![బండారు దత్తాత్రేయ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81411584884_625x300_0.jpg.webp?itok=drqidC-n)
బండారు దత్తాత్రేయ
న్యూఢిల్లీ: బీజేపి ఎంపి బండారు దత్తాత్రేయ ఈరోజు ఇక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ను కలిశారు. తెలంగాణలో రైతుల పరిస్థితిని, వారి ఆత్మహత్యల సంఘటనలను మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతుల ఆత్మహత్యల అధ్యయనానికి త్వరలో కేంద్ర కమిటీని పంపుతామని మంత్రి చెప్పినట్లు తెలిపారు. కేంద్ర కమిటీ ఆత్మహత్యలపై అధ్యయనం చేసి, కేంద్రానికి నివేదిక ఇస్తుందని చెప్పారు.
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తి రైతులను దళారులు మోసం చేస్తున్నారని చెప్పారు. దీనిని అరికట్టాలన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని వైమానిక శిక్షణాకేంద్రంగా మార్చాలని దత్తాత్రేయ కోరారు.
**