించాక తన నివాసం వెలుపల ఈ వివరాలు వెల్లడించారు.
యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ ఉండాలనే కోరుకుంటున్నానని, నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఈయూలో ఉంటేనే దేశం బలంగా, సురక్షితంగా ఉంటుందని తన మనసులో మాట చెప్పారు. వైదొలగడం చీకట్లోకి దూకడమేనంటూ ఇదివరకే కామెరాన్ హెచ్చరించారు.