
భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్న వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేడు తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది. అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష భగ్నం నేపథ్యంలో నేడు భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. దీని కోసం ఇవాళ సమావేశమవుతున్నట్టు ఆయన వెల్లడించారు.
కాగా నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా నీరసంగా కనిపిస్తున్నారని పార్టీ నేత వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆయనకు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు చెప్పారు.