kairuppala
-
కర్నూలు : హోరాహోరీగా పిడకల సమరం (ఫొటోలు)
-
ప్రేమికులను కలిపిన సమరం
ఆస్పరి: భక్తుల్లో భక్తి భావం ఉప్పొంగింది.. నుగ్గులు గాల్లోకి ఎగిరాయి. దుమ్ము ఆకాశాన్నంటింది.. పిడకల సమరం హోరాహోరీగా సాగింది. స్వామి అమ్మవార్ల ప్రేమను గెలిపించేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి తలపడిన దృశ్యాలు యుద్ధాన్ని తలపించాయి. కైరుప్పల గ్రామంలో దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయ ఆచారాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన పిడకల సమరాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలిరావడంతో కైరుప్పల కిటకిటలాడింది. ఆచారం ప్రకారం మండలంలోని కారుమంచి గ్రామానికి చెందిన పెద్ద రెడ్డి వంశస్తుడు నరసింహారెడ్డి మంది మార్భలం, తప్పెట్లు, మేళతాళాలతో గుర్రంపై కైరుప్పలకు చేరుకుని వీరభద్రస్వామిని దర్శించుకుని వెనుతిరిగిన వెంటనే పిడకల సమరం మొదలైంది. గ్రామంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. గాల్లోకి పిడకలు లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే అందరిలోనూ ఉత్సాహం ఉరకలు వేసింది. తమ వర్గం గెలవాలనే తపనతో మహిళలు పురుషులకు పిడకలు అందిస్తున్న తీరు ఆకట్టుకుంది. పిడకలు అయిపోయేంత వరకు ఈ పోరు కొనసాగింది. రెండు వర్గాల వారికి చెందిన 50 మంది స్పల్పంగా గాయపడగా, వారంతా స్వామి వారి బండారాన్ని పూసుకున్నారు. అర గంట పాటు జరిగిన పిడకల పోరుతో గ్రామంలో దుమ్ము ధూళి ఆకాశన్నంటింది. ప్రేమ వ్యవహరంలో వీరభద్రస్వామి, కాళికాదేవిల మధ్య ఏర్పడిన విభేదాలే ఈ సమరానికి కారణమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీన స్వామి, అమ్మవార్ల కల్యాణం, రథోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి రమేష్, సర్పంచ్ తిమ్మక్క గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. -
కర్నూలు : హోరాహోరీగా పిడకల సమరం
-
ప్రేమను గెలిపించిన పిడకల సమరం
ఆస్పరి: ప్రేమికులను విడదీసిన పెద్దలను చూసుంటాం.. ప్రేమ కథలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలనూ విని ఉంటాం. ప్రేమను గెలిపించే పోరాటం మాత్రం మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పోరాటమే ఒకటి సంప్రదాయంగా బుధవారం ఆస్పరి మండలం కైరుప్పలలో కొనసాగింది. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిని ఒక్కటి చేసింది. గతేడాది కరోనా కారణంగా నిలిచిపోయిన పిడకల సమరం ఈ ఏడాది వేలాది మంది సమక్షంలో హోరాహోరీగా సాగింది. ఈ సంగ్రామంలో 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. సంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నాగభూషణం రెడ్డి గుర్రంపై మందీ మార్బలం, తప్పెట్లు, మేళతాళాలతో కైరుప్పలకు వచ్చారు. దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరగగానే పిడకల సమరం మొదలైంది. వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులుగా గ్రామస్తులు విడిపోయారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా ప్రజలు కదిలారు. ఒక సారి ఒక వర్గం వారిది పైచేయి అయితే, మరో సారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. తమ వర్గం వారు గెలవాలనే తపనతో మహిళలు పిడకలు అందిస్తూ సాయంగా నిలిచారు. కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు అరగంట పాటు పోరు కొనసాగింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు అంటించుకుని వెళ్లారు. సంగ్రామం ముగిసిన తరువాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి.. కాళికాదేవి, వీరభద్రస్వామి వివాహానికి అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. వేడుకలో గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. ఆలూరు సీఐ భాస్కర్, ఎస్ఐ గిరిబాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈఓ రమేష్, సర్పంచ్ తిమ్మక్క, గ్రామ పెద్దలు ఉత్సవంలో పాల్గొన్నారు. చదవండి: పిల్లకు పాలు.. తల్లికి కూల్ డ్రింక్ లోకేష్, అచ్చెన్న ఎడమొహం.. పెడమొహం -
వైభవంగా వీరభద్ర స్వామి కల్యాణం
ఆస్పరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున కైరుప్పల గ్రామంలో వీరభద్ర స్వామి, కాళికాదేవిల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. పిడకల సమరం అనంతరం వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణోత్సవాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. కాళికాదేవి, వీరభద్ర స్వామి, పార్వతి సమేత పరమేశ్వరున్ని పల్లకీల్లో గ్రామంలో ఊరేగించారు. గ్రామంలో అదివారం సాయంత్రం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయ చైర్మన్ మల్లికార్జున, కార్యనిర్వాహణాధికారి రాంప్రసాద్, సర్పంచ్ శరవన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.