విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
విశాఖ: జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హుద్‌హుద్ తుపాను నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాలను కలవడానికి వచ్చిన రాజకీయ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర బృందాన్ని కలవాలంటూ వారు విజ్ఞప్తి చేసినా పోలీసులు వినకపోవడంతో రాజకీయ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులను కలిసి తీరుతామని వారు నిరసనకు దిగారు.
కేంద్ర బృందాలు తుపానుతో నష్టపోయిన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్ర బృందాలు శుక్రవారం విశాఖ జిల్లాల్లో పర్యటించాయి. గురువారం తూర్పుగోదావరి జిల్లాలో ఆ అధికారులు పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. తమ బాధలను అధికారులు పట్టించుకోకుండా వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.