
సాక్షి, లేపాక్షి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హిందూపూర్ ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న లేపాక్షి ఉత్సవాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇంతలోనే లేపాక్షిలో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. ఆకాశం నిండా మేఘాలు కమ్ముకొని భీకరంగా మారిపోయింది. దీంతో భారీ ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. అయితే వర్షం తగ్గుముఖం పడితే ఆలస్యంగానైనా ఉత్సవాలను ప్రారంభించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment