సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల మంది ఎన్నిక ల గుర్తింపు కార్డులు లేదా ఆధార్ నంబర్లు సమర్పించనందున, ఆహార ధాన్యాల పంపిణీని నిలి పివేసినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మం త్రి దినేశ్ గుండూరావు తెలిపారు. శుక్రవారం ఆ యనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ గత మూడున్నర నెలల కిందట ఎనిమిది లక్షల మంది ఆధార్ నంబరు లేదా ఎన్నికల గుర్తింపు కార్డును సమర్పించలేదని వెల్లడించారు.
వారికి కిరోసిన్ పంపిణీని నిలిపివేశామని చెప్పారు. దీంతో ఐదు లక్షల మంది వాటిని సమర్పించామన్నారు. మిగిలిన వారి రేషన్ కార్డులను సస్పెన్షన్‌లో ఉంచి, ఆహార ధాన్యాల పంపిణీని నిలిపి వేశామన్నారు. కాగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. నెల లోగా కొత్త నియమావళిని రూపొందించి, అనంతరం కొత్త కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తామని తెలిపారు.
పరేషన్
Published Sat, Oct 11 2014 1:38 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement