ఇది టైగర్ ఫిష్ | tiger fish in uppada | Sakshi
Sakshi News home page

ఇది టైగర్ ఫిష్

Published Mon, Aug 10 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

ఇది టైగర్ ఫిష్

ఇది టైగర్ ఫిష్

‘టైగర్’ రకం రొయ్యల్ని ప్రత్యేకించి చెరువుల్లో పెంచుతుంటారు. అయితే ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రతీరంలో ‘టైగర్ ఫిష్’ కనిపించింది. తెరుచుకున్న నోరు, పులిని పోలిన చర్మం, మచ్చలతో ఉన్న ఈ చేప చనిపోయి తీరానికి కొట్టుకు వచ్చింది. దాదాపు  రెండడుగుల పొడవు, 5 కిలోల బరువు ఉన్న ఈ చేప చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా.. తినడానికి పనికిరాదని మత్స్యకారులు చెప్పారు. సముద్రజలాలు కలుషితం కావడం వల్ల ఇటువంటి చేపలు చనిపోయి ఒడ్డుకు చేరుతున్నాయన్నారు. 
- కొత్తపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement