central committee
-
తెలంగాణలో ముగిసిన సెంట్రల్ కమిటీ పర్యటన
-
పూజా ఖేద్కర్‌పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
ముంబై: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల్లో ఆయన ఆమె వ్యవహారంపై ఓ నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి, తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపాయి. మరోవైపు.. తాజాగా ఆమెపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తన విచారణలో మనోజ్ ద్వివేదీ, నవీ ముంబై పోలీసుల నుంచి ఓ నివేదిక తీసుకున్నారు. ఓ దొంగతనం కేసులో నిందితుడ్ని విడిచిపెట్టాలంటూ ఆమె పోలీసులకు హుకుం జారీ చేశారామె. మే 18వ తేదీన నవీ ముంబై డీసీపీకి ఫోన్ చేసిన ఖేద్కర్.. తాను ఫలానా అని పరిచయం చేసుకున్నారు. ఇనుప సామాన్లు దొంగిలించిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విడుదల చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ నిందితుడు అమాయకుడని, పైగా అతనిపై ఆరోపణలు తీవ్ర స్థాయివేం కాదని ఆమె ఫోన్లో చెప్పారు. అయినప్పటికీ ఆ పోలీసులు ఆ కాల్‌ను పట్టించుకోలేదు. అయితే ఆ ఫోన్ కాల్ పూజా ఖేద్కర్ నుంచే వచ్చిందా? లేదంటే ఆమె పేరుతో ఎవరైనా అలా చేశారా? అనేది ద్వివేదీ కమిటీ నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే..పుణేలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్‌పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి. చివరికి ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. తనకు కంటితో పాటు మానసిక సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో ఖేద్కర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణ పత్రాలపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదికను బట్టే ఖేద్కర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
శ్రీసిటీని సందర్శించిన కేంద్ర కమిటీ
వరదయ్యపాళెం: ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల సవరణ (ఆర్వోడీటీఈపీ) నిర్ణయ కమిటీ బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. మాజీ కేంద్ర హోం, వాణిజ్య కార్యదర్శి జీకే పిళ్ళై (రిటైర్డ్ ఐఏఎస్) నేతృత్వంలో రిటైర్డ్ సీబీఈసీ స్పెషల్ సెక్రటరీ వైజీ పరాండే, కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ (రిటైర్డ్) గౌతమ్ రే కమిటీ సభ్యులుగా సందర్శనకు రాగా వీరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ అసన్ అహ్మద్, డిప్యూటీ డీజీఎఫ్టీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. శ్రీసిటీ ఎస్ఈజెడ్, డీటీజెడ్‌లోని పరిశ్రమల సీనియర్ మేనేజర్లతో వీరు పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. పిళ్ళై మాట్లాడుతూ..తక్కువ వ్యవధిలో శ్రీసిటీ సాధించిన పారిశ్రామిక వృద్ధిని ప్రశంసించారు. ఎగుమతులపై సుంకాలు, పన్నులు ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎగుమతులకు ఆర్ఓడీటీఈపీ రేట్లను నిర్ణయించడానికి ఎగుమతి అథారిటీ పరిశ్రమల అభిప్రాయాలను తమ కమిటీ సేకరిస్తుందన్నారు. పన్నులు, సుంకాల రీయింబర్స్‌మెంట్‌ను సులభతరం చేయడానికి తమ ఉత్పత్తుల ధరలను నిర్దేశిత ఫార్మాట్లో ఇవ్వాలని కంపెనీలకు సూచించారు. కమిటీకి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. -
ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాం: నీలం సాహ్ని
-
కృష్ణా, అనంతలో కేంద్ర బృందం పర్యటన
సాక్షి, కృష్ణా జిల్లా : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన పంట నష్టంపై సమీక్షించేందుకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాలైన ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంత జిల్లాల్లో పర్యటిస్తోంది. సోమవారం కృష్ణా జిల్లాలోని కొటికల పూడికి చేరుకున్న బృందం వరదల వలన నష్టపోయిన ప్రత్తి, మినుము, బెండ, వంగ పంటలను పరిశీలించింది. కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీ లతలు వరద వలన నష్టపోయిన పంట వివరాలను వారికి వివరించారు. వరదలతో కష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు కేంద్ర బృందాన్ని వేడుకున్నారు. అనంతరం, కంచికచర్లకు వెళ్లే మార్గంలో నేల కొరిగిన వరిపంటను సైతం కేంద్ర బృందం పరిశీలించింది. వర్షాల కారణంగా కొంత, పంట కాలువ పొంగటం వల్ల మరికొంత వరికి నష్టం జరిగిందని కలెక్టర్ వివరించారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లలో కేంద్ర బృందం ముందుకు సాగింది. కాగా, వరదల కారణంగా కొటికల పూడిలో దాదాపు 351 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ( సీఎస్‌తో కేంద్ర బృందం భేటీ.. వరద నష్టంపై సమీక్ష ) అనంతపురం : జిల్లాలోనూ కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఉరవకొండ, గుంతకల్లు, రాగులపాడు, వజ్రకరూరు, గూళ్యపాల్యం నియోజకవర్గాల్లో వారు పర్యటించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలతో పాటు రైతుల నుంచి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
సీఎస్‌తో కేంద్ర బృందం భేటీ.. వరద నష్టంపై సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాలపై సమీక్షించేందుకు గాను రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో సమావేశమయ్యింది. వివిధ శాఖల వారీగా అధికారులు జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో 6,368 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ‘2లక్షల 12వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 24వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో 5వేల 583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక పునరుద్ధరణ చర్యలకు గాను తక్షణమే 840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం సడలింపులు ఇవ్వాలి. దెబ్బతిన్న వేరుశెనగ పంటకు కూడా నిబంధనలు సడలించాలి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉపశమనం కల్పించాం. ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాం’ అని తెలిపారు. (చదవండి: సంక్షోభం నుంచి సంక్షేమంలోకి..) వరద నష్టం ఫోటో ఎగ్జిబిషన్ సందర్శన సాక్షి,విజయవాడ: నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోవరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని సౌరవ్ రే నేతృత్వంలోని కేంద్ర బృందం సందర్శించింది. జిల్లాలో సంభవించిన నష్టంపై కలెక్టర్ ఇంతియాజ్ కేంద్ర బృందానికి వివరించారు. వరదనష్టంపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాధమికంగా అగ్రికల్చర్లో 17000 హెక్టార్లు, హార్టీ కల్చర్‌లో 8,000 హెక్టార్ల పంటనష్టం జరిగిందని తెలిపారు. దెబ్బతిన్న ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ రోడ్ల అంచనాలను కూడా వివరించారు. జిల్లాలోని మూడు మండలాల్లో కేంద్రకమిటీ పంట నష్టాన్ని పరిశీలించనుందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. -
టీడీపీ సూపర్ జంబో రాష్ట్ర కమిటీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని 219 మందితో చంద్రబాబు ఏర్పాటు చేశారు. పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల నియామకాలపై అసంతృప్తి, ఆగ్రహాలు వ్యక్తమైన నేపథ్యంలో సూపర్ జంబో కమిటీని నియమించారు. ఒకే కమిటీలో ఇంత మందిని నియమించడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర కమిటీలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారిని నియమించారు. కమిటీలో బడుగు, బలహీన, ఎస్సీ వర్గాలకు 61 శాతం పదవులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి నియోజకవర్గ, మండల స్థాయి నాయకులను సైతం ఈ కమిటీలో చేర్చడం గమనార్హం. ఉపాధ్యక్షులుగా.. పత్తిపాటి పుల్లారావు, సుజయకృష్ణ రంగారావు, నిమ్మల కిష్టప్ప, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, పరసా రత్నం, దాట్ల సుబ్బరాజు, సాయి కల్పనారెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్, జయనాగేశ్వర్‌రెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్, తిప్పేస్వామి, హనుమంతరాయచౌదరి, పుత్తా నరసింహారెడ్డి, దామచర్ల జనార్దనరావు, శ్రీధర కృష్ణారెడ్డి, వేమూరి ఆనంద్సూర్యలను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా.. ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, అమర్నాథ్రెడ్డి, అఖిలప్రియలతో పాటు మరో 11 మందిని నియమించారు. అధికార ప్రతినిధులుగా.. గౌరువాని శ్రీనివాసులు, ద్వారపురెడ్డి జగదీష్, మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, గూడూరి కృష్ణారావు, పరిటాల శ్రీరాం, కాకి గోవర్ధన్‌రెడ్డి, నాగుల్ మీరా, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, ఆనం వెంకట రమణారెడ్డి, గంజి చిరంజీవులు, రుద్రరాజు పద్మరాజు, పిల్లి మాణిక్యాలరావు, మద్దిపట్ల సూర్యప్రకాష్, సప్తగిరి ప్రకాష్, మోకా ఆనంద్‌సాగర్, దివ్యవాణి, ఎన్బీ సుధాకర్‌రెడ్డి, సయ్యద్ రఫీలను నియమించారు. నాలెడ్జ్ కమిటీ చైర్మన్‌గా గురజాల మాల్యాద్రిని నియమించారు. అసంతృప్తిలో ఉన్న మహిళా నేతలకు చోటు పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీలో స్థానం ఇవ్వకుండా తమను అవమానించారని అసంతృప్తిలో ఉన్న మహిళా నేతలు పంచుమర్తి అనూరాధ, గౌతు శిరీష, పీతల సుజాత తదితరులకు ఈ కమిటీలో చోటు కల్పించారు. కాగా, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా మాజీ సీఎం కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని నియమించారు. -
మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు..!
నిర్మల్: తెలంగాణకు చెందిన మరో మావోయిస్టు అగ్రనేత పోలీసులకు లొంగిపోయాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు సట్వాజీ అలియాస్ (సుధాకర్/బుర్యార్/ కిరణ్) దళంలోనే పరిచయమైన తన భార్య నీలిమ అలియాస్ మాధవితో కలసి రాంచీలో పోలీసులకు లొంగిపోయారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జార్ఖండ్‌లో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణ, అమలు లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఇంటర్‌లోనే ఆకర్షితుడై.. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన దేవుబాయి, కాశీరాం దంపతుల పెద్ద కుమారుడు ఒగ్గు సట్వాజీ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివారు. 1981–83 మధ్య ఇంటర్మీడియెట్ నిర్మల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ) నాయకులతో సంబంధాలు కొనసాగించారు. వారి మాటలు, పాటలతో పాటు విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యారు. అప్పటి నుంచే ఆర్ఎస్యూ(అండర్‌గ్రౌండ్) కొరియర్‌గా, రాడికల్స్ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు. 1984లో పూర్తిస్థాయిలో అడవి బాట పట్టి పీపుల్స్‌వార్‌లో చేరి నక్సలైటుగా మారారు. ఈయనపై దాదాపు రూ.కోటి రివార్డ్ ఉన్నట్లు తెలిసింది. జనంలోకి వచ్చి..మళ్లీ దళంలోకి.. పీపుల్స్‌వార్‌లో చేరిన రెండేళ్లకే కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో 1986లో కర్ణాటకలోని గుల్బర్గాలో సట్వాజీ పోలీసులకు చిక్కారు. 1989 చివరి వరకు జైలులోనే ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయడంతో బయటకు వచ్చారు. అప్పుడు ఇంటి వద్దే ఉంటూ నిర్మల్‌లో భారీ స్తూపం నిర్మింపజేశారు. మళ్లీ ప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధం విధించడంతో 1991నుంచి తిరిగి దళంలోకి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఆయన జనంలోకి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ దళాల కమాండర్‌గా, జిల్లా కమాండర్‌గా కొనసాగారు. 2001 నుంచి రాష్ట్ర కమిటీలో చేరి దండకారణ్య మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి కేంద్ర కమిటీకి, జార్ఖండ్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలకు వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు సింగరేణిలో జరిగిన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతుంటారు. చెన్నూరు, జైపూర్, నీల్వాయి, కోటపల్లి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఈయనపై కేసు లు ఉన్నాయి. సట్వాజీపై జార్ఖండ్ ప్రభుత్వం రూ. కోటి రివార్డు కూడా ప్రకటించింది. దళంలోనే మూడున్నర దశాబ్దాలు సట్వాజీ దాదాపు మూడున్నర దశాబ్దాల తన జీవితాన్ని అజ్ఞాతంలోనే గడిపారు. 1998లోనే తండ్రి కాశీరాం చనిపోయినా ఇంటికి రాలేదు. తమ్ముళ్లు నారాయణ, రామన్నలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు కాల్వ పోసవ్వ, దాసరి పోసవ్వలకు పెళ్లిళ్లయ్యాయి. తల్లి దేవుబాయి ఒక్కరే సారంగపూర్‌లో ఉంటున్నారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన ఆమెను నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తి స్వయంగా ఆమె వద్దకు వెళ్లి పలకరించారు. తన అన్నను కలసి వస్తుండగా సట్వాజీ తమ్ముడు నారాయణ మరో వ్యక్తితో కలసి 2017 ఆగస్టులో రాంచీ రైల్వేస్టేషన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడం, పార్టీలో అంతర్గత సంక్షోభాల కారణంగా తన భార్య మాధవి అలియాస్ నీలిమతో పాటు సట్వాజీ అలియాస్ సుధాకర్ రాంచీలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. జార్ఖండ్‌లో సుధాకర్ లొంగిపోయినట్లు తమకు అధికారిక సమాచారం రాలేదని నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు పేర్కొన్నారు. కేంద్ర కమిటీ దాకా ఎదిగి.. పీపుల్స్‌వార్ (మావోయిస్టు పార్టీ)లో తెలంగాణ నుంచి ఎదిగిన కీలక నేతల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ కొరియర్‌గా పని ప్రారంభించిన సట్వాజీ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం జిల్లా కమాండర్ (కార్యదర్శి)గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ దండకారణ్యంలో మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూనే సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. -
ఫార్మా సిటీ భూముల పరిశీలన
భూసేకరణ వివరాలివీ.. కేటగిరీ ఎకరాలు లబ్ధిదారులు జీఓ 45 ప్రకారం 5,650.34 2,008 జీఓ 123 ప్రకారం 710.18 360 2017 భూసేకరణ చట్టం 618.04 295 ఆక్రమణదారులు 206.23 327 ఇవిగాకుండా.. అక్రమార్కుల చెర నుంచి 395 ఎకరాలను వెనక్కి తీసుకున్న రెవెన్యూయంత్రాంగం టీఎస్ఐఐసీకి బదలాయించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రపంచస్థాయి ఔషధనగరి(ఫార్మాసిటీ) స్థాపనకు కీలక అడుగు పడింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రతినిధుల బృందం గురువారం ప్రతిపాదిత ఫార్మాసిటీ భూములను పరిశీలించి.. సందేహాలను నివృత్తి చేసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును 19,930 ఎకరాల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముచ్చర్ల కేంద్రంగా కందుకూరు, కడ్తాల, యాచారం మండలాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీతో జిల్లా రూపు రేఖలు సంపూర్ణంగా మారిపోతాయని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో 2014 చివరలో అంకురార్పణ జరిగిన ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించాలని సంకల్పించింది. న్యాయపరమైన అవరోధాలు అధిగమించి.. మొదటి దశకు సరిపడా భూసేకరణ ప్రక్రియ పూర్తికావడంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టు పనులకు ముహూర్తం పెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఔషధనగరి ఏర్పాటుకు అవసరమైన కీలక అనుమతులను పొందడంపై దృష్టిసారించింది. ఈ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ముగించడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ అనుమతులపై క్షేత్రస్థాయిలో పర్యటించింది. నేరుగా ప్రతిపాదిత ప్రదేశానికి హెలికాప్టర్లో వచ్చిన ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర అధికారుల బృందం.. ఫార్మారంగంతో ఎదురయ్యే పరిణామాలు, కాలుష్య ఉద్గారాలు రాకుండా తీసుకునే చర్యలు, పర్యావరణంపై ప్రభావం తదితర అంశాలను అధికారులతో చర్చించింది. అంతేగాకుండా భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకుంది. ఫార్మాసిటీకి ‘నిమ్జ్’ హోదా దక్కడంతో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపేణా భారీగా నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో ప్రతిపాదిత ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల నివాసగృహాల నిర్మాణం మొదలైన విషయాలను పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని అడిగి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు స్థానికుల నుంచి ఏలాంటి అభ్యంతరమూ వ్యక్తం కాలేదని, అక్కడక్కడా ఒకరిద్దరు పరిహారం తీసుకున్నవారే.. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పారని అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. రూ.363.23 కోట్లు చెల్లింపు.. ఔషధనగరి (ఫార్మాసిటీ)కి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.363.23 కోట్లు వెచ్చించింది. 7581.14 ఎకరాల భూమిని సేకరించి ఈ మేరలో పరిహారం రూపేణా భూములు కోల్పోయిన వారికి డబ్బులు చెల్లించింది. మేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, మీర్ఖాన్పేట, ముచ్చర్ల, పంజాగూడ, కొత్తూరు, మహమ్మద్‌నగర్, తిమ్మాయిపల్లి, కందుకూరు, ముద్విన్, కర్కల్‌పహాడ్, కడ్తాల్‌లో ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూములను సమీకరించింది. జీఓ 45, 123, రాష్ట్ర భూ సేకరణ చట్టం–2017 కింద భూములను తీసుకుంది. ఇవేగాకుండా ఆక్రమిత ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుంది. తద్వారా ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు మార్గం సుగమం చేస్తోంది. అయితే, భూసేకరణ తీరును సవాల్ చేస్తూ భూ నిర్వాసితులు కొందరు న్యాయస్థానానికెక్కడంతో కొన్ని గ్రామాల్లో సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి చోట్ల 2017 చట్టం ప్రకారం భూములను తీసుకునేందుకు రెవెన్యూయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఏరియల్ సర్వే, మ్యాపుల పరిశీలన హెలికాప్టర్‌తో సర్వే కందుకూరు: ముచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ భూముల్లో కేంద్ర పర్యావరణ బృందం గురువారం పర్యటించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్లో కేంద్రం పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి గుప్తా, అదనపు కార్యదర్శి వర్మ, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితో కలిసి మొదట ఏరియల్ సర్వే చేశారు. అనంతరం 2.15 గంటలకు ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్ 288లోని భూమిలో దిగారు. వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని దాదాపుగా గంటకు పైగా పరిశీలించారు. మ్యాపులను చూసి వివరాలను జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్‌తో పాటు రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సర్పంచ్, రైతులు, ప్రజలు ఎక్కడ అని బృందంలోని సభ్యులు ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలినట్లు సమాచారం. అనంతరం 3.20 గంటలకు కేంద్ర బృందం హెలికాప్టర్లో తిరిగి వెళ్లిపోయింది. కాగా ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం నుంచే దాదాపుగా 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఫార్మాసిటీలోకి వెళ్లే దారులను దిగ్బంధించారు. వచ్చి పోయే వారిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు పొలాలకు వెళ్లే రైతులను సవాలక్ష ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. -
జిన్‌పింగ్ కోసం రాజ్యాంగ సవరణ
బీజింగ్: చైనాలో శక్తిమంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్ని ఏ వ్యక్తులైనా రెండుసార్లకు మించి చేపట్టకూడదనే రాజ్యాంగ నిబంధనను తొలగించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) సిద్ధమైంది. సీపీసీకి చెందిన సెంట్రల్ కమిటీ ఈ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ పదవీకాలం 2022తో ముగియనుంది. తాజా నిర్ణయం వల్ల జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. గతేడాది జరిగిన సీపీసీ కాంగ్రెస్ సమావేశాల్లో జిన్‌పింగ్ సిద్ధాంతాల్ని, ఆలోచనా విధానాన్ని రాజ్యాంగంలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. -
అతనేమయ్యాడు?.. ఉరితీశారా?!
సియోల్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు అత్యంత సన్నిహితుడు, సైన్యాధ్యక్షుడు హ్యాంగ్ ప్యాంగ్ సో.. కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయారు. ప్యాంగ్ అదృశ్యంపై ఉత్తర, దక్షిణ కొరియాల్లో మీడియాల్లో పలు కథనాలు వస్తున్నాయి. అధినేత కిమ్ తరువాత అంతటి శక్తివంతుడుగా పేరున్న ప్యాంగ్ కొద్ది రోజుల నుంచి ఎక్కడా కనిపించడం లేదు. ఇదిలాఉండగా.. ప్యాంగ్కు ఉత్తర కొరియా ప్రభుత్వం మరణశిక్ష విధించి ఉండొచ్చని దక్షిణ కొరియా మీడియా చెబుతోంది. అయితే మరణశిక్షపై విధించినట్లుగా చెబుతున్నా.. దానిపై ఎక్కడా స్పష్టత లేదు. హ్యాంగ్ ప్యాంగ్ సోపై ఉత్తర కొరియాలో అవినీతి ఆరోపణలు వచ్చాయని.. ఆ కారణం వల్లే. సైన్యాధక్ష పదవినుంచీ, వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి తొలగించినట్లు దక్షిణ కొరియా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. హ్యాంగ్ ప్యాంగ్తో పాటు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో కీలక వ్యక్తి, అధినేతకు సన్నిహితుడు అయిన కిమ్ వాంగ్ హ్యాంగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు దక్షిణ కొరియా మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కీలక వ్యక్తులపై అధినేత కిమ్ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇది మిగిలిన నేతలకు, ప్రజలకు కూడా ఒక బలమైన హెచ్చరికలా ఉంటుందని కిమ్ భావించినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. -
కరువుపై కేంద్ర బృందం పర్యటన
-
వరదల నష్టం అంచనాకు కేంద్ర బృందాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు బృందాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. మంగళవారం వారు హైదరాబాద్ చేరుకొని రెండు బృందాలుగా మారి నెల్లూరు, కడప, చిత్తూరు ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు (8వ తేది నుంచి 11వరకు) పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తారని చెప్పారు. పంట నష్టంతోపాటు ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేసి 11న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విజయవాడలో కలుస్తారని ఆయన తెలిపారు. గత నెలలో వరదలు వచ్చి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో నష్టం కలిగించిన విషయం తెలిసిందే. -
గుంకలాంకే ఛాన్స్!
విజయనగరం కంటోన్మెంట్ / విజయనగరం రూరల్ : జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. స్థల పరిశీలన కోసం జిల్లాకొచ్చిన బృందం దాదాపు సానుకూలత చూపించింది. విజయనగరం మండలం గుంకలాంలోని స్థలం పట్ల బృందం మొగ్గు చూపింది. కేంద్రం ఆమోదిస్తే ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. గతం లో పాచిపెంట మండలంలో స్థలాన్ని పరిశీలించి అనుకూలంగా లేదని తేల్చేశారు. దీంతో గిరిజన వర్సిటీ పక్కజిల్లా విశాఖకు తరలిపోనుందని అందరూ భావించారు. తాజాగా కొత్తవలస మండలం రెల్లి, విజయనగరం మండలం గుంకలాంలలో స్థలాన్ని పరిశీలించిన కేంద్రకమిటీ గుంకలాంవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. కేంద్రం నిధులిస్తే జేఎన్టీయూలో తాత్కాలికంగా గిరిజనవర్సిటీని ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించడం మరింత నమ్మకం కలిగిస్తోంది. గిరిజన యూనివర్సిటీ స్థల పరిశీలన కోసం కేంద్ర మానవ వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సుక్బీర్ సింగ్ సందు ఆధ్వర్యంలోని కేంద్ర బృందం మంగళవారం జిల్లాలో పర్యటించింది. ఆయనతో పాటు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా జిల్లాకు రాగా వారికి రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి నారాయణ, కలెక్టర్ ఎంఎం నాయక్‌లు జిల్లాలోని స్థలాలను చూపిస్తూ అక్కడి పరిస్థితులు వివరించారు. తొలుత కొత్తవలస మండలం రెల్లిలో ఉన్న స్థలాలను పరిశీలించగా, మధ్యాహ్నం విజయనగరం మండలం గుంకలాం గ్రామ పరిధిలో ఉన్న స్థలాలను పరిశీలించారు. అనువైన స్థలం విషయమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. వారి తీరును చూస్తుంటే రెల్లి గ్రామం కన్నా గుంకలాంపైనే మక్కువ చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. తొలుత కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో గిరిజన యూనివర్సిటీకి సరిపడా స్థలం ఉందని చూపించగా, దానిని పరిశీలించారు. ఇక్కడ 347.47 ఎకరాల మైదాన ప్రాంతముంది. 178.77 ఎకరాలు గుట్టలతో నిండిఉంది. మొత్తం 526.24 ఎకరాలను బృందం పరిశీలించింది. అనంతరం విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామ పరిసరాల్లో ఉన్న 347.63 ఎకరాల డి పట్టా భూములు, 163.78 ఎకరాల కొండపోరంబోకు, 29.33ఎకరాల బంజరు భూమి,4.23 ఎకరాల రస్తా భూములతో కలిపి 504.97 ఎకరాలను బృందం పరిశీలించింది. మొత్తం ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ తన పరిశీలన నివేదికను కేంద్రానికి అందించనుంది. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో పరిశీలనలు చేసిన కేంద్ర బృందం ఎక్కువగా గుంకలాంకు ప్రాధాన్యం ఇనిచ్చినట్టు స్పష్టమవు తోంది. కొత్తవలసలోని రెల్లిలో భూముల కన్నా గుంకలాంలోని భూములు గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్టు బృందం గుర్తించింది. కొత్తవలసలో ఉన్న భూములు ఎక్కువగా గుట్టలతో పాటు ఎక్కువగా ఏటవాలుగా ఉన్నాయి. అలాగే అక్కడి భూముల్లో నిర్మాణాలకు కోర్టు అనుమతులు కూడా అవసరముంది. దీనికి తోడు ఇక్కడ స్థలం ఎక్కువగా కొండ ప్రాంతం నిండిఉందని కేంద్ర బృందం వ్యాఖ్యానించినట్టు మంత్రి నారాయణ విలేకరులకు తెలిపారు. అలాగే గుంకలాం భూములు పరిశీలించిన ఈ ఐదుగురు సభ్యులున్న కమిటీ సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇక్కడున్న భూముల్లో గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలూ లేకపోవడంతో పాటు జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉండటాన్ని కూడా సానుకూలంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదమే తరువాయి అన్న భావన అందరిలో కలుగుతోంది. మరో వైపు మంత్రి నారాయణ విలేకర్లతో మాట్లాడినప్పుడు గుంకలాంకే ప్రాధాన్యతనిచ్చారు. జేఎన్టీయూలో తాత్కాలికంగా తరగతులు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అన్ని అంశాలూ సానుకూలంగా ఉండడంతో కేంద్రానికి నివేదించాక ఆమోదం లభించి నిధులు విడుదలైతే వచ్చే ఏడాది నుంచే గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. యూనివర్సిటీకి భవన సముదాయం నిర్మంచే వరకూ విజయనగరం పట్టణానికి సమీపంలో ఉన్న జేఎన్టీయూలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ఆమోదం లభిస్తే జేఎన్టీయూలో తాత్కాలికంగా యూనివర్సిటీని ప్రారంభించడానికి ప్రయత్నిస్తామన్నారు ఈ విష యమై కూడా బృందం సభ్యులు జేఎన్టీయూ అధికారులను అడిగినట్టు చెబుతున్నారు. జేఎన్టీయూ అధికారులు కూడా తాత్కాలికంగా భవనాన్ని ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారని సమాచారం. -
'తుపాను నష్టంపై నివేదిక అందజేశాం'
విశాఖ: హుదూద్ తుపాను వల్ల రూ. ఇరవై వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాలుగు జిల్లాల్లో తుపాను నష్టం రూ. 21, 908 కోట్లు జరిగినట్లు అంచనా వేసి ఆ నివేదికను కేంద్ర కమిటీలోని సభ్యులకు అందజేశామన్నారు. ఇప్పటి వరకూ రూ. 7,500 కోట్లను రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కేంద్ర బృందాలు తుపానుతో నష్టపోయిన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్ర బృందాలు గురు, శుక్రవారాల్లో తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించాయి. -
విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన
విశాఖ: జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హుద్‌హుద్ తుపాను నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాలను కలవడానికి వచ్చిన రాజకీయ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర బృందాన్ని కలవాలంటూ వారు విజ్ఞప్తి చేసినా పోలీసులు వినకపోవడంతో రాజకీయ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులను కలిసి తీరుతామని వారు నిరసనకు దిగారు. కేంద్ర బృందాలు తుపానుతో నష్టపోయిన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్ర బృందాలు శుక్రవారం విశాఖ జిల్లాల్లో పర్యటించాయి. గురువారం తూర్పుగోదావరి జిల్లాలో ఆ అధికారులు పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. తమ బాధలను అధికారులు పట్టించుకోకుండా వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
గోడు వినకుండానే వెళ్లిపోయారు..
* కేంద్ర బృందంపై తూర్పుగోదావరి జిల్లా హుద్‌హుద్ బాధితుల పెదవివిరుపు * శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరోజు పర్యటనే సాక్షి ప్రతినిధి, కాకినాడ/శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాలు గురువారం తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించాయి. తమ బాధలు వినకుండానే అధికారులు వెళ్లిపోయారని తూర్పుగోదావరి జిల్లాలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కె.కె.పాఠక్, జాతీయ రహదారులశాఖ కార్యదర్శి ఎస్ఈ ఆర్.పి.సింగ్, కేంద్ర తాగునీరు, శానిటేషన్ శాఖకన్సల్టెంట్ పి.శ్రీవాత్సవ, కేంద్ర విద్యుత్‌శాఖ డెరైక్టర్ వివేక్ గోయల్, రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టర్ ఎస్.ఎం.కొలహత్ కౌర్‌ల బృందం తూర్పు గోదావరి జిల్లా తీరప్రాంతంలోని కొత్తపల్లి, తొండంగి, తుని రూరల్ మండలాల్లో పర్యటించింది. ఉప్పాడ వద్ద కోసుకుపోయిన బీచ్ రోడ్డు, సముద్రపు నీరు వచ్చి దెబ్బతిన్న పంట పొలాలు, దెబ్బతిన్న ధాన్యం, కోనపాపపేటలో సముద్ర కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించింది. తుపాను సమయంలో సుమారు 60 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. తమ గోడు వెళ్లబోసుకుందామని ఆశగా ఎదురుచూసిన బాధితులు తమను పలకరించకుండానే కేంద్ర బృంద సభ్యులు వెళ్లిపోవడంతో నిరాశచెందారు. తొండంగి, తుని మండలాల పరిధిలోని శృంగవృక్షం, తేటగుంట, పొలిమేరు గ్రామాలను, దెబ్బతిన్న అరటి, పామాయిల్ తోటలను పరిశీలించిన అధికారులు తుని తాండవ అతిథిగృహంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ తుపానుతో జిల్లాలో రూ.507.78 కోట్ల నష్టం సంభవించిందని జిల్లా అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కలెక్టర్ నీతూప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తదితరులు ఈ బృందం వెంట ఉన్నారు. విశాఖ జిల్లా ఎస్.రాయవరం, రాంబిల్లి, మునగపాక మండలాల్లో కొబ్బరి, జీడిమామిడి, వరి పంటలతో పాటు పౌల్ట్రీ పరిశ్రమకు వాటిల్లిన నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. ట్రాన్స్‌కోకు జరిగిన నష్టాలను సంస్థ డెరైక్టర్ ఎస్.సుబ్రహ్మణ్యం, సీఈ కె.ప్రవీణ్‌కుమార్ వారికి వివరించారు. అనకాపల్లిమండలం సంపత్పురంలోని ఎస్విఎస్ఎన్ రెడ్డి పౌల్ట్రీ కాంప్లెక్స్‌కు వెళ్లి కోళ్లకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. కేంద్ర బృందం శుక్రవారం విశాఖపట్నం ఉక్కుకర్మాగారానికి జరిగిన నష్టాన్ని పరిశీలించి ఢిల్లీ వెళ్లనుంది. మరోసారి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచన కేజీ బేసిన్ ఎస్ఈ ఎం.రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఫైనాన్స్ కమిషన్ డెరైక్టర్ రాజీవ్‌కుమార్ సేన్, పశుసంవర్థకశాఖ ఉపకార్యదర్శి పి.ఎస్.చక్రవర్తి, సి.రామవర్మ బృందం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, సరుబుజ్జిలి, పైడిభీమవరం ప్రాంతాల్లో పర్యటించింది. ఆంధ్రా ఆర్గానిక్స్ పరిశ్రమను, బెజ్జిపురం, మరువాడ, అక్కయ్యపాలెంలో, కోటపాలేల్లో తోటలు, పంటలు, పౌల్ట్రీ నష్టాలను, అల్లివలసలో దెబ్బతిన్న బోట్లను పరిశీలించారు. ఆస్తి, వాణిజ్య పంటల నష్టానికి సంబంధించి కోష్ఠ, ఎచ్చెర్లలోని తమ్మినాయుడుపేట, సరుబుజ్జిలి మండలంలో వంశధార రైట్ కెనాల్‌ను బృందం సభ్యులు చూశారు. నష్టాల గురించి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితర అధికారుల్ని, సహాయ కార్యక్రమాలు అందిన తీరుతెన్నులపై బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోసారి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. తుపాను నష్టంపై కేంద్రానికి ఈనెల 21న రాష్ట్ర నివేదిక అందిందని చెప్పారు. ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి నష్టాన్ని తెలిపే నివేదికను కేంద్ర బృందానికి ఇచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, మత్స్యకార, చేనేత సంఘ నాయకులు తుపాను నష్టాన్ని వివరించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ తుపాను నష్టం రూ.1,500 కోట్లకు పైనే ఉంటుందని చెప్పారు. గురు, శుక్రవారాల్లో పర్యటించాల్సిన కేంద్ర బృందం పర్యటన ఒక్కరోజుకే పరిమితి కావడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావు కేంద్ర బృందం పర్యటించిన సమయంలో కనిపించలేదు. -
త్వరలో రాష్ట్రానికి కేంద్ర కమిటీ
న్యూఢిల్లీ: బీజేపి ఎంపి బండారు దత్తాత్రేయ ఈరోజు ఇక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్‌ను కలిశారు. తెలంగాణలో రైతుల పరిస్థితిని, వారి ఆత్మహత్యల సంఘటనలను మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతుల ఆత్మహత్యల అధ్యయనానికి త్వరలో కేంద్ర కమిటీని పంపుతామని మంత్రి చెప్పినట్లు తెలిపారు. కేంద్ర కమిటీ ఆత్మహత్యలపై అధ్యయనం చేసి, కేంద్రానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తి రైతులను దళారులు మోసం చేస్తున్నారని చెప్పారు. దీనిని అరికట్టాలన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని వైమానిక శిక్షణాకేంద్రంగా మార్చాలని దత్తాత్రేయ కోరారు. ** -
ఇప్పుడొచ్చారు
సాక్షి, ఏలూరు:తుపానుల ప్రభావంతో కురి సిన భారీ వర్షాలకు నీటమునిగి దెబ్బతిన్న వరిచేలను కోసినా ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో కొందరు రైతులు తగులబెట్టేశారు. మరికొందరు పంటను పశువుల కోసం వదిలేశారు. ఇంకొందరు ట్రాక్టర్లతో దున్నేసి చేలను దాళ్వాకు సిద్ధం చేసుకుంటున్నారు. గాలి వానకు విరిగిన అరటి చెట్లను తొల గించారు. రాలిన కూరగాయలు, తోటలు కుళ్లి మట్టిలో కలిసిపోయూరుు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ జాడలు సైతం చెరిగిపోయూయి. ఈ పరిస్థితుల్లో పంట నష్టాలను అంచనా వేసేందుకు సోమవారం తాపీగా జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ‘వచ్చాం.. చూశాం’ అన్నట్లుగా వ్యవహరించారు. నష్టాలను అంచనా వేశామనిపించుకునేందుకు శాంపిల్‌గా ధాన్యం గింజల్ని మూటగట్టుకుని వెళ్లిపోయూరు. కేంద్ర బృందం తీరుకు అవాక్కైన అన్నదాతలు ‘ప్రకృతి ఎప్పుడో గాయం చేసింది..ప్రభుత్వం ఇప్పుడు తాపీగా పరామర్శకు వచ్చింది.. ఏం లాభం. మా బాధలు మాకు తప్పవు’ అంటూ నిట్టూర్చారు. జిల్లాలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటల్ని సాగుచేస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో పై-లీన్ తుపాను, ఆ వెంటనే అల్పపీడనం, నవంబర్‌లో హెలెన్ తుపాను విరుచుకుపడి పంటలను ముంచేశారుు. వాటి దెబ్బకు జిల్లాలో 4,81,472 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు నాశనమయ్యూయని అంచనా. నష్టాల ఊబిలో కూరుకుపోరుున తమను ఆదుకోవాలంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఏ అధికారైనా కనీసం పరామర్శకు వస్తారేమోనని, పంట నష్టాన్ని గుర్తిస్తారేమోనని ఎదురుచూశారు. ఎవరూ వారి గోడును ఆలకించలేదు. తమ బతుకులు ఇంతేననుకుంటూ అన్నదాతలు మళ్లీ అప్పులు చేసి దాళ్వా పం టకు సిద్ధమవుతున్నారు. దెబ్బతిన్న చేలతో కలిపి దాదాపు 5,30,000 ఎకరాల్లో మాసూళ్లు పూర్తయ్యూరుు. ఇక మిగిలింది కేవలం 70 వేల ఎకరాల్లో మాత్రమే. అంటే తుపాన్లు, వర్షాలకు దెబ్బతిన్న పంటలు ఎక్కడో గానీ కనిపించవు. ఉభయగోదావరి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించలేదన్న విమర్శలు వెల్లువెత్తడంతో వచ్చామనిపించేందుకు నష్టం వాటిల్లిన రెండు నెలలకు కేంద్ర ప్రభుత్వం నష్టాల అంచనా బృందాన్ని జిల్లాకు పంపించింది. వచ్చిన వారు మొక్కుబడిగా పర్యటించి మమ అనిపించేశారు. ఇలా వచ్చి.. వెళ్లారు : ఎఫ్‌సీఐ కంట్రోల్ అసిస్టెంట్ రీజినల్ డెరైక్టర్ కె.సత్యప్రసాద్ నేతృత్వంలోని కేంద్ర కమిటీ సోమవారం ఉదయం ఏలూరులోని కలెక్టరేట్లో పంట నష్టాల ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. అక్కడి నుంచి బయలుదేరి నారాయణపురంలో పంట చేలను పరిశీలించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 90 శాతం మాసూళ్లు పూర్తయ్యూయి. అక్కడి నుంచి బయలుదేరి కారు అద్దాల్లోంచి పొలాలను చూస్తూ ధాన్యం, కుళ్లిన వరి దుబ్బులను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తామని బృందం సభ్యులు తెలిపారు. పంట నష్టాలపై ఈ నెల 15నాటికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పుకుంటూ ముందుకు వెళ్లిపోయూరు. -
మావోయిస్టు నేత శివన్నారాయణ అరెస్టు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు శివన్నారాయణ అలియాస్ శివప్రసాద్‌ను పోలీసులు మెదక్ జిల్లా గజ్వేల్‌లో సోమవారం అరెస్టు చేశారు. వాస్తవానికి మూడు రోజుల క్రితమే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మన రాష్ట్రంలోనే కాక, జాతీయస్థాయిలో కూడా మావోయిస్టు కార్యకలాపాలలో శివన్నారాయణ కీలక పాత్ర పోషించేవారు. ఆయనపై ప్రభుత్వం 5 లక్షల రూపాయల ప్రభుత్వం ప్రకటించింది.