
విభజన హామీలను అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలి
ప్రధానికి మాజీ ఎంపీ కొణతాల లేఖ
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇక్కడి రింగ్‌రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీలను నిల బెట్టుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన చట్టాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌కు కల్పించాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశా రు. ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టంలో రావలసిన అన్ని సదుపాయాలను కల్పించాలని కొణతాల కోరారు.
పన్నుల మినహాయింపునకు దోహదపడే ప్రత్యేక హోదాతోపాటు ఉత్తరాంధ్రకు ఆర్థిక ప్యాకేజీని అందజేయాలని కోరారు. రాష్ట్రంలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు రానున్న పదేళ్లలో ఆర్థికపరమైన ప్యాకేజీలు కల్పించాలని కోరారు. అదేవిధంగా విశాఖపట్నానికి రైల్వేజోన్ ప్రకటిస్తామని విభజన చట్టంలో ఉన్నా అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. విభజన చట్టంలోని హామీలకు అను గుణంగా విద్యాసంస్థలను ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారం భించకపోవడం దారుణమని కొణతాల అన్నారు.