రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతు తెలిపేందుకు పార్టీ శ్రేణులు కదిలి రావాలని...
అనకాపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతు తెలిపేందుకు పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్యకర్తలతో సమీక్షించారు. ఈ నెల 22 నుంచి జిల్లాలో పార్టీ చేపట్టే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేసే బాధ్యత అందరిదీ అన్నారు. బస్సు యాత్రల విషయమై మాట్లాడేందుకు జిల్లా పార్టీ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు పార్టీ రాష్ర్ట నేత కొణతాలను కలిశారు.
యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్, పార్టీ శ్రేణుల పాత్రపై మాట్లాడారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై నియోజకవర్గ నేతలను కొణతాల ఆరా తీశారు. విజయమ్మ దీక్షకు సంఘీభావంగా నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలన్నారు. పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ మద్దతుదారులను నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటివారంలో అభినందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
కొణతాలను కలిసినవారిలో గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, పట్టణ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మలసాల కిశోర్, మండల నాయకులు గొర్లి హరిబాబు, సూరిశెట్టి రమణ అప్పారావు చోడవరం నియోజవర్గానికి చెందిన అడపా నర్సింహమూర్తి, సూర్యనారాయణ, కర్రి తమ్మునాయుడు ఉన్నారు.