The Mysterious Living Stones Of Romania Trovants They Grow And Move - Sakshi
Sakshi News home page

Romania Living Stones: సజీవ శిలలు.. ఎక్కడైనా అరుగుతాయి; ఇక్కడ పెరుగుతాయి

Published Tue, Jan 31 2023 1:56 PM | Last Updated on Tue, Jan 31 2023 4:32 PM

The Mysterious Living Stones of Romania They Grow and Move - Sakshi

శిల్పాలలో జీవం ఉట్టిపడితే వాటిని సజీవ శిల్పాలు అంటారు. సజీవ శిలలేమిటి అనే కదూ మీ అనుమానం? అంతేకాదు, కాలం గడిచేకొద్ది ఈ శిలలు పెరుగుతాయి. రాళ్లు ఎక్కడైనా అరిగితే అరుగుతాయేమో గాని, పెరుగుతాయా? ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా? నోరెళ్లబెట్టేలా చేసే ఈ చోద్యాన్ని చూడాలంటే, రుమేనియాకు వెళ్లాల్సిందే! 

రుమేనియా రాజధాని బుచారెస్ట్‌కు యాభైమైళ్ల దూరంలోని కోస్టెస్టీ గ్రామంలోను, ఆ గ్రామ పరిసరాల్లోని ఇసుక నేలల్లోను కనిపించే ఈ సజీవ శిలలను ‘ట్రోవంట్స్‌’ అంటారు. ప్రతి వెయ్యేళ్లకు వీటి పరిమాణం రెండు అంగుళాల మేరకు పెరుగుతుంది. పెరిగే కొద్ది ఇవి జంతువులు, వృక్షాల ఆకారాలను సంతరించుకుంటాయి. వీటి పెరుగుదల క్రమాన్ని గమనిస్తే, వృక్షకణం పెరుగుదల మాదిరిగానే ఉంటుంది.

అంతేకాదు, ఈ శిలలు మరికొన్ని శిలలకు జన్మనిస్తాయి కూడా! వీటిలో కొన్ని చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉంటే, మరికొన్ని కొన్ని అడుగుల వ్యాసంతో భారీ పరిమాణంలో ఉంటాయి. ఈ శిలలపై చాలా ఏళ్లుగా భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. రుమేనియా వచ్చే విదేశీ పర్యాటకులు వీటిని తిలకించేందుకు పనిగట్టుకుని మరీ కోస్టెస్టీ గ్రామానికి వస్తుంటారు.

చదవండి: గోల్ఫ్‌ సామ్రాజ్యానికి రారాజు.. 'టైగర్‌ వుడ్స్‌' పేరు ఎలా వచ్చింది

'బోపన్న.. మీ భార్య చాలా అందంగా ఉంది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement