ఎమ్మెల్యే తీరుతో రగిలిన తమ్ముళ్లు | Unhappy activists | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే తీరుతో రగిలిన తమ్ముళ్లు

Published Tue, Dec 29 2015 11:25 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ఎమ్మెల్యే తీరుతో రగిలిన తమ్ముళ్లు - Sakshi

ఎమ్మెల్యే తీరుతో రగిలిన తమ్ముళ్లు

అనకాపల్లి: ఎమ్మెల్యే పీలా తీరుపై తెదేపా శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కొణతాల రామకృష్ణ టీడీపీ చేరుతుండడంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తీరుతో వారు మంగళవారం మరింత రగిలిపోయారు.  నూకాంబిక అమ్మవారి కల్యాణమండపంలో జరిగిన జన్మభూమి కార్యక్రమ సమీక్షా సమావేశంలో కుంచంగి ఎంపీటీసీ భాస్కరరావు తన సమస్యను వివరించిన సమయంలో ఎమ్మెల్యే... ఎంపీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.   ఎంపీటీసీ భాస్కరరావుపై పట్టణానికి చెందిన ఒక సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేయడంతో   తెలుగుతమ్ముళ్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అప్పటికే కొణతాల చేరిక అంశంపై రగిలిపోతున్న తెలుగుతమ్ముళ్లు తమను చులకనగా చూడడం తగదంటూ గట్టిగా కేకలు వేశారు. 

ఇదే సమయంలో సమావేశం నుంచి వెళ్లిపోయిన మరో ఎంపీటీసీ తమకు మాట్లాడేందుకు అవకాశమివ్వరని, తాము చెప్పేందుకు వినేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించరంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు.  కొణతాల రామకృష్ణ  చేరిక విషయంలో  అధిష్టాన నిర్ణయం తనకు శిరోధార్యమంటూ   ఎమ్మెల్యే పీలా చెప్పడంతో తెలుగుతమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement