
సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ వదులుకుంది. పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు జనసేనకు కేటాయించింది. జనసేన నుంచి ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీకి దింపింది. టీడీపీ కార్యకర్తలను కొణతాల అనేక రకాలుగా వేధించారని ఇప్పుడు ఆయనతో కలిసి ఎలా పని చేయమంటారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
మరోవైపు, అనకాపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో జనసేనకు సీటు కేటాయించడంపై పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో పీలా గోవింద్ సమావేశం నిర్వహించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గోవింద్‌పై టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట!