
కేంద్రమంత్రితో మాట్లాడిన పోచారం
హైదరాబాద్‌సిటీ: మిర్చి కొనుగోలుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ తో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. మిర్చి ధర తగ్గడం, రైతుల ఆందోళనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అనుమతితో త్వరలోనే నాఫేడ్ లేదా ఇతర సంస్థల ద్వారా మిర్చీని కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందకుండా కొన్ని రోజులు ఓపిక పడితే మిర్చీకి మంచి ధర లభిస్తుందని తెలిపారు.