land deal
-
ఈ ఏడాది హైదరాబాద్‌లో అతి పెద్ద ల్యాండ్ డీల్ రూ.800 కోట్లు.. ఎక్కడంటే?
కరోనా సంక్షోభం చుట్టుముట్టినా హైదరాబాద్ నగరంలో రియల్ జోరు తగ్గడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకైక మెట్రో పాలిటన్ సిటీ కావడంతో ఎక్కువ మంది ఇక్కడ ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీనికి తోడు ఐటీ, ఫార్మా, ఏవియేషన్ రంగాల్లో నగరం దూసుకుపోతోంది. ఫలితంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఉప్పల్ భగాయత్ ఈ ఏడాది నగర వ్యాప్తంగా భూముల అమ్మకాలు జోరుగా సాగాయి. ఏడాది చివర్లో ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటికి మంచి స్పందన వచ్చింది. ఇక్కడ గజం భూమి ధర గరిష్టంగా రూ. 1.10 లక్షలు పలకగా కనిష్టంగా గజం ధర రూ. 53 వేలుగా ఉంది. రెండేళ్ల కిందట ఇక్కడ నిర్వహించిన వేలంలో కనిష్ట గరిష్టాలు వరుసగా రూ 30 వేల నుంచి రూ 79 వేల వరకు నమోదు అయ్యాయి. రూ. 800 కోట్లు అయితే ఈసారి లాండ్ పార్సిల్ కింద నార్సింగిలో జరిగిన ఓ ల్యాండ్ రికార్డు సృష్టించింది. ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న 25 ఎకరాల భూమిని ఏక మొత్తంగా రూ. 800 కోట్లకు రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ డీల్ ఫిబ్రవరిలో జరిగింది. 53 ఎకరాలు నార్సింగి ల్యాండ్డీల్ తర్వాత స్థానంలో శంషాబాద్‌లో జరిగిన డీల్ నిలిచింది. 53 ఎకరాల స్థలాన్ని రూ. 250 కోట్లకి ఐఆర్ఏ రియాల్టీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్‌లో చోటు చేసుకుంది. చదవండి: ఇళ్ల కొనుగోళ్లలో అదే జోరు! -
అటు పోర్నోగ్రఫీ కేసు : ఇటు వార్తల్లోకి శిల్పాశెట్టి తల్లి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపార వేత్త రాజ్‌కుంద్రా దంపతుల పోర్నోగ్రఫీ కేసు వివాదం కొనసాగుతుండగానే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. శిల్పాశెట్టి తల్లి సునంద శెట్టి వార్తల్లో నిలిచారు. ఒక భూమి కొనుగోలు విషయంలో రూ .1.6 కోట్ల మేర మోసపోయానంటూ చీటింగ్ కేసు నమోదు చేశారు. ముంబై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు సుధాకర్ ఘారే నకిలీ పేపర్లతో ఒక ల్యాండ్‌ను విక్రయించారని సునందా ఆరోపించారు. తప్పుడు పత్రాలతో మోసం చేశాడని, రూ .1.6 కోట్లకు భూమిని విక్రయించాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. రాజ్ కుంద్రా బెయిల్ మరోసారి తిరస్కరణ బెయిల్ విషయంలో కుంద్రాకు మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. తన అరెస్ట్‌ను, పోలీసు కస్టడీని వ్యతిరేకిస్తూ కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అనంతరం విచారణను శనివారానికి వాయిదా వేసింది. కాగా అశ్లీల చిత్రాలను తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై జూలై 19న పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో కుంద్రాను కీలక కుట్రదారుడిగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. అశ్లీల చిత్రాలను హాట్ షాట్స్ యాప్ ద్వారా రిలీజ్ చేసి, కోట్ల రూపాయలు దండుకున్నా డనేది కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసులో శిల్పా శెట్టికి క్లీన్చిట్ లభించే అవకాశాలు కూడా కనిపించడంలేదు. మరోవైపు ఈ కేసులో కుంద్రా కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు అప్రూవర్లుగా మారడంతో మరింత ఉచ్చు బిగుస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధం ఉన్న వ్యక్తుల ఖాతాల్లోని లావాదేవీలపై దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్యలో ‘భూ’కంపం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం కోసం జరిగిన ఒక భూమి కొనుగోలు వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 12వేల చదరపు మీటర్ల భూమి కొనుగోలులో భారీ అవినీతి దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ భూమిని కేవలం రూ.2కోట్లకు కొన్న వ్యక్తి నుంచి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అదేరోజున కొద్ది నిమిషాల తేడాతో ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని, అయోధ్య రామాలయ ట్రస్ట్ స్కామ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ అవినీతి లావాదేవీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘శ్రమజీవుల విరాళాల సొమ్మును ఇలా దుర్వినియోగం చేయడం వారి నమ్మకాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. అక్రమ నగదు బదిలీ వ్యవహారమని, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో దర్యాప్తు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా∙డిమాండ్ చేశారు. రామాలయం నిర్మాణాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వ్యాపారంగా మలచుకున్నాయని ఒకప్పటి బీజేపీ భాగస్వామి అయిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓ ప్రకాశ్ రాజ్‌భర్ ఆరోపించారు. అసలు వివాదం ఏంటి? వివాదానికి కేంద్రబిందువైన ఆ భూమి కొనుగోలు పత్రాల ప్రకారం.. మార్చి 18న బాగ్ జైసీ గ్రామంలో కుసుమ్ ఫాటక్ అనే వ్యక్తి తన 12,080 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న భూమిని రవి తివారీ, సుల్తాన్ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులను రూ.2 కోట్ల మొత్తానికి విక్రయించాడు. రవి, అన్సారీలు కొన్న అదే 18 వ తేదీన కేవలం కొద్ది నిమిషాల తర్వాత వీరిద్దరి నుంచి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏకంగా రూ.18.5 కోట్లు చెల్లించి ఆ భూమిని కొనుగోలు చేసింది. ట్రస్టు సభ్యులైన బీజేపీ నేత అనిల్ మిశ్రా, అయోధ్య మాజీ మేయర్ హ్రిషీకేశ్ ఉపాధ్యాయ్లు ట్రస్టు తరఫున సంతకాలు చేసి ఈ భూమిని కొన్నారు. ఈ వ్యవహారంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ముఖ్యపాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. వేరొకరి నుంచి రూ.2 కోట్లకు కొన్న భూమిని అదే రోజున కొద్ది నిమిషాల్లో రూ.16.5 కోట్లు ఎక్కువ చెల్లించి కొనాల్సిన అవసరమేముందని, ట్రస్టు సొమ్మును దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
రాహుల్ ఇలాంటివి ఆమోదిస్తారా..?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల నాయకులు వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మాజీ మంత్రి కపిల్ సిబల్‌ను టార్గెట్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డ వ్యక్తితో సంబంధాలు కలిగి ఉన్నారంటూ స్మృతి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇలాంటి వాటిని ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. స్మృతి ఇరానీ ఆరోపణలకు స్పందించిన కపిల్ సిబల్ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ మెహుల్ చౌక్సీతో ప్రధానికి ఉన్న సంబంధాల గురించి స్మృతి స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ‘సమాచార శాఖ మంత్రి ప్రెస్మీట్లు పెడతారు గానీ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలతో ప్రధానికున్న సంబంధాల గురించి అడగరు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం’ అంటూ ఎద్దేవా చేశారు. ముందు సీబీఎస్ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి దృష్టిసారించాలంటూ కపిల్ హితవు పలికారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ, మీడియాలో వచ్చిన నివేదికలను ఉటంకిస్తూ స్మృతి పలు ఆరోపణలు చేశారు. ‘మనీల్యాండరింగ్‌కు పాల్పడిన వ్యక్తి నుంచి రూ. 45.21 కోట్ల విలువైన భూమిని కపిల్ సిబల్ కేవలం లక్ష రూపాయలకే కొన్నారు. సిబల్, ఆయన భార్య గ్రాండ్ కాసిలా కంపెనీ యజమానులుగా ఉన్నారు. ఈ కంపెనీ కోసం వారు వడ్డీ లేని రుణాలు పొందా’రని అన్నారు. కంపెనీ పేరు మీద ఒకసారి భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత విలువ ఒక్కసారిగా రూ. 89 కోట్లకు చేరింది. ఈవిధంగా విలువ రెండింతలవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. 2013లో యూపీఏ ప్రభుత్వం పీయూష్ గోయల్ అనే వ్యాపారిపై అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది. గోయల్ నుంచే కపిల్ సిబల్ ఈ కంపెనీని కొనుగోలు చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు. -
'ప్రధాని అనే విషయాన్ని మోడీ మర్చిపోతున్నారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కేటాయించిన భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా జవాబిచ్చింది. సోమవారం హర్యానాలోని ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. డీఎల్ఎఫ్, వాద్రా మధ్య జరిగిన వివాదస్పద భూకేటాయింపులకు హర్యానా ప్రభుత్వం అనుమతివ్వడంపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని మోడీ అన్నారు. మోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సాల్మన్ ఖుర్షీద్ ధీటుగా స్పందించారు. మోడీ ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మద్దతుదారులకు ఆయన ప్రసంగం ఉత్తేజం కలిగించేలానే ఉంది. అయితే జాగ్రత్తగా ప్రధాని మాట్లాడాలి అని ఖుర్షీద్ అన్నారు. వాద్రా, డీఎల్ఎఫ్ ల మధ్య జరిగిన 58 కోట్ల భూకేటాయింపులు 2012 అక్టోబర్ లో రద్దు చేశారు. -
రూ. 7 కోట్లకు మోసపోయిన రాంజెఠ్మలానీ
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ చెన్నైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ మధ్యవర్తి చేతిలో రూ. 7 కోట్లకు మోసపోయారు. ఈ మధ్యవర్తి నుంగంబాక్కంకు చెందినవాడని పోలీసులు తెలిపారు. రాంజెఠ్మలాని, మరో ఇద్దరు స్నేహితులు చెన్నై ప్రధాన ప్రాంతాల్లోని భూములు అమ్మకానికి ఉంటే తెలపాలని ఓ మధ్యవర్తిని ఆన్లైన్లో సంప్రదించారు. అతను వారిని నమ్మించి నగరం మధ్యలో మంచి స్థలం అమ్మకానికి ఉందని పేర్కొన్నాడు. స్థలంయజమాని తన మాటలు విశ్వసించడం లేదని, అతనికి నమ్మకం కలిగించాలంటే ముందుగా రూ. 7 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలన్నాడు. దీంతో వారు దళారీని నమ్మి డబ్బు చెల్లించగా అతను పత్తా లేకుండా పోయాడు.