8 కంపెనీలతో క్విడ్ప్రోకో లేదు:జగన్ కేసులో సిబిఐ | No quid pro quo with 8 Companies : CBI | Sakshi
Sakshi News home page

8 కంపెనీలతో క్విడ్ప్రోకో లేదు:జగన్ కేసులో సిబిఐ

Published Mon, Sep 23 2013 12:35 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

8 కంపెనీలతో క్విడ్ప్రోకో లేదు:జగన్ కేసులో సిబిఐ - Sakshi

8 కంపెనీలతో క్విడ్ప్రోకో లేదు:జగన్ కేసులో సిబిఐ

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి క్విడ్‌ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించి ఆధారాలు లభించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి చిక్కుముడులు వీడుతున్నాయి. క్విడ్‌ప్రోకోకు సంబంధించి స్పష్టత  వస్తోంది. పదింట ఎనిమిది కేసుల్లో ఎలాంటి క్విడ్‌ప్రోకో జరగలేదని దర్యాప్తు సంస్థ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు మెమో రూపంలో వెల్లడించింది.


 జగన్ ఆస్తుల కేసులో విచారణ పూర్తయిందని సిబిఐ కోర్టుకు తెలిపింది . హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి చేశామని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ వివరించింది. మొత్తం పది కంపెనీలకు సంబంధించి దర్యాప్తు చేశామని, ఇందులో ఎనిమిది కంపెనీల్లో క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ వివరించింది. సండూర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్, పివిపి బిజినెస్ వెంచర్స్‌, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌, మంత్రి డెవలపర్స్‌లలో క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిబిఐ వెల్లడించింది.


 దీనితో పాటు 16 కోల్‌కతా కంపెనీలకు సంబంధించి ఇడి, ఐడి మాత్రం దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది. తాజా దర్యాప్తుతో మాజీ మంత్రులు శంకర్రావు, అశోక్ గజపతి రాజు పిటిషన్లపై దర్యాప్తు పూర్తయినట్లు సిబిఐ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement