Veerabhadra Swamy
-
ప్రధాని దర్శించుకున్న వీరభద్రస్వామి ఆలయం ఇదే
-
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి
-
ప్రేమికులను కలిపిన సమరం
ఆస్పరి: భక్తుల్లో భక్తి భావం ఉప్పొంగింది.. నుగ్గులు గాల్లోకి ఎగిరాయి. దుమ్ము ఆకాశాన్నంటింది.. పిడకల సమరం హోరాహోరీగా సాగింది. స్వామి అమ్మవార్ల ప్రేమను గెలిపించేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి తలపడిన దృశ్యాలు యుద్ధాన్ని తలపించాయి. కైరుప్పల గ్రామంలో దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయ ఆచారాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన పిడకల సమరాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలిరావడంతో కైరుప్పల కిటకిటలాడింది. ఆచారం ప్రకారం మండలంలోని కారుమంచి గ్రామానికి చెందిన పెద్ద రెడ్డి వంశస్తుడు నరసింహారెడ్డి మంది మార్భలం, తప్పెట్లు, మేళతాళాలతో గుర్రంపై కైరుప్పలకు చేరుకుని వీరభద్రస్వామిని దర్శించుకుని వెనుతిరిగిన వెంటనే పిడకల సమరం మొదలైంది. గ్రామంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. గాల్లోకి పిడకలు లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే అందరిలోనూ ఉత్సాహం ఉరకలు వేసింది. తమ వర్గం గెలవాలనే తపనతో మహిళలు పురుషులకు పిడకలు అందిస్తున్న తీరు ఆకట్టుకుంది. పిడకలు అయిపోయేంత వరకు ఈ పోరు కొనసాగింది. రెండు వర్గాల వారికి చెందిన 50 మంది స్పల్పంగా గాయపడగా, వారంతా స్వామి వారి బండారాన్ని పూసుకున్నారు. అర గంట పాటు జరిగిన పిడకల పోరుతో గ్రామంలో దుమ్ము ధూళి ఆకాశన్నంటింది. ప్రేమ వ్యవహరంలో వీరభద్రస్వామి, కాళికాదేవిల మధ్య ఏర్పడిన విభేదాలే ఈ సమరానికి కారణమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీన స్వామి, అమ్మవార్ల కల్యాణం, రథోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి రమేష్, సర్పంచ్ తిమ్మక్క గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. -
వీరభద్రుని సన్నిధిలో సంక్రాంతి వేడుకలు
భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో శనివారం జరిగిన మకర సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల మొక్కుల సమర్పణతోపాటు కొత్తపల్లికి చెందిన 65 ఎడ్లబండ్ల రథాలు, వేలేరుకు చెందిన మేకల బండ్లను తిలకించేందుకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్ తదితర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హనుమకొండ జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎడ్లబండిపై గుడి చుట్టూ తిరిగి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. -
ఈ గుడికి వెళ్తే.. సంతానం కలుగుతుందట
పచ్చటి వృక్షాలతో దట్టమైన అడవి, పెద్ద కొండ చరియ పై నుంచి జాలువారే జలపాతం, ప్రకృతి రమణీయత మైమరపించే అందాలకు ఆలవాలంగా నిలుస్తుంది పాలంక క్షేత్రం. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ఆదిశేషుని ఆకారం వంటి కొండచరియ కింద మూల విరాట్ పాలంకేశ్వరుడితో పాటు వీరభద్రుడు, గణపతి, పంచముఖ బ్రహ్మ, పోతురాజుల ఆలయాలు, పది అడుగుల ఎత్తున్న నాగమయ్య పుట్ట కొలువై ఉన్నాయి. సంతాన ప్రాప్తిని సిద్ధించే స్వామిగా భక్తుల పాలిట కొంగుబంగారంలా పూజలందుకుంటున్నారు. యర్రగొండపాలెం: దట్టమైన నల్లమల అడవిలో, కృష్ణానది ఒడ్డున పాలంక వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. స్వామి కరుణకోసం వేలాది మంది భక్తులు కాలినడకన, ప్రత్యేకవాహనాల్లో తరలివెళ్తారు. ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భక్తులు పాలంకకు చేరుకుంటారు. సంతాన ప్రాప్తి కోసం భక్తులు నల్లమల అడవుల్లోని పాలంక వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శిస్తారు. ఇక్కడి పెద్ద కొండచరియపై నుంచి పంచలింగాలపై జాలువారే నీటి బిందువుల కోసం సంతానం లేని దంపతులు దోసిళ్లు పడతారు. అలా దోసిళ్లపై నీటి బిందువులు పడిన దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీశైల క్షేత్రానికి సమీపంలో వెలసిన పర్వతాల మల్లయ్య పాలుట్ల గిరిజన గూడేనికి పది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. నల్లమల అందాలకు పరవశించిన పరమశివుడు ముగ్ధుడై పూజలందుకునేందుకు ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. స్వామిని ఇక్కడ పాలంకేశ్వరుడిగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో ఆరోగ్య, సౌభాగ్య, సంతాన ప్రదాత వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉన్నారు. ‘పర్వతాల మల్లయ్య, పాలంక వీరయ్య’ అంటూ పాడుకునే జానపద గేయాల ద్వారా ఈ క్షేత్రాన్ని శ్రీశైల క్షేత్రంతో పోల్చబడింది. ఏటా ఆషాడ శుద్ధ తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్సవాలు ప్రారంభమౌతాయి. కొండకోనల్లో ప్రయాణం సాగేదిలా శ్రీకృష్ణదేవరాయల వారి రక్షణ శ్రీశైలం క్షేత్రంతో విజయనగర సామ్రాజ్యధీశుడు శ్రీకృష్ణదేవరాయలకు ఎంత అనుబంధం ఉందో అంతే అనుబంధం పాలంక క్షేత్రంతోనూ ఉంది. రాయలవారు తూర్పు దండయాత్రల సందర్భంగా గజపతులను ఓడించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. అలా కృష్ణానది ఒడ్డున ప్రయాణం సాగిస్తుండగా ప్రజలు దారిదోపిడీ దొంగల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. అప్పుడు తన సైన్యాధిపతులైన బొడా వెంకటపతినాయుడు, నలగాటి పెద్ద తిమ్మనాయుడులకు ఈ ప్రాంతాన్ని జాగీరులుగా ఇచ్చి నది పక్కన ఆలాటం కోటను నిర్మించారు. అక్కడి నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో పాలంక వీరభద్రుడు, భద్రకాళీ మాతను ప్రతిష్టించి ఆ ప్రాంతానికి రక్షణ బాధ్యతను తన సైన్యాధిపతులకు అప్పగించారని చరిత్ర చెప్తుంది. అహ్లాదంగా కొండకోనల్లో భక్తిరస యాత్ర పాలంక క్షేత్రం యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం పంచాయతీ పరిధిలోకి వస్తుంది. అక్కడి నుంచి పాలంక చేరుకునేందుకు 42 కిలోమీటర్ల యాత్ర సాగించాలి. దట్టమైన నల్లమల అడవుల్లో ఆకాశాన్ని అంటే కొండల్లో నుంచి సాగే ఈ భక్తిరస యాత్ర ఎంతో అహ్లాదాన్ని కలిగిస్తుంది. విజయనగర సామ్రాజ్యధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు పాలన వైభవనాకి చెరిగిపోని జ్ఞాపకంగా ఈ పాలంక క్షేత్రం నిలుస్తుంది. -
పట్టిసీమ వీరభదేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
-
మహాశివరాత్రికి ముస్తాబవుతున్న ఆలయాలు
శివరాత్రికి విద్యుదీపాలంకరణలో ముస్తాబు కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కాళేశ్వరాలయం విద్యుత్‌దీపాలతో జిగేల్‌మంటోంది. మంగళవారం రాత్రి ఆలయంలోని ప్రధాన గర్భగుడిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో కాళేశ్వరాలయం ముస్తాబు కావడంతో శివరాత్రి శోభను సంతరించుకుంది. శివకేశవుల నిలయం పాలకుర్తి పుణ్యక్షేత్రం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో(క్షీరగిరి)పై వెలసిన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నర్సింహస్వామి లింగము స్వయంభువు. ఆలయ గుహల నుంచి∙ఓంకార ప్రణవనాదం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం. అదృశ్య రూపంలో ఉన్న సిద్ద పురుషులు అర్ధ రాత్రి వేళల్లో స్వామి వారిని అర్చించడానికి వస్తారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి లక్ష రెట్లు అధిక ఫలితంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్మిక. పక్కనే మరొక గుహలో శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వెలసి శివ కేశవులకు భేదం లేదని ప్రభోదిస్తున్నాడు. ఈ శివ పంచాయతన క్షేత్రంలో శివుడు శ్రీ సోమేశ్వరుడిగా, విష్ణువు లక్ష్మీనర్సింహుడిగా వేర్వేరు గుహల్లో స్వయంభువులుగా వెలసి ఉన్నారు. పూర్వ కాలంలో సూర్యభగవానుని ఆల యం ఉండగా.. ఇప్పుడు కూడా ఆనవాళ్లు కనిపిస్తాయి. స్వామిపై విశ్వాసం సడలినా, కొండకు పరిశుద్దులై రాకపోయినా స్వామి రక్షక భటులైన తేనేటీగలు వెంటపడి కొండను దిగేలా చేస్తాయి. ఇక్కడ శైవాగం, వైదికాగం ప్రకారంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. గిరిజనులు సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటాలతో ఎడ్ల బండ్లతో ప్రదర్శనగా రావడం జాతర ప్రత్యేకత. గ్రామంలో పంచగుళ్ల వద్ద ఉన్న కోనేరులో స్నానం చేసిన భక్తులు పంచగుళ్లు దర్శించుకుని సోమేశ్వర ఆలయానికి రావడానికి ఏర్పాట్లుచేశారు. పాలకుర్తి టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హరిహరులు స్వయంభువులుగా ఒకే గుట్టపై వెలసిన దివ్య క్షేత్రంగా పాలకుర్తి వెలుగొందుతుంది. ఏటా మహా శివరాత్రి సందర్బంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుండి భక్తులు తరలి రానున్నారు. 21న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారి కల్యాణం నిర్వహించనుండగా.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల కొంగుబంగారం కురవి వీరన్న కురవి: భక్తుల కల్పతరువుగా, నమ్మిన వారి కొంగు బంగారంగా కురవిలోని వీరభద్రస్వామి విలసిల్లుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రమైన భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహోత్సవాలు ఈనెల 20న గురువారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈనెల 21వ తేదీన(శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీ స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయచరిత్ర... క్రీ.శ. 850 ప్రాంతంలో వేంగి రాజధానిగా పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజు భీమరాజు కురవిని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అప్పుడే వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం కాకతీయ తొలి స్వతంత్ర రాజు ఒకటో బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రెండో బేతరాజు కురవి పక్కనే పెద్ద తటాకం(చెరువు)ను తవ్వించినట్లు చెబుతారు. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతి స్తంభ దీపాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇప్పటికి ఆ స్తంభం దర్శనమిస్తుంది. రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారి ప్రాశస్త్యం సకల క్తిమూర్తివరాల ప్రదాత అయిన వీరభద్రస్వామి పడమటముఖుడై దశహస్తుడై, త్రినేత్రుడై రౌద్రపరాక్రమములతో విలసిల్లుతున్నాడు. భక్తులను ఆదుకునే పరమభోళామూర్తిగా దర్శనమిస్తున్నాడు. క్షుద్రగణాలకు వీరభద్రుడంటే భయం. అందుకే ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్యాలు, సిరిసంపదలను అందుతాయని భక్తుల నమ్మిక. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి ఉండి శ్రీ భద్రకాళీ అమ్మవారు వెలసి ఉన్నారు. స్వామి వారికి ఇరువైపులా శివుడు(లింగాకారంలో) దర్శనమిస్తాడు. ఆలయానికి దక్షిణ దిశలో భద్రకాళి అమ్మవారు స్వయంశక్తిమూర్తిగా వెలిసి పూజలందుకుంటోంది. ఉత్సవాల్లో ముఖ్యఘట్టాలు.. జాతర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న ఉదయం 9గంటలకు పసుపు, కుంకుమలు అర్చకులు ఆలయానికి తీసుకొస్తారు. సాయంత్రం 7గంటలకు అంకురార్పణ, అఖండకలశస్థాపన, ధ్వజారోహనం, రాత్రి 10గంటలకు బసవ ముద్ద కార్యక్రమం ఉంటుంది. 21న మహాశివరాత్రి రోజున స్వామి వారి ఆలయంలో సేవలు, రాత్రి 1.20గంటలకు(తెల్లవారితే శనివారం) స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక 26వ తేదీన రథోత్సవం, 27వ తేదీన బండ్లు తిరుగుట, మార్చి 5వ తేదీన శ్రీ పార్వతీరామలింగేశ్వరస్వామి కల్యాణం, 6వ తేదిన పదహారు రోజుల పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి. ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి కల్యాణ మహోత్సవ జాతరకు ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బుధవారం నాటికి ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటుచేయగా... స్వామి కల్యాణ మహోత్సవం జరిగే నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో బారికేడ్లను ఆర్అండ్బీ అధికారులు నిర్మిస్తున్నారు. స్నాన ఘట్టాల వద్ద షవర్లు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. మొత్తంగా జాతర ఏర్పాట్లు 95శాతం పూర్తి అయ్యాయి. ఈ మేరకు ఏర్పాట్లను మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లపై కురవి ఎస్సై జక్కుల శంకర్రావుతో చర్చించారు. మహిమాన్వితుడు.. అగస్తీశ్వర స్వామి మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారు కొండపై స్వయంభూగా వెలసిన అగస్తీశ్వర స్వామి మహిమాన్వితుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22, 23వ తేదీల్లో నిర్వహించే మహాజాతర మహోత్సవానికి మూడు జిల్లాల నుంచి భక్తులు హాజరుకానుండగా.. నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు.. సిద్ధేశ్వరా నమోనమః! బచ్చన్నపేట: ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన జనగామ జిల్ల బచ్చన్నపేట మండలంలోని కొడ్వటూరు గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గంగపూజ, ఋత్వికరణం, అవాహన దేవత పూజ, 20న ఏకదశరుద్రాభిషేకం, రుద్రహోమం, శతరుద్రాభిషేకం, 21వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన శ్రీ భద్రకాశి వీరభద్రేశ్వరస్వామి ఆహ్వానం, రాత్రి శివపార్వతుల కల్యాణం, లింగోద్భవ పూజ ఉంటాయి. 22న ఉదయం అగ్నిగుండ ప్రవేశం, గెలుపు ఆశీర్వాదంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వామి కల్యాణానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. -
అన్యాయం ఎవరు చేశారో అందరికీ తెలుసు..
సాక్షి, విజయనగరం : గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లను ఖాళీ చేయించి ఇతరులకు కేటాయించడంలాంటి అన్యాయమైన చర్యలకు పాల్పడుతున్నారని జిల్లా టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే కోలగట్ల ఖండించారు. జిల్లా కేంద్రాస్పత్రి ఎదురుగా ఉన్న వైఎస్సార్ సీపీ జోనల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోలగట్ల మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. లంకా పట్టణంలో పట్టాలు ఉన్న వారిని పక్కన పెట్టి, తెలుగుదేశం పార్టీ నేతలు లంచాలు తిని ఇతరులకు ఇళ్లస్థలాలు కేటాయించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. 2009లో తాను శాసన సభ్యునిగా ఉన్న సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి 485 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇస్తే, ఆ పట్టాలను పక్కనపెట్టి ఇతరులకు గృహాలు కేటాయించినది టీడీపీ నేతలు కాదా అంటూ ప్రశ్నించారు. మేము ఇచ్చిన వారు పేదవారు కాదా? మీరు ఇచ్చిన వారు అర్హులా అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే కోలగట్ల సవాల్ విసిరారు. మా పరిపాలన ఎలా ఉందన్నది ఐదేళ్ల తరువాత ప్రజలు నిర్ణయిస్తారన్నారు. విజయనగరంలో రోడ్లు వెడల్పు పేరిట చేసిన పనులను దేశం నేతలు అస్తవ్యస్తం చేసి ఒక్క రోడ్డును కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవాచేశారు. -
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు
-
చంద్రబాబు పాలనలో అభివృద్ది శూన్యం
-
వీరభద్రుని ఉత్సవాలలో అపశృతి
-
వీరభద్రుని ఉత్సవాలలో అపశృతి
సాక్షి, రాయచోటి : వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి వీరభద్రుని ఉత్సవాలలో అపశృతి దొర్లింది. అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమంలో ఇద్దరు భక్తులు జారిపడ్డారు. ఈ సంఘటనలో రాయచోటికే చెందిన లక్ష్మిదేవి, రామాంజులమ్మలకు తీవ్రగాయాలవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. అయితే పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. మరో కానిస్టేబుల్‌కు గాయాలు: పాత రాయచోటికి చెందిన మరో మహిళ సైతం వీరభద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో పైర్ పోలీస్ మీసాల ఆనంద్ చేయి కాలిపోయింది. -
వైభవంగా వీరభద్ర స్వామి కల్యాణం
ఆస్పరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున కైరుప్పల గ్రామంలో వీరభద్ర స్వామి, కాళికాదేవిల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. పిడకల సమరం అనంతరం వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణోత్సవాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. కాళికాదేవి, వీరభద్ర స్వామి, పార్వతి సమేత పరమేశ్వరున్ని పల్లకీల్లో గ్రామంలో ఊరేగించారు. గ్రామంలో అదివారం సాయంత్రం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయ చైర్మన్ మల్లికార్జున, కార్యనిర్వాహణాధికారి రాంప్రసాద్, సర్పంచ్ శరవన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
కైరుప్పలలో పిడకల సమరం
-
ప్రేమను గెలిపించే పిడకల యుద్ధం
- కైరుప్పలలో ఉత్కంఠ భరిత పోరు - 40 మందికి స్వల్పగాయాలు - భారీగా తరలివచ్చిన భక్తజనం ఆస్పరి/ఆలూరు/ఆలూరు రూరల్: ప్రేమను గెలిపించే పిడకల యుద్ధం..కైరుప్పల గ్రామ ప్రత్యేకం. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఈ పోరు హోరాహోరీగా సాగింది. సమరంలో 40 మంది స్వల్పంగా గాయపడ్డారు. గ్రామస్తులంతా రెండు గ్రూపులుగా విడిపోయి పిడకలతో తలపడటం, ఆ తరువాత అంతా కలసిపోవడం విశేషం. పిడకల సమరాన్ని చూడటానికి జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రేమ వ్యవహరంలో వీరభద్ర స్వామి, కాళికాదేవి మధ్య ఏర్పడిన విభేదాలే రెండు గ్రూపులుగా విడిపోయి పిడకలతో దాడి చేసుకోవడానికి కారణమైందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి యేటా పిడకల సమరానికి ముందు.. కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తులు కైరుప్పలకు గుర్రంపై వచ్చే వారు. అయితే ఈ ఏడాది పెద్దరెడ్డి వంశస్తులకు అంటు ఉన్నందున వీరభద్రస్వామి చిత్రపటాన్ని గుర్రంపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామికి పూజలు చేసిన అనంతరం గుర్రం వెను తిరగగానే పిడకల సమరం మొదలైయింది. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి.. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. కుప్పగాపోసిన పిడకలు అయిపోయేంత వరకు పోరు కొనసాగింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు అంటించుకుని వెళ్లారు. ఉత్సవాలలో గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లికార్జున, కార్య నిర్వహణ అధికారి రాంప్రసాద్, సర్పంచ్ శరవన్న, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తరలి వచ్చిన జనం.. కైరుప్పలలో పిడకల సమరం తిలకించేందుకు గురువారం ప్రజలు.. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఆటోలు, ఎద్దుల బండ్లలో తరలి వచ్చారు. భారీగా తరలి వచ్చిన వాహనాలతో ఎమ్మిగనూరు- పత్తికొండ ప్రధాన రహదారి కిక్కిరిసింది. ఉత్సవం ముగిసిన తరువాత ఆస్పరి, కారుమంచి, బిల్లేకలు, యాటకల్లు, పుప్పాలదొడ్డి, వెంగళాయిదొడ్డి, చెన్నంపల్లి, కలపరి, బైలుపత్తికొండ, ఐనకల్లు, అట్టెకల్లు తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు కిక్కిరిసి.. రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలూరు సీఐ అబ్దుల్ గౌష్, ఎస్ఐ వెంకటరమణ బందో బస్తు నిర్వహించారు. -
నేడు కైరుప్పలలో పిడకల సమరం
ఆస్పరి: వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కైరుప్పల గ్రామంలో గురువారం సాయంత్రం పిడకల(నుగ్గులు) సమరం జరగనుంది. ఇందు కోసం పిడకలను సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో వీటిని రాశులుగా పోసి ఉంచారు. సమరాన్ని చూడడానికి మండలంలోని ఆస్పరి, కారుమంచి, బిల్లేకల్, చెన్నపల్లి, పుప్పాలదొడ్డి, యాటకల్, కలపరి, దొడగొండ, తురువగల్, అలారుదిన్నె, ముత్తుకూరు తదితర గ్రామాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు..వీరభద్రస్వామికి పిడకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. -
నేత్రపర్వం..రథోత్సవం
మార్మోగిన శివనామస్మరణ లేపాక్షి : లేపాక్షి మహాశివరాత్రి ఉత్సవాల్లో శనివారం రథోత్సవం అశేష భక్తజనసందోహం మధ్య నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆగమీకులు సునీల్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు సూర్యప్రకాష్, నరసింహశర్మ అభిషేకార్చన, రథసంప్రోక్షణ, దవనోత్సవం నిర్వహించారు. అనంతరం శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను వేదబ్రాహ్మణులచే పల్లకీలో మోసుకుని వచ్చి రథంలో కొలువుదీర్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బస్టాండ్ వద్ద రథాన్ని లాగారు. 1.30 గంటలకు ఎగువపేటలోని నందివిగ్రహం వద్దకు చేరుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ హనోక్, గ్రామ సర్పంచ్ జయప్ప, వైఎస్సార్సీపీ నాయకులు నారాయణస్వామి, ఆదినారాయణ, టైలర్ మూర్తి, నారాయణ, టీడీపీ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు చలపతి, చిన్న ఓబన్న పాల్గొన్నారు. -
వీరభద్రుడికి కోరమీసాలు
-
కాంగ్రెస్ ఓ దొంగల ముఠా!
ప్రాజెక్టులను అడ్డుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్ ► కురవిలో వీరభద్రుడికి కోరమీసాల మొక్కు చెల్లింపు సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు ఓ దొంగల ముఠా తయారైందని విమర్శించారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. రూ.36 వేల కోట్లతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గుంట పొలం కూడా ఎండిపోకుండా ఉండేందుకు ఇప్పటికే 9,500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి పంటలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. మరో 500 మెగావాట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘తెలంగాణ’ మొక్కుల్లో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీవీరభద్ర స్వామిని దర్శించు కున్నారు. రూ.62,908 వ్యయంతో 20.28 గ్రాముల బరువుతో తయారు చేయించిన కోర మీసాలను వీరభద్రుడికి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లిలోని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఇంట్లో భోజనం చేశారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు.. ప్రజలు 40 నుంచి 44 ఏళ్లు కాంగ్రెస్ నాయకులకు అవకాశమిస్తే ఏమీ చేయలేదని.. ఇప్పుడు తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ తరఫున కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని, వాటిపై స్పష్టమైన ఆధారా లతో అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. ‘‘ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర కాంగ్రెస్ నేతలది. వారివి బానిస బతుకులు. కాంగ్రెస్ కల్చర్ చీప్ లిక్కర్ పంచే కల్చర్. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దొంగల ముఠా తయారైంది. చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు..’’అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి మొక్కుల విషయంలో కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలందరూ బాగుండాలని తలపెట్టిన యాగంపై సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. త్వరలోనే టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన వరంగల్ రూరల్ జిల్లాలో త్వరలోనే టెక్స్టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. సూరత్, భీవండికి వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చేలా ఈ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి భూసేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. డోర్నకల్ నియోజకవర్గానికి తాత్కాలికంగా పాలేరు నుంచి నీరందిస్తామని హామీ ఇచ్చారు. మల్కాపూర్ దగ్గర రిజర్వాయర్ కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కోరారని.. దానికి కేబినెట్ ఓకే చెప్పిందని వెల్లడించారు. ఈసారి బీసీల బడ్జెట్ ఈ ఏడాది రూ.10–12 వేల కోట్లతో బీసీల బడ్జెట్ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది సంచార జాతుల వారు ఉన్నారని, వారి కోసం రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని యాదవుల కోసం రూ.4 వేల కోట్లతో 88 లక్షల గొర్రెలు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులు చెట్ల కింద, చెరువు కట్ట మీద క్షవరాలు చేసే పద్ధతి పోవాలని, రాష్ట్రవ్యాప్తంగా 40 వేల వరకు హైజెనిక్ సెలూన్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక రజకులకు డ్రైయింగ్ మిషన్, వాషింగ్ మిషన్లు అందజేసి అత్యాధునిక లాండ్రీ షాపులు ఏర్పాటు చేయిస్తామన్నారు. వీరభద్రుడి ఆలయానికి రూ.5 కోట్లు.. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ నుంచి రూ.28.25 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున, మిగతా 4 మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇస్తామ ని నియోజకవర్గంలోని 77 గ్రామ పంచాయ తీలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం, మంత్రులు ఇంద్రక రణ్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్, ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, కోరం కనకయ్య, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు కొండా మురళీ, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
24న కురవికి సీఎం
వీరభద్ర స్వామికి బంగారు కోర మీసాలు సమర్పించనున్న కేసీఆర్ సాక్షి, మహబూబాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 24న మహబూబాబాద్ జిల్లాలోని కురవికి రానున్నారు. 2001లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కురవి శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక స్వామివారికి కోరమీసాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు. ఈ మేరకు సీఎం మొక్కులు చెల్లించేందుకు వస్తున్నారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లాలోని శ్రీభద్రకాళి అమ్మవారికి కిరీటం, తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఆభరణాలు సమర్పించారు. కాగా, సీఎం రాక సంద ర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైభవంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు