స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు బుధవారం సాయంత్రం బైకును కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు.
లేపాక్షి : స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు బుధవారం సాయంత్రం బైకును కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కల్లూరు గ్రామానికి చెందిన దస్తగిరి (35), అతని కుమారుడు ఇర్ఫాన్ (17) బైకుపై లేపాక్షి నుంచి కల్లూరుకు వెళ్తున్నారు. అయితే (ఏపీ 02 1619) కారు అతి వేగంగా వెనుక వైపు నుంచి వచ్చి Éీ కొంది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరికీ తల, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.