నేత్రపర్వం..రథోత్సవం | rathothsavam in lepakshi | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం..రథోత్సవం

Published Sat, Feb 25 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

నేత్రపర్వం..రథోత్సవం

నేత్రపర్వం..రథోత్సవం

మార్మోగిన శివనామస్మరణ
 

లేపాక్షి : లేపాక్షి మహాశివరాత్రి ఉత్సవాల్లో శనివారం రథోత్సవం అశేష భక్తజనసందోహం మధ్య నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆగమీకులు సునీల్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు సూర్యప్రకాష్, నరసింహశర్మ అభిషేకార్చన, రథసంప్రోక్షణ, దవనోత్సవం నిర్వహించారు. అనంతరం శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను వేదబ్రాహ్మణులచే పల్లకీలో మోసుకుని వచ్చి రథంలో కొలువుదీర్చారు.  మధ్యాహ్నం 12.30 గంటలకు బస్టాండ్‌ వద్ద రథాన్ని లాగారు.  1.30 గంటలకు ఎగువపేటలోని నందివిగ్రహం వద్దకు చేరుకుంది.

భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ రంగనాయకులు, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ హనోక్,  గ్రామ సర్పంచ్‌ జయప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు నారాయణస్వామి, ఆదినారాయణ, టైలర్‌ మూర్తి, నారాయణ, టీడీపీ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు చలపతి, చిన్న ఓబన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement