సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ చెన్నైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ మధ్యవర్తి చేతిలో రూ. 7 కోట్లకు మోసపోయారు. ఈ మధ్యవర్తి నుంగంబాక్కంకు చెందినవాడని పోలీసులు తెలిపారు. రాంజెఠ్మలాని, మరో ఇద్దరు స్నేహితులు చెన్నై ప్రధాన ప్రాంతాల్లోని భూములు అమ్మకానికి ఉంటే తెలపాలని ఓ మధ్యవర్తిని ఆన్‌లైన్‌లో సంప్రదించారు.
అతను వారిని నమ్మించి నగరం మధ్యలో మంచి స్థలం అమ్మకానికి ఉందని పేర్కొన్నాడు. స్థలంయజమాని తన మాటలు విశ్వసించడం లేదని, అతనికి నమ్మకం కలిగించాలంటే ముందుగా రూ. 7 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలన్నాడు. దీంతో వారు దళారీని నమ్మి డబ్బు చెల్లించగా అతను పత్తా లేకుండా పోయాడు.