
వేణుగోపాలాచారి
హైదరాబాద్: తెలంగాణలో వెటర్నరీ, హార్టీకల్చర్ యూనివర్శిటీ కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు ప్రతిపాదనలు ఇచ్చామని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్షాల రాక ఆలస్యమైందని, రైతులు అధైర్యపడవద్దని భరోసాయిచ్చారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు.
ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉండవచ్చని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు.