అనంతపురం జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో ఒకటైన లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని అఖిల భారత పంచాయతీ పరషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజినేయులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
లేపాక్షి : అనంతపురం జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో ఒకటైన లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని అఖిల భారత పంచాయతీ పరషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజినేయులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అతి త్వరలో లేపాక్షికి మహర్దశ రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి శాస్త్ర, సాంకేతిక, విద్య, సాంస్కృతిక సంస్థ (యునెస్కో, ఫారిస్) తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు దక్కనున్నట్టు కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ), ప్రపంచ హెరిటేజ్ డైరెక్టర్ లూర్దుసామి హైదరాబాద్, పురావస్తు శాఖ సూపరింటెండెంట్ లూహీర్‌కు ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు.
లేపాక్షికి సంబంధించిన గొప్ప ఫొటోలు, యూనివర్సల్ వాల్యూస్, స్థలం, డ్రాయింగ్స్‌ను యునెస్కో ఫార్మాట్‌లో పంపాలని ఆదేశించిందని తెలిపారు. అవి పంపిన వెంటనే తుది జాబితాలో లేపాక్షి చేరుతుందని పేర్కొన్నారు. అయితే ఈనెల 3న ఢిల్లీలోని ప్రధాని కార్యాలయ కార్యదర్శి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రాకేష్‌తివారీకి వినతిపత్రాలు సమర్పించినట్టు ఆయన వివరించారు.