in bangalore
-
లేపాక్షి వాసి బెంగళూరులో మృతి
లేపాక్షి : మండలంలోని సి.వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకటరమణాచారి (75) అనే వ్యక్తి గురువారం ఉదయం బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమారుడు అరవిందాచారి తెలిపిన మేరకు.. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బుధవారం ఉదయం అతడిని కుమారుడు బెంగళూరు నిమాన్స్ ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడిని గురువారం డిశార్జి చేశారు. ఆస్పత్రి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండుకు నడిచి వస్తుండగా వాహనం ఢీకొని వెంకటరమణాచారి అక్కడిక్కడే మృతి చెందాడు. తాను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అతడికి భార్య, ఆరుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
పరేషన్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల మంది ఎన్నిక ల గుర్తింపు కార్డులు లేదా ఆధార్ నంబర్లు సమర్పించనందున, ఆహార ధాన్యాల పంపిణీని నిలి పివేసినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మం త్రి దినేశ్ గుండూరావు తెలిపారు. శుక్రవారం ఆ యనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ గత మూడున్నర నెలల కిందట ఎనిమిది లక్షల మంది ఆధార్ నంబరు లేదా ఎన్నికల గుర్తింపు కార్డును సమర్పించలేదని వెల్లడించారు. వారికి కిరోసిన్ పంపిణీని నిలిపివేశామని చెప్పారు. దీంతో ఐదు లక్షల మంది వాటిని సమర్పించామన్నారు. మిగిలిన వారి రేషన్ కార్డులను సస్పెన్షన్‌లో ఉంచి, ఆహార ధాన్యాల పంపిణీని నిలిపి వేశామన్నారు. కాగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. నెల లోగా కొత్త నియమావళిని రూపొందించి, అనంతరం కొత్త కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తామని తెలిపారు. -
అప్రమత్తం
దసరా నేపథ్యంలో ఎబోలాపై ముందస్తు చర్యలు మైసూరు ఉత్సవాలపై ప్రత్యేక నిఘా ఆకతాయిలపై క్రిమినల్ కేసులు : మంత్రి సాక్షి, బెంగళూరు : ‘ఎబోలా’ పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి ఈ వ్యాధి ప్రవేశించకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు వీలుగా బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో 15 పడకల ప్రత్యేక వార్డును కూడా సిద్ధం చేసింది. ఎబోలా ప్రభావిత ఆఫ్రికా దేశాల్లో చాలా మంది కర్ణాటక వాసులు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉంటున్నారు. వీరంతా దసరాకు 20 రోజుల ముందే సొంత ప్రాంతాలకు వస్తుంటారు. వీరి ద్వారా ఎబోలా ఇక్కడా వ్యాపించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మైసూరు ఉత్సవాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరంతా మైసూరుతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మైసూరు, ఆ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక స్థలాల్లోనూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విశేష చర్యలు చేపట్టింది. అత్యవసర చికిత్స కోసం వచ్చే విదేశీయుల వివరాలను ఎప్పటికప్పుడు వైద్య శాఖకు తెలియజేయాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మైసూరు, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లలతో ప్రత్యేక పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎబోలా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత రోగికి చికిత్సలు అందించేందుకు వీలుగా మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆఫ్రికా విద్యార్థులపై ఆంక్షలు మైసూరు, బెంగళూరులో విద్యాభ్యాసం చేస్తున్న లియోనా, లైబీరియా, కిన్యా, నైజీరియా, సూడాన్ దేశాలకు చెందిన విద్యార్థులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వ్యాధి తీవ్రత పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ వీరిని ఆయా దేశాలకు వెళ్లకుండా ఆపాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులు సొంత ప్రాంతాలకు వెళ్లడం, ఇప్పటికే సెలవుపై అక్కడకు వెళ్లిన వారు తిరిగి వచ్చే విషయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో ఎబోలా ఉందని ఎస్ఎంఎస్, ఫేస్‌బుక్‌ల ద్వారా రూమర్లు ృష్టిస్తున్న ఆకతాయిలపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ హెచ్చరించారు. వ్యాధి లక్షణాలు వాంతులు, విరేచనాలు, జ్వరం, కీళ్లనొప్పులు, రక్తస్రావం కావడం ఎబోలా వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాపించదు. వ్యాధిగ్రస్త వ్యక్తి స్రావాలు (లాలాజలం, వీర్యం, రక్తం తదితరాలు) నేరుగా ఆరోగ్యవంతుని శరీరంలోకి వెళ్లినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిపై మరిన్ని వివరాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 080-22873151, 080-26631923లో సంప్రదించవచ్చు. -
ప్రలోభాలు
అభ్యర్థుల గెలుపు కోసం ఇరు పార్టీల అడ్డదారి మూడు స్థానాల్లోనూ 40 శాతం పెరిగిన మద్యం విక్రయాలు క్రీడా సామగ్రి, చీరలు, ముక్కు పుడకల ఎర గెలుపుపై కమలనాథుల ధీమా గెలిచి తీరాలంటున్న కాంగ్రెస్ సాక్షి, బెంగళూరు : ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేచింది. గెలుపుపై కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తుండగా ఎలాగైనా గెలిచి తీరాలంటూ కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఓటరు మహాశయులను మచ్చిక చేసుకునేందుకు ఇరు పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం పోటీపడ్డారు. శికారిపుర, చిక్కొడి-సదలగ, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాల్లో బహిరంగ ప్రచారానికి మంగళవారం ఐదు గంటలకు తెరపడింది. ఈ నెల 21న పోలింగ్ ప్రక్రియ ఉండడంతో అంతకు ముందే అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు వారికి క్రీడా సామగ్రిని అందించారు. మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు చీరలు ముక్కు పుడకలను పంచారు. ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజకవర్గాలోనూ ఈ వారం రోజుల్లో మద్యం అమ్మకాలు సాధారణం కంటే 40 శాతం పెరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. -
బీజేపీ అభ్యర్థుల ఖరారు
ఉప ఎన్నికల పోరు.. ‘బళ్లారి గ్రామీణం’నుంచి ఓబులేసు, శికారిపుర నుంచి బీవై రాఘవేంద్ర, చిక్కోడి-సదలగ నుంచి మహంతేశ బరిలోకి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు వచ్చే నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఎంపిక చేసింది. మంగళవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నిర్వహించిన సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బళ్లారి గ్రామీణ స్థానం నుంచి ఓబులేసు, శికారిపుర నుంచి బీవై రాఘవేంద్ర, చిక్కోడి-సదలగ స్థానంలో మహంతేశ కవటగిమఠలు పోటీ చేయనున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో ఈ స్థానాల నుంచి గెలుపొందిన అభ్యర్థులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బళ్లారి గ్రామీణ స్థానం నుంచి గతంలో బీ. శ్రీరాములు, శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, బెల్గాం జిల్లా చిక్కోడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాశ్ హుక్కేరి ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా బళ్లారి అభ్యర్థి ఓబలేసు పార్టీ ఎస్సీ మోర్చాలో పని చేస్తున్నారని జోషి తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో శ్రీరాములు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యడ్యూరప్ప కేజేపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వారు బీజేపీ తీర్థాన్ని పుచ్చుకుని, ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. -
పరిషత్‌లో నామఫలకం రగడ
సాక్షి, బెంగళూరు : పరిషత్‌లో సోమవారం ‘నామఫలకం’ రగడ తీవ్ర గందరగోళానికి దారితీసింది. బెల్గాం జిల్లా యళ్లూరులో మరాఠీలో రాసిన ఓ నామఫలకాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తొలగించారు. అప్పటి నుంచి స్థానికులు, మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంపై సోమవారం పరిషత్ నామఫలకం రగడ రగులుకుంది. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను నడపడం వీలుకాకపోవడంతో సభాపతి శంకరమూర్తి మూడు గంటలపాటు సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన వెంటనే విపక్షనేత కే.ఎస్ ఈశ్వరప్ప యళ్లూరు ఘటనలో ప్రభుత్వ చర్యలు ఏమిటని నిలదీశారు. ఈ విషయలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో తరుచూ శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఫ్లోర్‌లీడర్ బసవరాజ్‌హొరట్టి మాట్లాడుతూ...బెల్గాం జిల్లాల్లో కన్నడిగులకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ విషయంపై చర్చిద్దామని శంకరమూర్తి విపక్షాలకు సర్దిచెప్పడానికి యత్నించినా వారు వినిపించుకోలేదు. పరిషత్ నాయకుడు ఎస్.ఆర్ పాటిల్ జోక్యం చేసుకుని బెల్గాం జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, రాద్ధాంతం చే యొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. విపక్షాల తీరు వల్ల సభా కార్యక్రమాలకు తరుచూ ఆటంకం కలుగుతోందని అనటంతో సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో ఎవరూ ఏమీ మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సభాపతి సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తరువాత కూడా బీజేపీ నాయకులు వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ చర్చకు పట్టుబట్టారు. విపక్షాల నిరసనల మధ్యనే ముసాయిదా బిల్లులకు మండలి ఆమోదం లభించింది. -
12 చోట్ల నేడు రీపోలింగ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో 12 బూత్‌లలో మంగళవారం రీపోలింగ్‌ను చేపట్టనున్నారు. ఈ నెల 17న పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించడం, ఒక చోట పోలింగ్ సిబ్బంది తప్పిదాల వల్ల రీపోలింగ్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా సోమవారం తెలిపారు. మొత్తం తొమ్మిది లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు రీపోలింగ్‌ను నిర్వహించనున్నారు. హావేరి నియోజక వర్గంలోని రాణిబెన్నూరు, బాలగలకోటెలోని జమఖండి, బాగలకోటె, బిజాపురలోని సిందగి, గుల్బర్గలోని సేడం, రాయచూరులోని షాపూర్, యాదగిరి, బీదర్‌లో రెండు, శివమొగ్గలోని బైందూరు, హాసనలోని అరసికెరె, తుమకూరు నియోజక వర్గంలోని తురువెకెరె బూత్‌లలో రీపోలింగ్ జరుగనుంది. కాగా రాష్ట్రంలో ఒకే దశలో ఈ నెల 17న ముగిసిన ఎన్నిక్లలో 67.3 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే. -
అమ్మాయిలకో అకాడమీ....
దేశంలోనే ఏకైక క్రికెట్ శిక్షణ కేంద్రం అత్యున్నత స్థాయి సౌకర్యాలు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల శిక్షణ కోసం బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పని చేస్తోంది. ప్రధాన టోర్నీలకు ముందు ప్రత్యేక క్యాంప్, ఆటగాళ్లు గాయపడితే పునరావాస కార్యక్రమాలకు ఎన్సీఏ వేదికగా ఉంటోంది. అయితే ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న మహిళా క్రికెట్‌కు కూడా అలాంటి ఒక అకాడమీ ఎందుకు ఉండకూడదు? ఆలోచన వచ్చిందే తడవుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) దీనిని ఆచరణలో పెట్టింది. ఫలితంగా దాదాపు మూడున్నరేళ్ల క్రితం గుంటూరులో జాతీయ మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా మహిళల కోసం బీసీసీఐ తరఫున నిర్వహించబడుతున్న ఏకైక అకాడమీ ఇదే కావడం విశేషం. గుంటూరులోని ఉమెన్ క్రికెట్ అకాడమీ పనితీరు, సాధిస్తున్న ఫలితాలు బీసీసీఐ గుర్తించింది. పురుషుల కోసం ఉన్న బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ స్థాయిలో మహిళా క్రికెటర్లకు గుంటూరు ఏసీఏ ఉమెన్ అకాడమీని ప్రధాన కేంద్రంగా చేసింది. దాదాపు అండర్-16, 19 దగ్గర నుంచి సీనియర్ ఉమెన్ క్రికెట్ జట్లకు ఈ అకాడమీలో కోచింగ్ క్యాంప్‌లు నిర్వహించి శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్, బీసీసీఐ ఉమెన్ క్రికెట్ టోర్నీలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏసీఏ ఉమెన్ వింగ్ చైర్మన్ నరేంద్రనాథ్‌చౌదరి సారథ్యంలో ఉమెన్ క్రికెట్ అకాడమీలో విదేశీ మహిళా కోచ్ మారియా ఫాహే (న్యూజిలాండ్), బీసీసీఐ లెవల్-2 కోచ్ ఎస్. శ్రీనివాసరెడ్డి కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు అన్ని ఏజ్ కేటగిరీల్లో ఆంధ్ర ఉమెన్ క్రికెట్ జట్లు ఇక్కడ శిక్షణ పొందుతున్నాయి. సౌత్‌జోన్, జాతీయ స్థాయి కోచింగ్ క్యాంప్‌లు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏసీఏ ఉమెన్ క్రికెట్ అకాడమీ నుంచి స్నేహదీప్తి(విశాఖపట్నం) టీమిండియాకు ఆడగా, సీహెచ్.ఝాన్సీలక్ష్మి (గుంటూరు), మేఘన(కృష్ణా) బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవన్, ఆర్.కల్పన(కృష్ణా) బీసీసీఐ చాలెంజర్స్ ట్రోఫికి ఎంపికైంది. వీరంతా భవిష్యత్తులో టీమిండియాలో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నీ ఇక్కడే... గుంటూరులోని మంగళగిరి జేకేసీ కళాశాల ఆవరణలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. మహిళా అకాడమీలో మొత్తం నాలుగు ప్రాక్టీస్ వికెట్లు ఉన్నాయి. దీంతో పాటు సమీపంలోనే అదనంగా ఆస్ట్రోటర్ఫ్, సిమెంట్ వికెట్ కూడా ఏర్పాటు చేశారు. వీటిపై కదిలే (మూవబుల్) నెట్స్ పెట్టి ప్రాక్టీస్ చేస్తారు. అమ్మాయిల ఫిట్నెస్ కోసం అధునాతన జిమ్ కూడా అందుబాటులో ఉంది. శిక్షణ పొందుతున్న క్రీడాకారిణులకు ఇక్కడ రెసిడెన్షియల్ సౌకర్యం ఉంది. ఇక్కడ మొత్తం 16 గదులు ఉన్నాయి. ఇందులో 12 డబుల్ బెడ్ రూమ్‌లు కాగా, మరో నాలుగు సింగిల్ బెడ్ రూమ్‌లు. మొత్తం 50 మందికి ఇక్కడ వసతి సౌకర్యం ఉంది. ఎంపిక ఇలా... సాధారణంగా ఈ అకాడమీలో ఆంధ్ర సీనియర్ జట్టుకు రెగ్యులర్‌గా శిక్షణా శిబిరం కొనసాగుతుంది. దాంతో పాటు భారత జట్టుకు, సీనియర్ సౌత్‌జోన్ టీమ్‌లకు కూడా ఇక్కడ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. అయితే వీరితో పాటు వర్ధమాన క్రీడాకారిణులను తీర్చిదిద్దేందుకు ఏసీఏ పూర్తి స్థాయి శిక్షణను అందిస్తోంది. ఏసీఏ పరిధిలోని 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించారు. ముందుగా జిల్లా స్థాయిలో, ఆ తర్వాత జోనల్ స్థాయిలో సెలక్షన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రతిభ గలవారిని ఎంపిక చేసి అండర్-16, అండర్-19 జట్లుగా విభజించారు. ఎంపికైన ప్లేయర్లకు పూర్తిగా ఉచిత శిక్షణ లభిస్తుంది. తగిన ఫీజు చెల్లించి ఇతర రాష్ట్రాల క్రీడాకారిణులు కూడా ఇక్కడ శిక్షణ పొందవచ్చు. గుంటూరులో మహిళా అకాడమీ నెలకొల్పిన తర్వాతే ఆంధ్ర జట్టు జోనల్, జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం విశేషం. -
సమరోత్సాహం
నామినేషన్లకు ముందు నుంచే ఊపందుకుంటున్న ప్రచారం దూసుకెళ్తున్న బీజేపీ మీనమేషాలు లెక్కిస్తున్న జేడీఎస్ 19 నుంచి నామినేషన్ల పర్వం జేడీఎస్‌లోకి షరీఫ్? దేవెగౌడతో భేటీ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి ఇంకా తెర లేవక ముందే అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఎటువంటి అట్టహాసం లేకుండా కొందరు నాయకులు, కార్యకర్తలు వెంట రాగా ఓట్లను అభ్యర్థించడం ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీలు ఇదివరకే మూడు, నాలుగు మినహా మిగిలిన నియోజక వర్గాలకు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశాయి. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజక వర్గాలకు ఒకే దశలో వచ్చే నెల 17న పోలింగ్ జరుగనుంది. ఈ నెల 19 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. నామినేషన్ల ఉపసంహరణ 29తో ముగుస్తుంది. అనంతరం కేవలం 17 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంటుంది. అయితే ఇప్పటికే పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారు కావడం, లోక్‌సభ ఎన్నికలు కనుక తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జేడీఎస్ అభ్యర్థులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు చివరి నిమిషంలో మారే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల అభ్యర్థిత్వం వంద శాతం ఖరారయ్యాకే ప్రచారం చేపట్టాలని ఆ పార్టీ తొలి జాబితాలోని అభ్యర్థులు భావిస్తున్నట్లు సమాచారం. కాగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఇప్పటికే మైసూరులో పాదయాత్ర ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ బెంగళూరు ఉత్తర నియోజక వర్గం అభ్యర్థి డీవీ. సదానంద గౌడ బ్యాటరాయనపుర అసెంబ్లీ సెగ్మెంట్లో పలు చోట్ల కార్యకర్తలు, స్థానిక ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆయన వెంట పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు మునిరాజు, మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు ప్రభృతులున్నారు. బెంగళూరు సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఆయనకు ప్రచారంలో చేదోడు వాదోడుగా నిలిచారు. దేవెగౌడను కలసిన షరీఫ్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్ శనివారం నగరంలో జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ. దేవెగౌడను కలుసుకున్నారు. బెంగళూరు సెంట్రల్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఆయనకు భంగపాటు ఎదురైంది. దీంతో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా గౌడను కలుసుకున్నారు. వర్తమాన దేశ రాజకీయాల గురించి తామిద్దరం చర్చించుకున్నామని సమావేశం అనంతరం జాఫర్ షరీఫ్ తెలిపారు. ఒక వేళ ఆయన జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే... కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలి బీజేపీ అభ్యర్థి పీసీ. మోహన్ పని సులభమవుతుందని భావిస్తున్నారు.