వరదల నష్టం అంచనాకు కేంద్ర బృందాలు | central committee will review ap floods situation | Sakshi
Sakshi News home page

వరదల నష్టం అంచనాకు కేంద్ర బృందాలు

Published Mon, Dec 7 2015 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

central committee will review ap floods situation

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్లో వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు బృందాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.

మంగళవారం వారు హైదరాబాద్ చేరుకొని రెండు బృందాలుగా మారి నెల్లూరు, కడప, చిత్తూరు ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు (8వ తేది నుంచి 11వరకు) పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తారని చెప్పారు. పంట నష్టంతోపాటు ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేసి 11న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విజయవాడలో కలుస్తారని ఆయన తెలిపారు. గత నెలలో వరదలు వచ్చి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో నష్టం కలిగించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement