'ప్రధాని అనే విషయాన్ని మోడీ మర్చిపోతున్నారు' | Congress hits back at Narendra Modi for land deal accusation | Sakshi
Sakshi News home page

'ప్రధాని అనే విషయాన్ని మోడీ మర్చిపోతున్నారు'

Published Mon, Oct 6 2014 6:38 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'ప్రధాని అనే విషయాన్ని మోడీ మర్చిపోతున్నారు' - Sakshi

'ప్రధాని అనే విషయాన్ని మోడీ మర్చిపోతున్నారు'

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కేటాయించిన భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా జవాబిచ్చింది. సోమవారం హర్యానాలోని ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. డీఎల్ఎఫ్, వాద్రా మధ్య జరిగిన వివాదస్పద భూకేటాయింపులకు హర్యానా ప్రభుత్వం అనుమతివ్వడంపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని మోడీ అన్నారు. 
 
 మోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సాల్మన్ ఖుర్షీద్ ధీటుగా స్పందించారు. మోడీ ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మద్దతుదారులకు ఆయన ప్రసంగం ఉత్తేజం కలిగించేలానే ఉంది. అయితే జాగ్రత్తగా ప్రధాని మాట్లాడాలి అని ఖుర్షీద్ అన్నారు. వాద్రా, డీఎల్ఎఫ్ ల మధ్య జరిగిన 58 కోట్ల భూకేటాయింపులు 2012 అక్టోబర్ లో రద్దు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement