వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి క్విడ్‌ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించి ఆధారాలు లభించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. జగన్ ఆస్తుల కేసులో విచారణ పూర్తి అయిందని నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు సిబిఐ తెలిపింది. హైకోర్టు ఆదేశించిన అంశాలపై దర్యాప్తు పూర్తి చేసినట్లు సిబిఐ తన మెమోలో వివరించింది. జూబ్లీ మీడియా కమ్యూనికేషన్, సండూర్, కార్మిల్ ఏషియా, ఆర్ఆర్ గ్లోబల్, సరస్వతి పవర్, క్లాసిక్ రియాల్టీ, పివిపి బిజినెస్ వెంచర్స్, మంత్రి డెవలపర్స్కు సంబంధించి క్విడ్ప్రోకోకు ఆధారాలు లభించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. మాజీ మంత్రులు శంకరావు, ఆశోక్ గజపతి రాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పూర్తి అయినట్లు సిబిఐ పేర్కొంది. కోల్కతాకు చెందిన 16 కంపెనీలకు సంబంధించి ఇడి, ఐటి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.