ఫిన్లండ్ తీరనగరం ఎస్పో బీచ్‌లో యువతీ యువకులు తరచు గోలగోలగా పార్టీలు చేసుకోవడం, ఆగడాలకు పాల్పడటం, బీచ్‌కు వచ్చే సాధారణ జనాలతో దురుసుగా ప్రవర్తించడం కొంతకాలంగా సమస్యగా ఉంటూ వచ్చింది. అదుపులేని యువత తరచుగా ఆగడాలకు పాల్పడుతుండటం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది.
ఫిర్యాదులు వచ్చిప్పుడల్లా నిందితులను నిర్బంధంలోకి తీసుకోవడం, వారి మీద కేసులు పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నా, వాటి వల్ల పెద్దగా ఫలితాలు కనిపించలేదు. ఆకతాయి యువతను బీచ్‌కు దూరంగా ఉంచడానికి ఏదో ఒకటి చేయాలని, సాధారణ ప్రజలు బీచ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంచరించే వాతావరణం కల్పించాలని పోలీసులు నిశ్చయించుకున్నారు.
అయితే, వారు మన పోలీసుల మాదిరిగా లాఠీలను నమ్ముకోలేదు, సంగీతాన్ని నమ్ముకున్నారు. పాప్, ర్యాప్‌లాంటి హోరెత్తించే సంగీతాన్ని ఇష్టపడే యువతకు శాస్త్రీయ సంగీతం అంటే సరిపడదని తెలివైన పోలీసు అధికారి ఒకరు గుర్తించారు.
ప్రయోగాత్మకంగా బీచ్‌లో జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రతిచోటా లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి, శాస్త్రీయ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతం ధాటికి ఆకతాయి యువత క్రమంగా బీచ్‌వైపు రావడం మానుకున్నారు. పోలీసుల సంగీతం చిట్కా ఫలించడంతో ఎస్పో నగరవాసులూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇవి చదవండి: ఈ వింతజీవి గురించి మేరెప్పుడైనా విన్నారా..!?
Comments
Please login to add a commentAdd a comment