ప్రెస్మీట్లకే చంద్రబాబు పరిమితం: కొణతాల | Chandra Babu naidu is confined only to pressmeets, says Konatala Ramakrishna | Sakshi
Sakshi News home page

ప్రెస్మీట్లకే చంద్రబాబు పరిమితం: కొణతాల

Published Wed, Dec 11 2013 1:24 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ప్రెస్మీట్లకే చంద్రబాబు పరిమితం: కొణతాల - Sakshi

ప్రెస్మీట్లకే చంద్రబాబు పరిమితం: కొణతాల

హైదరాబాద్ : ఆర్టికల్-3పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం సఫలీకృతమైందని ఆపార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. పార్లమెంట్లో అన్ని జాతీయ పార్టీలు ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నాయని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజనపై స్పష్టత లేని చంద్రబాబునాయుడు రోజుకో లెక్చర్ ఇస్తున్నారని కొణతాల ఎద్దేవా చేశారు. బాబు ప్రెస్మీట్లకే పరిమితం అయ్యారే కానీ, విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నం చేయటం లేదని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి.... పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి దాసోహమై రాష్ట్రంలో సమైక్య నాటకాలేస్తున్నారని కొణతాల వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరూ కలిసి వస్తే ... రాజకీయ సంక్షోభాన్ని సృష్టించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని కొణతాల అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement