లేపాక్షి వాసి బెంగళూరులో మృతి | lepakshi man dies in bangalore | Sakshi
Sakshi News home page

లేపాక్షి వాసి బెంగళూరులో మృతి

Published Thu, May 11 2017 10:40 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

lepakshi man dies in bangalore

లేపాక్షి : మండలంలోని సి.వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకటరమణాచారి (75) అనే వ్యక్తి గురువారం ఉదయం బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమారుడు అరవిందాచారి తెలిపిన మేరకు..  ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బుధవారం ఉదయం అతడిని కుమారుడు బెంగళూరు నిమాన్స్‌ ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడిని గురువారం డిశార్జి చేశారు. ఆస్పత్రి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండుకు నడిచి వస్తుండగా వాహనం ఢీకొని వెంకటరమణాచారి అక్కడిక్కడే మృతి చెందాడు. తాను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు  కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అతడికి భార్య, ఆరుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement