ఇప్పుడొచ్చారు
Published Tue, Dec 10 2013 3:36 AM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM
సాక్షి, ఏలూరు:తుపానుల ప్రభావంతో కురి సిన భారీ వర్షాలకు నీటమునిగి దెబ్బతిన్న వరిచేలను కోసినా ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో కొందరు రైతులు తగులబెట్టేశారు. మరికొందరు పంటను పశువుల కోసం వదిలేశారు. ఇంకొందరు ట్రాక్టర్లతో దున్నేసి చేలను దాళ్వాకు సిద్ధం చేసుకుంటున్నారు. గాలి వానకు విరిగిన అరటి చెట్లను తొల గించారు. రాలిన కూరగాయలు, తోటలు కుళ్లి మట్టిలో కలిసిపోయూరుు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ జాడలు సైతం చెరిగిపోయూయి. ఈ పరిస్థితుల్లో పంట నష్టాలను అంచనా వేసేందుకు సోమవారం తాపీగా జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ‘వచ్చాం.. చూశాం’ అన్నట్లుగా వ్యవహరించారు. నష్టాలను అంచనా వేశామనిపించుకునేందుకు శాంపిల్‌గా ధాన్యం గింజల్ని మూటగట్టుకుని వెళ్లిపోయూరు. కేంద్ర బృందం తీరుకు అవాక్కైన అన్నదాతలు ‘ప్రకృతి ఎప్పుడో గాయం చేసింది..ప్రభుత్వం ఇప్పుడు తాపీగా పరామర్శకు వచ్చింది.. ఏం లాభం. మా బాధలు మాకు తప్పవు’ అంటూ నిట్టూర్చారు. జిల్లాలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటల్ని సాగుచేస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో పై-లీన్ తుపాను, ఆ వెంటనే అల్పపీడనం, నవంబర్‌లో హెలెన్ తుపాను విరుచుకుపడి పంటలను ముంచేశారుు.
వాటి దెబ్బకు జిల్లాలో 4,81,472 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు నాశనమయ్యూయని అంచనా. నష్టాల ఊబిలో కూరుకుపోరుున తమను ఆదుకోవాలంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఏ అధికారైనా కనీసం పరామర్శకు వస్తారేమోనని, పంట నష్టాన్ని గుర్తిస్తారేమోనని ఎదురుచూశారు. ఎవరూ వారి గోడును ఆలకించలేదు. తమ బతుకులు ఇంతేననుకుంటూ అన్నదాతలు మళ్లీ అప్పులు చేసి దాళ్వా పం టకు సిద్ధమవుతున్నారు. దెబ్బతిన్న చేలతో కలిపి దాదాపు 5,30,000 ఎకరాల్లో మాసూళ్లు పూర్తయ్యూరుు. ఇక మిగిలింది కేవలం 70 వేల ఎకరాల్లో మాత్రమే. అంటే తుపాన్లు, వర్షాలకు దెబ్బతిన్న పంటలు ఎక్కడో గానీ కనిపించవు. ఉభయగోదావరి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించలేదన్న విమర్శలు వెల్లువెత్తడంతో వచ్చామనిపించేందుకు నష్టం వాటిల్లిన రెండు నెలలకు కేంద్ర ప్రభుత్వం నష్టాల అంచనా బృందాన్ని జిల్లాకు పంపించింది. వచ్చిన వారు మొక్కుబడిగా పర్యటించి మమ అనిపించేశారు.
ఇలా వచ్చి.. వెళ్లారు : ఎఫ్‌సీఐ కంట్రోల్ అసిస్టెంట్ రీజినల్ డెరైక్టర్ కె.సత్యప్రసాద్ నేతృత్వంలోని కేంద్ర కమిటీ సోమవారం ఉదయం ఏలూరులోని కలెక్టరేట్‌లో పంట నష్టాల ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. అక్కడి నుంచి బయలుదేరి నారాయణపురంలో పంట చేలను పరిశీలించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 90 శాతం మాసూళ్లు పూర్తయ్యూయి. అక్కడి నుంచి బయలుదేరి కారు అద్దాల్లోంచి పొలాలను చూస్తూ ధాన్యం, కుళ్లిన వరి దుబ్బులను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తామని బృందం సభ్యులు తెలిపారు. పంట నష్టాలపై ఈ నెల 15నాటికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పుకుంటూ ముందుకు వెళ్లిపోయూరు.
Advertisement
Advertisement