సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం), ఎల్లుండి(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. అల్లూరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు.
కాగా, ఈ సందర్భంగా వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. రేపు(సోమవారం) అల్లూరి జిల్లా కూనవరం, వీఆర్‌పురం వదర బాధితులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం.. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శనకు వెళ్లనున్నారు. అలాగే, రాత్రికి రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. ఎల్లుండి(మంగళవారం) కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తానేలంక, రామాలయంపేటలో వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అలాగే, అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు సందర్శనకు వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: ‘పోలీసులపై జరిగిన దాడి పవన్‌కు కనిపించడం లేదా?’
Comments
Please login to add a commentAdd a comment