సోనియాపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు | Radha Mohan Singh a counter attack on Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సోనియాపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

Published Tue, May 31 2016 7:25 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియాపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు - Sakshi

సోనియాపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సవాల్ కేంద్ర ప్రభుత్వానికి విసిరిన సవాల్ పై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహారాణులకు చోటులేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై సోనియా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో టీవీ లో చూశాను. రాయ్ బరేలిలో ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తన అల్లుడు రాబర్ట్ వాద్రా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరారు. పెద్ద కుటుంబానికి కోడలు అయినంత మాత్రాన ఆమె మహారాణిలా ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతి పేదవారి ఇంటింటికీ తిరుగుతూ రాహుల్ నాటకాలు ఆడుతున్నారంటూ కామెంట్ చేశారు. మీరు టార్గెట్ చేయడానికి.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అని, ఆయన చక్రవర్తి కాదు అని సోనియాను ఉద్దేశించి కేంద్ర మంత్రి రాధా మోహన్ వ్యాఖ్యానించారు. ఆయుధాల వ్యాపారి నుంచి బినామీ పేరుతో సెంట్రల్ లండన్ లో వాద్రా ఇల్లు కొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ దర్యాప్తు జరపనుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సోనియా తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement