radha mohan singh
-
యూపీ బీజేపీలో కరోనా కలకలం.. ఎంపీకి పాజిటివ్.. నిన్నంతా సీఎం యోగీతోనే
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ బీజేపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాధామోహన్ సింగ్ వైరస్ బారినపడ్డారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో కలిసి ఎన్నికల సమావేశంలో పాల్గొన్న గంటల వ్యవధిలోనే ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ భేటీలో సీఎం యోగి పక్కనే రాధామోహన్‌సింగ్ కూర్చోని, అభ్యర్థుల ఎంపికపై చర్చించడం గమనార్హం. చదవండి: భారీగా కేసులు.. వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వండి! రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఈ సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ పాల్గొన్నారు. అయితే స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్ ఉన్నట్లు రాధామోహన్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, తనను ఇటీవల కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో యూపీ బీజేపీ ఆఫీస్ సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ -
బీజేపీ చీఫ్‌గా నడ్డా!
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డాను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. జేపీ నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. పోటీ లేకుండానే సోమవారం నడ్డా ఎన్నిక జరిగే అవకాశముంది. నడ్డాకు మద్దతుగా నామినేషన్లను సమర్పించేందుకు కేంద్రమంత్రులు సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్రాల ప్రతినిధులు సోమవారం ఢిల్లీ వస్తున్నారు. విద్యార్థి సంఘ కార్యకలాపాలు సహా దశాబ్దాలుగా పార్టీలో పనిచేసిన అనుభవం, కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, ఆరెస్సెస్‌తో అనుబంధం, వివాద రహితుడిగా ఉన్న పేరు.. మొదలైనవి జేపీ నడ్డాకు అనుకూలంగా పరిణమించాయి. దాంతో, ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లను జనవరి 20న దాఖలు చేస్తారని, అవసరమైతే, ఆ మర్నాడు ఎన్నిక నిర్వహిస్తామని బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ఆదివారం ప్రకటించారు. అమిత్ షా అడుగు జాడల్లో.. ఐదున్నర ఏళ్లకు పైగా బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారు. షా హయాంలో బీజేపీ అత్యున్నత దశను అనుభవించింది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్ షా హోంమంత్రిగా చేరడంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది. నడ్డా ప్రస్తుతం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్చార్జ్గా నడ్డా వ్యవహరించారు. -
రబీ పంటలకు ‘మద్దతు’ పెంపు
న్యూఢిల్లీ: వ్యవసాయంలో పెట్టుబడి కూడా తిరిగిరాక తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులకు కాస్తంత ఊరటనిచ్చేలా రబీ పంటల మద్దతు ధరలను కేంద్రం బుధవారం పెంచింది. గోధుమ, బార్లీ, శనగ, ఆవాలు, తెల్ల కుసుమలు, మసూర్ పంటల మద్దతు ధరలు 6 నుంచి 21 శాతం వరకు పెరిగాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై మద్దతు ధరల పెంపుకు ఓకే చెప్పింది. తాజా పెంపు వల్ల రూ.62,635 కోట్ల అదనంగా రైతులకు అందుతాయని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు, ఏడు నెలల్లో దేశమంతటా సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం మద్దతు ధరలను పెంచడం గమనార్హం. మద్దతు ధరల పెంపు, రుణమాఫీ కోరుతూ మంగళవారమే రైతులు ఢిల్లీలోనూ భారీ నిరసనకు దిగడం తెలిసిందే. పెట్టుబడి కన్నా 50 శాతం ఎక్కువగా మద్దతు ధర ఉండేలా చూస్తామని గతంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు హామీనివ్వడం తెలిసిందే. తాజా పెంపు తర్వాత రబీ పంటలన్నింటికీ మద్దతు ధరలు పెట్టుబడి వ్యయం కన్నా 50 శాతం ఎక్కువగానే ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ చెప్పారు. 2018–19 వ్యవసాయ సంవత్సరానికి వర్తించేలా గోధుమ ఎమ్మెస్పీని కేంద్రం రూ. 105 పెంచడంతో గోధుమ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1,840కి చేరింది. అలాగే ప్రతి క్వింటాల్‌కు బార్లీకి రూ. 30 (పెంపు తర్వాత మద్దత ధర రూ. 1,440), శనగలకు రూ. 220 (రూ. 4,620), మసూర్‌కు రూ. 225(రూ. 4,475), ఆవాలకు రూ. 200(రూ. 4,200), తెల్ల కుసుమలకు రూ. 845(రూ. 4,945)ల మద్దతు ధరలను కేంద్రం పెంచింది. గత జూలైలోనే వివిధ ఖరీఫ్ పంటల మద్దతు ధరలను కూడా పెంచి అన్ని పంటలకూ పెట్టుబడి కన్నా మద్దతు ధర 50 శాతం ఎక్కువగా ఉండేలా చేసింది. -
సాగు సంక్షోభంపై జాతీయ సదస్సు
న్యూఢిల్లీ: వ్యవసాయ సంక్షోభంపై చర్చించేందుకు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాగు రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలపై చర్చించడంతో పాటు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఉన్న మార్గాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. ‘ది నేషనల్ కాన్ఫరెన్స్ 2022’ పేరిట ఈ సదస్సు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పుసా కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 20వ తేదీన సదస్సులో పాల్గొంటారని వ్యవసాయ కార్యదర్శి ఎస్కే పట్నాయక్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, నీతి ఆయోగ్ సీనియర్ అధికారులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించే సీఏసీపీ ప్రతినిధులు, పలు వ్యవసాయ వర్సిటీల పరిశోధకులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కూడా హాజరవుతారు. ప్రధాని సమక్షంలోనే సిఫార్సులు.. సమావేశం తొలిరోజున వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు.. రైతులు, వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధో మథనం జరుపుతారు. రెండోరోజు వారు ప్రధాని మోదీ సమక్షంలో తమ సిఫార్సులను వెల్లడిస్తారు. ఇటీవల బడ్జెట్లో కనీస మద్దతు ధరలను.. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లకు పైగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రేటు ఈ ఏడాది 4.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోతుందని గణాంకాలు వెలువడిన నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు రుణమాఫీ, ప్రోత్సాహకాలు వంటివి ప్రకటించాయి. -
శనగ ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించండి
సాక్షి, వేముల : రబీలో సాగు చేసిన శనగపంటకు ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కార్యదర్శి ఎఫ్ఎం పట్నాయక్‌లకు బుధవారం లేఖ రాశారు. బీమా చెల్లింపు గడువు పెంచాలని పట్నాయక్‌తో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలో 80 వేల హెక్టార్లలో రబీలో శనగ పంట సాగైందని, 50 వేల మందికి పైగానే రైతులు ప్రీమియం చెల్లించేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రీమియం చెల్లించేందుకు మూడు రోజులే గడువుందని, రైతులందరూ గడువులోగా చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తీవ్ర వర్షాభావం, తెగుళ్లతో పంటలు దెబ్బతింటే ఫసల్ బీమా వర్తిస్తుందన్న ఉద్దేశంతో రైతులు పంటకు ప్రీమియం చెల్లించేందుకు వారం నుంచి ఎదురుచూస్తున్నారన్నారు. ప్రీమియం మీసేవ ద్వారా చెల్లించేందుకు వెళ్లగా వెబ్సైట్ తెరుచుకోలేదన్నారు. బ్యాంక్‌లలో డీడీల రూపంలో ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయని తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో వేలమంది బ్యాంక్‌లలో డీడీలు తీయాలంటే సాధ్యమయ్యే పనికాదని లేఖలో పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రీమియం చెల్లించేందుకు మరో వారం గడువు ఇవ్వాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శనగ పంటకు ప్రీమియం చెల్లించడంలో ఆలస్యమైందని, చర్యలు తీసుకోవాలని అవినాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
అడ్డంగా బుక్కయిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తుంటే సొంత పార్టీ నుంచే ఆయనకు మద్దతు కరువైందనిపిస్తోంది. ఏకంగా ఆయన మంత్రి వర్గంలోని సభ్యుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ బహిరంగ మూత్ర విసర్జన చేసి అడ్డంగా బుక్ అయ్యారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కారు ఆపి సెక్యురిటీ గార్డుల సంరక్షణలో మూత్రవిసర్జన చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇటీవలే బీజేపీ ఎంపీ ప్రియాంకా రావత్ సరయూ నదిలో ప్లాస్టిక్ బాటిల్ విసిరేసిన వీడియో బయటకు రావడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే. ఓ వైపు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నిస్తుంటే, సాక్షాత్తూ మంత్రులు, ఎంపీలే దీనికి విరుద్దంగా వ్యవహరిస్తుండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు. -
కేంద్ర మంత్రిపై గుడ్లతో దాడి
భువనేశ్వర్: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ పర్యటన పట్ల ఒడిశాలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై కోడిగుడ్లు రువ్వి నిరసన ప్రదర్శించారు. రాష్ట్ర అతిథి గృహం నుంచి బయల్దేరేందుకు బయటకు వచ్చిన సమయంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గుంపుగా చేరుకుని మంత్రి కారు వైపు గుడ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సంఘటనపై జంట నగరాల పోలీసు కమిషనరేటు తక్షణమే స్పందించింది. మంత్రిపై గుడ్లు రువ్విన ఆరోపణ కింద ఐదుగురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. వీరిలో రాష్ట్ర యువ జన కాంగ్రెస్ అధ్యక్షుడు లోక్‌నాథ్ మహారథి ఒకరుగా జంట నగరాల పోలీసు కమిషనరు వైబి ఖురానియా పేర్కొన్నారు. నిందితుల వ్యతిరేకంగా స్థానిక క్యాపిటల్ ఠాణాలో ఫిర్యాదు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వివరించారు. జట్నీలో ఏర్పాటు చేసిన సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరిన సమయంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి విఫలయత్నం చేసి అరెస్టు అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యం వహిస్తున్న ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మారిందని మాజీ ఎంపీ ప్రదీప్ మాఝి ఆరోపించారు. -
‘అక్కడ చనిపోయి ఏడుస్తుంటే రాందేవ్‌తో యోగా’
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో రైతులంతా ఏడుస్తుంటే ఆయన ఏం చక్కా యోగాగురువు రాందేవ్ బాబాతో కలిసి యోగాలో పాల్గొనడం ధుమారం రేపుతోంది. ఓపక్క మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయి పెద్ద వివాదం అవుతుండగా ఆ విషయం ఏమీ పట్టనట్లు ఉన్న ఆయన బిహార్‌లోని మోతిహారీలో ఓ ప్రాంతంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాందేవ్‌తో కలిసి పాలుపంచుకున్నారు. ఇప్పుడా విషయం విమర్శలకు తావిస్తోంది. మూడు రోజుల కార్యక్రమంగా రాందేవ్ ఇక్కడ యోగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల మృతి విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర విమర్శలు పేలుతున్న విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లోనే రైతులు చనిపోయారని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాత్రం పోలీసులకు రైతుల మరణానికి సంబంధం లేదంటూ సమస్య తీవ్రతను దాటవేశారు. -
కేంద్రమంత్రితో మాట్లాడిన పోచారం
హైదరాబాద్‌సిటీ: మిర్చి కొనుగోలుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ తో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. మిర్చి ధర తగ్గడం, రైతుల ఆందోళనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అనుమతితో త్వరలోనే నాఫేడ్ లేదా ఇతర సంస్థల ద్వారా మిర్చీని కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందకుండా కొన్ని రోజులు ఓపిక పడితే మిర్చీకి మంచి ధర లభిస్తుందని తెలిపారు. -
సోనియాపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సవాల్ కేంద్ర ప్రభుత్వానికి విసిరిన సవాల్ పై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహారాణులకు చోటులేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై సోనియా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో టీవీ లో చూశాను. రాయ్ బరేలిలో ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తన అల్లుడు రాబర్ట్ వాద్రా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరారు. పెద్ద కుటుంబానికి కోడలు అయినంత మాత్రాన ఆమె మహారాణిలా ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతి పేదవారి ఇంటింటికీ తిరుగుతూ రాహుల్ నాటకాలు ఆడుతున్నారంటూ కామెంట్ చేశారు. మీరు టార్గెట్ చేయడానికి.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అని, ఆయన చక్రవర్తి కాదు అని సోనియాను ఉద్దేశించి కేంద్ర మంత్రి రాధా మోహన్ వ్యాఖ్యానించారు. ఆయుధాల వ్యాపారి నుంచి బినామీ పేరుతో సెంట్రల్ లండన్ లో వాద్రా ఇల్లు కొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ దర్యాప్తు జరపనుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సోనియా తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
పసుపు రైతులను ఆదుకోండి: ఎంపీ కవిత
న్యూఢిల్లీ: నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం ఉదయం కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల సమస్యలపై ఆమె ఈ సందర్భంగా కేంద్రమంత్రితో చర్చించారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు కనీస గిట్టుబాటు ధర పెంపు విషయాన్ని కవిత...రాధామోహన్ సింగ్ దృష్టికి తీసుకు వెళ్లారు. అలాగే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. దేశంలోనే పసుపు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నా.. పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర ప్రకటించే పంటల జాబితా కింద పసుపు పంటను కూడా చేర్చాలని, అలాగే ఇతర వాణిజ్య పంటల జాబితాలో పసుపును కూడా చేర్చాలని కోరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యాభై మంది పసుపు రైతులు కూడా వ్యవసాయ మంత్రిని కలిసి, తమ సమస్యలను వివరించారు. జిల్లాలో పండే పసుపుకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని జియోగ్రాఫికల్ గుర్తింపును ఇవ్వాలని వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ కవిత ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓ వినతి పత్రాన్ని వ్యవసాయ మంత్రికి సమర్పించారు. -
కేంద్ర మంత్రులతో దత్తాత్రేయ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, బీరేంద్ర సింగ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం దత్తాత్రేయ.. వీరిద్దరినీ కలసి తెలంగాణలో కరువు పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కోరారు. తాగునీరు, పశుగ్రాసానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని దత్తాత్రేయ కోరారు. కేంద్ర ప్రభుత్వం కరువు నిధులు మంజూరు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయలేదని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. 319 కోట్ల రూపాయల కరువు నిధులు ఖర్చు చేయలేదని వివరించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను కరువు ప్రాంతాల్లో యుద్ధప్రతిపాదకన నిధులు ఖర్చు చేయాలని, తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. -
పీఎఫ్ సీకి ఇండియా ప్రైడ్ అవార్డు
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్‌ల చేతుల మీదుగా 2015-16 సంవత్సరానికి గానూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో ‘ఇండియా ప్రైడ్ పీఎస్‌యూ’ అవార్డును అందుకుంటున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎం.కె.గోయెల్. -
'రూ.వెయ్యికోట్లు ఇచ్చి సహాయం చేయరూ..'
హైదరాబాద్: రైతుల అవసరాలకోసం అత్యాధునిక గోదాములు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ కు ఆయన లేఖ రాశారు. 2016 వ్యవసాయ సీజన్ పూర్తయ్యే సమయానికి రెండు దశల్లో 17 లక్షల మెట్రిక్ టన్నులను నిల్వచేసే సామర్థ్యం గల గోడౌన్లను నిర్మించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖలో చెప్పారు. మొత్తం అంచనా వ్యయం రూ.1024 కోట్లు కాగా, నాబార్డు రూ.972.79కోట్ల రుణాన్ని అందిస్తుందని చెప్పారు. అయితే గతంలో వ్యవసాయశాఖ ద్వారా గ్రామీణ భందరాన్ యోజన పథకం కింద ఇలాంటి నిర్మాణాలకు కేంద్రం సబ్సిడీ ఇచ్చేదని, దానిని కేంద్రం తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలిసిందని, అయితే, తాము రైతు సంక్షేమం కోసం ఇప్పటికే ప్రారంభించిన ఈ పని విజయవంతంగా పూర్తయ్యేలా కేంద్రం చూడాలని అన్నారు. రూ. వెయ్యి కోట్లు సహాయం చేసి తాము తలపెట్టిన ఈ బృహత్ కార్యాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. -
'తెలంగాణకు రూ.100 కోట్లు విడుదల'
న్యూఢిల్లీ : తెలంగాణకు తక్షణ సాయం కింద రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ బుధవారం న్యూఢిల్లీలో తెలిపారు. అలాగే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తామన్నారు. ఆ బృందం నివేదిక అందించిన వెంటనే రాష్ట్రానికి మరింత సాయం అందిస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీతోపాటు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కరవు మండలాలను ఆదుకోవాలని కేంద్రమంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. అలానే రాష్ట్రంలోని కరవు మండలాలకు రూ. 2, 514 కోట్లు సాయం అందించాలని కేంద్రమంత్రిని వారు కోరారు. కరవు మండలాలకు సంబంధించి ప్రాధమిక నివేదికను ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఈ సందర్బంగా తెలంగాణ మంత్రులు గుర్తు చేశారు. ఉద్యానవన వర్సిటీకి కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ జనవరి 7వ తేదీన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ యూనివర్శిటీ కోసం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఇప్పటికే స్థలం సిద్ధం చేశామని వారు చెప్పారు. ఆ భేటీ అనంతరం కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ తో కలసి మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కడియం శ్రీహరిలు విలేకర్లతో మాట్లాడారు. -
'ఒంగోలు జాతి గిత్తలను వృద్ధి చేయాలి'
న్యూఢిల్లీ : ఒంగోలు జాతి పశుసంపదను కాపాడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కి వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం న్యూఢిల్లీలో రాధామోహన్ సింగ్‌తో వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఒంగోలు జాతి గిత్తల కృత్రిమ పిండాలు బ్రెజిల్‌కు ఇవ్వవద్దని రాధామోహన్ సింగ్‌ను కోరినట్లు చెప్పారు. దొడ్డిదారిలో ఒంగోలు జాతి గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్ తీసుకుంటుందని ఆరోపించారు. కృత్రిమ పిండాలు ఇస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్లో పశు సంపద వృద్ధికి అనుసరిస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని మనదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశానికి గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులను వృద్ధి చేయాలన్నారు. పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
రైతు ఆత్మహత్యలపై మాయ!
♦ వాస్తవ మరణాల్లో ప్రభుత్వ లెక్కలు 8 శాతమే ♦ ఎన్సీఆర్బీ లెక్క 2.38 లక్షలు.. ప్రభుత్వం లెక్క18,271 ♦ ఆర్టీఐ పిటిషన్లో వెల్లడైన కఠోర వాస్తవాలు ♦ గరిష్టంగా మహారాష్ట్రలో.. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో.. న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్నదాత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రకృతి విపత్తులతో పాటు ఆదుకోవాల్సిన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తప్పుడు లెక్కలతో సమస్యను తప్పుదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నం రైతన్న నడ్డి విరుస్తోంది. 2000-2014 మధ్య దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులెందరు? వారికి అందిన సాయం ఎంతనేదానిపై ఓ వార్తాసంస్థ ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోగా.. చేదు వాస్తవాలు బయటపడ్డాయి. ఈ 15 ఏళ్లలో 18, 271 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో మాత్రం ఈ సంఖ్య అక్షరాలా 2,38,658 అని తేల్చేసింది. అంటే అసలు ఆత్మహత్యలకు ప్రభుత్వం చూపెడుతున్న లెక్క 8 శాతం లోపే. దిగ్భ్రాంతి కలిగించే ఈ కఠోర వాస్తవాలు బయటపడకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని వ్యవసాయ శాఖ నిపుణులు అంటున్నారు. బిహార్, రాజస్తాన్‌లలో పదిహేనేళ్లలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. ఎన్సీఆర్బీ లెక్కలు మాత్రం ఈ సంఖ్య బిహార్‌లో 975 మంది, రాజస్తాన్‌లో 7,927 అని స్పష్టం చేశాయి. ఏ రాష్ట్రంలో చూసినా ఈ లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉంది. ఇంత తేడా ఏంటని ప్రశ్నించిన విపక్షాలకు.. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. ప్రేమ విఫలమై, నపుంసకత్వం, ఇతర కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి విమర్శల పాలయ్యారు. ప్రభుత్వ లెక్కలను పక్కన పెట్టి ఎన్సీఆర్బీ ఇచ్చిన సంఖ్యలను గమనిస్తే.. గడచిన 15 ఏళ్లలో గరిష్టంగా మహారాష్ట్రలో 54,941 మంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30,752 మంది అన్నదాతలు వ్యవసాయ కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘‘చాలా మంది రైతులు సొంత భూముల్లో వ్యవసాయం చేయటం లేదు. వీరిలో కౌలుదారులే ఎక్కువ. వీరు ఆత్మహత్య చేసుకున్నా.. వీరి కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని గుర్తిస్తే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందోనని వీరిని లెక్కించరు. రాష్ట్ర పరిస్థితి బాగానే ఉందని చూపించేందుకు అసలు మరణాలను లెక్కించటం లేదు’’. - నాగరాజ్, మాజీ ప్రొఫెసర్ మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ -
రాష్ట్రానికి రెండు ఫిషరీస్ రిసెర్చ్ సెంటర్లు
-
అన్నింటికీ మేమే కారణమా?
ముంబై: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ పై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు మండిపడ్డాయి. అన్నదాతలను ఆత్మహత్యలకు మద్యపానం కారణం కాదని ఎకాల్ మహిళా కిసాన్ సంఘట్న' కన్వీనర్ బేబీతాయ్ వాగ్ స్పష్టం చేశారు. మద్యపానం అనేది సమాజం అంతటికి సమస్య అని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.600 చొప్పున ఇస్తున్న పెన్షన్ ను రూ. 2000 లకు పెంచాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలు కారణమని మంత్రి(రాధామోహన్ సింగ్) అంటున్నారు. మరి డబ్బున్న వాళ్ల మాటేమిటి. అన్నదాతలు మద్యానికి బానిసలుగా మారడానికి, అప్పుల పాలవడానికి మహిళలే కారణమా?' అని ఆమె ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు కారణాల్లో అప్పులతోపాటు ప్రేమ వ్యవహారాలు, నపుంసకత్వం తదితరాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపిన సంగతి తెలిసిందే. -
రైతు యూనిట్‌గా పంటల బీమా
ఐసీఏఆర్ సమావేశంలో కేంద్రాన్ని కోరిన మంత్రి పోచారం ఉద్యాన వర్సిటీకి కేంద్రం హామీ వ్యవసాయానికి ‘ఉపాధి హామీ’ సాక్షి, హైదరాబాద్: రైతును యూనిట్‌గా తీసుకుని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) 86వ వార్షిక సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి ముందు ఉదయం మంత్రి నివాసంలో, అనంతరం కృషిభవ న్లో కేంద్ర వ్యవసాయశాఖమంత్రి రాధామోహన్‌సింగ్‌తో పోచారం రెండుసార్లు భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హార్టికల్చర్ వర్సిటీ నిర్మాణం సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. రైతు యూనిట్‌గా పంటల బీమాను అమలు చేసేందుకు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని, సర్వే నంబర్ల ఆధారంగా బీమా చె ల్లింపు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సహాయం చేయాలని కోరాం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వ్యవసాయం నిర్వీర్యం కావడంతో రైతులు పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారని, వీరంతా తిరిగి గ్రామాలకు వచ్చేలా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాను.’ అని తెలిపారు. రాష్ట్రానికి ఉద్యాన వర్సిటీని మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరినట్టు చెప్పారు. వ్యవసాయ, పాడిపరిశ్రమ, మత్స్యశాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలను సమావేశంలో పోచారం వివరించారు. ఎన్‌ఆర్‌ఈజీఏను వ్యవసాయానికి అనుసంధానిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని ప్రతిపాదించగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు పోచారం తెలిపారు. -
రైతుల ప్రయోజనాలు కాపాడండి
* సీసీఐకి కేంద్ర మంత్రి రాధా మోహన్‌సింగ్ ఆదేశం * మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని సూచన సాక్షి,న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ల్లో ఇప్పటివరకు జరిగిన పత్తి కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందచేయాలని కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్ సింగ్ సీసీఐ అధికారులను ఆదేశించారు. ఈ రాష్ట్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర లభించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని పత్తి రైతుల ఆత్మహత్యలు, సాగునీటి సమస్యలు, విద్యుత్కష్టాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యవసాయ మంత్రి రాధామోహన్ దృష్టికి బుధవారం ఉదయం తీసుకెళ్లారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయనకు చెప్పారు. దీంతో రాధామోహన్‌సింగ్ వెంటనే ఢిల్లీలోని కృషిభవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ, ఏపీలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లోని పత్తి రైతు సమస్యలపై మంత్రులు, సీసీఐ, నాఫెడ్ అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో పత్తికి మద్దతు ధర కల్పించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని, అదనంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ ఈ సందర్భంగా కోరారు. దీనిపై స్పందించిన రాధామోహన్‌సింగ్ ఏపీ, తెలంగాణలో కనీస మద్దతు ధరకన్నా తక్కువకు పత్తి విక్రయాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగిన పత్తి కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందచేయాలని సీసీఐని ఆదేశించారు.పత్తి కొనుగోళ్లపై సమయానుసారంగా విలేకరుల సమావేశాలు నిర్వహించి వివరాలను అందచేయాలని, తద్వారా సీసీఐ కేంద్రాలున్నాయనే సందేశం రైతులకు వెళుతుందని పేర్కొన్నారు. దళారులకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని ఆకస్మిక తనిఖీలు జరిపించాలని సూచించారు. కాగా.. పత్తి రైతులకు మార్కెట్లో మంచి ధర లభించకుంటే సీసీఐ కొనుగోలు చేస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వ్యాఖ్యానించారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు అవసరముంటే తెలియపర్చాలని సీఎం, ఎంపీలకు లేఖలు రాశామన్నారు. వారం తరువాత పూర్తి పరిస్థితులపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో చేనేతకారుల సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను దత్తాత్రేయ కోరారు. దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ బృందం బుధవారం సంతోష్ గంగ్వార్, నిర్మలా సీతారామన్లకు వేర్వేరుగా వినతిపత్రాలు అందచేసింది. -
త్వరలో రాష్ట్రానికి కేంద్ర కమిటీ
న్యూఢిల్లీ: బీజేపి ఎంపి బండారు దత్తాత్రేయ ఈరోజు ఇక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్‌ను కలిశారు. తెలంగాణలో రైతుల పరిస్థితిని, వారి ఆత్మహత్యల సంఘటనలను మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతుల ఆత్మహత్యల అధ్యయనానికి త్వరలో కేంద్ర కమిటీని పంపుతామని మంత్రి చెప్పినట్లు తెలిపారు. కేంద్ర కమిటీ ఆత్మహత్యలపై అధ్యయనం చేసి, కేంద్రానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తి రైతులను దళారులు మోసం చేస్తున్నారని చెప్పారు. దీనిని అరికట్టాలన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని వైమానిక శిక్షణాకేంద్రంగా మార్చాలని దత్తాత్రేయ కోరారు. ** -
'ఏపీకి అవసరమైన సహాయాన్ని అందిస్తాం'
ఢిల్లీ:తుపాను ప్రభావంతో భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. దీనిపై ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన వివరాలను కేంద్రానికి పంపాలని రాధామోహన్ సింగ్ తెలిపారు. గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు రూ. వెయ్యి కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు'
హైదరాబాద్: తెలంగాణలో వెటర్నరీ, హార్టీకల్చర్ యూనివర్శిటీ కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు ప్రతిపాదనలు ఇచ్చామని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్షాల రాక ఆలస్యమైందని, రైతులు అధైర్యపడవద్దని భరోసాయిచ్చారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉండవచ్చని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు.