‘అక్కడ చనిపోయి ఏడుస్తుంటే రాందేవ్‌తో యోగా’ | Away from Farmer Protests, Agriculture Minister Takes Yoga Break | Sakshi
Sakshi News home page

‘అక్కడ చనిపోయి ఏడుస్తుంటే రాందేవ్‌తో యోగా’

Published Thu, Jun 8 2017 5:06 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

‘అక్కడ చనిపోయి ఏడుస్తుంటే రాందేవ్‌తో యోగా’

‘అక్కడ చనిపోయి ఏడుస్తుంటే రాందేవ్‌తో యోగా’

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో రైతులంతా ఏడుస్తుంటే ఆయన ఏం చక్కా యోగాగురువు రాందేవ్‌ బాబాతో కలిసి యోగాలో పాల్గొనడం ధుమారం రేపుతోంది. ఓపక్క మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయి పెద్ద వివాదం అవుతుండగా ఆ విషయం ఏమీ పట్టనట్లు ఉన్న ఆయన బిహార్‌లోని మోతిహారీలో ఓ ప్రాంతంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాందేవ్‌తో  కలిసి పాలుపంచుకున్నారు.

ఇప్పుడా విషయం విమర్శలకు తావిస్తోంది. మూడు రోజుల కార్యక్రమంగా రాందేవ్‌ ఇక్కడ యోగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల మృతి విషయంలో బీజేపీ కాంగ్రెస్‌ మధ్య తీవ్ర విమర్శలు పేలుతున్న విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లోనే రైతులు చనిపోయారని కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండగా రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్‌ మాత్రం పోలీసులకు రైతుల మరణానికి సంబంధం లేదంటూ సమస్య తీవ్రతను దాటవేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement