
ప్రమాదంలో గాయపడిన మీసాల ఆనంద్
సాక్షి, రాయచోటి : వైఎస్‌ఆర్ జిల్లా, రాయచోటి వీరభద్రుని ఉత్సవాలలో అపశృతి దొర్లింది. అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమంలో ఇద్దరు భక్తులు జారిపడ్డారు. ఈ సంఘటనలో రాయచోటికే చెందిన లక్ష్మిదేవి, రామాంజులమ్మలకు తీవ్రగాయాలవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. అయితే పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు.
మరో కానిస్టేబుల్‌కు గాయాలు: పాత రాయచోటికి చెందిన మరో మహిళ సైతం వీరభద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో పైర్ పోలీస్ మీసాల ఆనంద్ చేయి కాలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment