సియోల్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు అత్యంత సన్నిహితుడు, సైన్యాధ్యక్షుడు హ్యాంగ్ ప్యాంగ్ సో.. కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయారు. ప్యాంగ్ అదృశ్యంపై ఉత్తర, దక్షిణ కొరియాల్లో మీడియాల్లో పలు కథనాలు వస్తున్నాయి. అధినేత కిమ్ తరువాత అంతటి శక్తివంతుడుగా పేరున్న ప్యాంగ్ కొద్ది రోజుల నుంచి ఎక్కడా కనిపించడం లేదు. ఇదిలాఉండగా.. ప్యాంగ్‌కు ఉత్తర కొరియా ప్రభుత్వం మరణశిక్ష విధించి ఉండొచ్చని దక్షిణ కొరియా మీడియా చెబుతోంది. అయితే మరణశిక్షపై విధించినట్లుగా చెబుతున్నా.. దానిపై ఎక్కడా స్పష్టత లేదు.
హ్యాంగ్ ప్యాంగ్ సోపై ఉత్తర కొరియాలో అవినీతి ఆరోపణలు వచ్చాయని.. ఆ కారణం వల్లే. సైన్యాధక్ష పదవినుంచీ, వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి తొలగించినట్లు దక్షిణ కొరియా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. హ్యాంగ్ ప్యాంగ్‌తో పాటు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో కీలక వ్యక్తి, అధినేతకు సన్నిహితుడు అయిన కిమ్ వాంగ్ హ్యాంగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు దక్షిణ కొరియా మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కీలక వ్యక్తులపై అధినేత కిమ్ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇది మిగిలిన నేతలకు, ప్రజలకు కూడా ఒక బలమైన హెచ్చరికలా ఉంటుందని కిమ్ భావించినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment