నీల్సన్ సర్వేపై వైఎస్సార్‌సీపీ నేత కొణతాల
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నీల్సన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన సీట్లకన్నా తమ పార్టీ మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీవీ ప్రసారం చేసిన నీల్సన్ సర్వే ప్రకారం సీమాంధ్రలో తమ పార్టీ 129-133 అసెంబ్లీ స్థానాలు, 19-21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడైందని, అయితే తమ పార్టీ అంచనా ప్రకారం అంతకన్నా ఎక్కువ సీట్లనే తాము గెలుచుకోనున్నామని ఆయన చెప్పారు. 25 లోక్‌సభ స్థానాల్లో, అలాగే 140-150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని కొణతాల చెప్పారు. 2012లో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంధ్రలోని 17 స్థానాల్లో తమ పార్టీ 15 స్థానాలు గెలుచుకుందని గుర్తుచేశారు.