
కరోనా కాలంలో మానవత్వానికి మారుపేరుగా నిలిచారు బాలీవుడ్ హీరో సోనూసూద్(Sonu Sood). అది మొదలు ఆయన ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆ అంశం వైరల్‌గా మారుతోంది. సోనూసూద్ తరచూ చిరు వ్యాపారులకు సాయం అందిస్తుంటారు. తాజాగా సోనూసూద్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్‌గా మారింది. దానిలో సోనూసూద్ చెఫ్ అవతారంలో కనిపిస్తున్నారు.
సోను సూద్ ఇలీవల తమిళనాడులోని చెన్నైలో రోడ్డుపక్కనున్న ఒక టిఫిన్ సెంటర్‌కు వెళ్లారు. అతని బృందం కూడా అతని వెంట ఉంది. ఇంతలో సోనూసూద్ దోశె వేసేందుకు ప్రయత్నించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, ‘ఇది నా ఇడ్లీ సాంబార్ దుకాణం’ అని రాశారు.
వీడియో క్లిప్ మొదట్లో సోనూసూద్ ఆ ఫుడ్ స్టాల్(Food stall) యజమాని శాంతిని పరిచయం చేసుకున్నారు. తరువాత అక్కడ సిద్ధమైన వంటకాలన్నీ కనిపిస్తాయి. తరువాత కెమెరా కిచెన్ కౌంటర్ వైపు కదులుతుంది. అక్కడ కొబ్బరి పచ్చడి, సాంబారు, ఇడ్లీలతో కూడిన పాత్రలు ఉంటాయి. ఇడ్లీ, వడ ప్లేటు పట్టుకున్న సోనూసూద్.. మూడు ఇడ్లీలు, రెండు వడల ధర కేవలం రూ. 35 అని చెబుతారు. దీనిపై మీకు నమ్మకం లేదా?’ అని ప్రశ్నిస్తారు. అయితే టిఫిన్ సెంటర్ యజమాని శాంతి ఆయనకు ఆ టిఫిన్ రూ. 30కే ఇస్తుంది. తరువాత సోనూసూద్ చెఫ్ అవతారమెత్తి దోశ వేసేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు శాంతి ప్లెయిన్ దోశ రూ. 15 అని చెబుతుంది. వెంటనే సోనూ సూద్ దోశ ధర రెండింతలు చేస్తూ రూ. 30 అయ్యిందని చెబుతారు. తరువాత ఆయన తన బృందంలోని సభ్యులందరికీ దోశలను వడ్డిస్తారు.
గతంలో కూమారి ఆంటీని కలిసి..
గత ఏడాది సోసూసూద్ హైదరాబాద్‌లో ఫుడ్‌స్టాల్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ(Aunty Kumari)ని కలుసుకున్నారు. అప్పుడు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. కుమారి ఆంటీని పలుకరిస్తూ కనిపించారు. ‘నేను కుమారి ఆంటీ పక్కన ఉన్నాను. ఆమె గురించి చాలా విన్నాను. ఆమె స్వయంకృషితో ఎదిగిన మహిళ’ అని ఆమెను మెచ్చుకున్నారు. మహిళా సాధికారతకు కుమారి ఆంటీ ఉత్తమ ఉదాహరణ అని సోనూసూద్ అన్నారు. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్‌లో సోనూసూద్ వెజిటేరియన్ మీల్స్ తిన్నారు.

ఇది కూడా చదవండి: Sarojini Naidu: మహాత్మునితో ‘మిక్కీ మౌస్’ అని పిలిపించుకుని..
Comments
Please login to add a commentAdd a comment