![East Godavari: Rare Sea Snail Found At Shore Auctioned For Rs 18000 - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/30/snail2.jpg.webp?itok=ParNHZHg)
కొత్తపల్లి/తూర్పు గోదావరి జిల్లా: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన ముత్యపు శంఖం దొరికింది. తొండంగి మండలం హుకుంపేటకు చెందిన మత్స్యకారుడు గంటా జగన్నాథం సముద్రంలో వేటకు వెళ్లగా ఆయన వలకు ఈ భారీ శంఖం చిక్కింది.
కాగా అరుదైన ఈ ముత్యాల శంఖాన్ని అమీనాబాదు హార్బర్‌లో ఉప్పాడకు చెందిన వ్యాపారులు రూ. 18 వేలు వెచ్చించి ఇటీవల కొనుగోలు చేశారు. ఈ శంఖాన్ని మెలో మెలో పేరుతో పిలుస్తారని మత్స్యశాఖాధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment