వైభవంగా వీరభద్ర స్వామి కల్యాణం
ఆస్పరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున కైరుప్పల గ్రామంలో వీరభద్ర స్వామి, కాళికాదేవిల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. పిడకల సమరం అనంతరం వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణోత్సవాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. కాళికాదేవి, వీరభద్ర స్వామి, పార్వతి సమేత పరమేశ్వరున్ని పల్లకీల్లో గ్రామంలో ఊరేగించారు. గ్రామంలో అదివారం సాయంత్రం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయ చైర్మన్ మల్లికార్జున, కార్యనిర్వాహణాధికారి రాంప్రసాద్, సర్పంచ్ శరవన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.